AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Niramaya Scheme: దివ్యాంగులకు ఆరోగ్య ధీమా.. ఈ బీమా పథకంలో ఉచితంగా సేవలు..

సాధారణ ప్రజలకు అనేక రకాల ప్రయోజనాలతో ప్లాన్లు ఆయా కంపెనీలు అందిస్తున్నాయి. అయితే దివ్యాంగులకు పెద్దగా ప్లాన్లు అందుబాటులో ఉండవు. ఒకవేళ ఉన్నా అధిక రేట్లను కలిగి ఉంటాయి. మరి అలాంటి వారు ఏం చేయాలి? అందుకే ప్రభుత్వమే ఓ మంచి ఆరోగ్య బీమా పథకాన్ని దివ్యాంగుల కోసం తీసుకొచ్చింది. దాని పేరు నిరామయ ఆరోగ్య బీమా పథకం.

Niramaya Scheme: దివ్యాంగులకు ఆరోగ్య ధీమా.. ఈ బీమా పథకంలో ఉచితంగా సేవలు..
Health Insurance Scheme
Madhu
|

Updated on: Feb 24, 2024 | 6:53 AM

Share

కరోనా అనంతర పరిణామాల్లో హెల్త్ ఇన్సురెన్స్ అవసరాన్ని ప్రజలు గుర్తించారు. అందుకే అందరూ ఏదో ఒక హెల్త్ ఇన్సురెన్స్ ను కలిగి ఉంటున్నారు. సాధారణ ప్రజలకు అనేక రకాల ప్రయోజనాలతో ప్లాన్లు ఆయా కంపెనీలు అందిస్తున్నాయి. అయితే దివ్యాంగులకు పెద్దగా ప్లాన్లు అందుబాటులో ఉండవు. ఒకవేళ ఉన్నా అధిక రేట్లను కలిగి ఉంటాయి. మరి అలాంటి వారు ఏం చేయాలి? అందుకే ప్రభుత్వమే ఓ మంచి ఆరోగ్య బీమా పథకాన్ని దివ్యాంగుల కోసం తీసుకొచ్చింది. దాని పేరు నిరామయ ఆరోగ్య బీమా పథకం. ఇది సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ కింద ఒక చట్టబద్ధమైన సంస్థ అయిన నేషనల్ ట్రస్ట్ ద్వారా అమలవుతోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

పథకం లక్ష్యం ఇదే..

జాతీయ ట్రస్ట్ చట్టం, 1999 కింద కవర్ అవుతున్న దివ్యాంగులకు సరసమైన ఆరోగ్య బీమాను అందించడం నిరామయ పథకం ప్రధాన లక్ష్యం. ఈ పథకం రీయింబర్స్‌మెంట్ ప్రాతిపదికన సంవత్సరానికి రూ. 1 లక్ష వరకు ఆరోగ్య బీమా రక్షణను అందిస్తుంది.

నిరామయ ఆరోగ్య బీమా ఫీచర్స్ ఇవి..

  • సరసమైనది, సరళమైనది: వయస్సుతో సంబంధం లేకుండా కేవలం ఒక స్థిర ప్రీమియం చెల్లించే వీలు దీనిలో ఉంటుంది.
  • అందరికీ సమాన కవరేజీ: మీ వైకల్యంతో సంబంధం లేకుండా, మీరు అదే స్థాయిలో ఆరోగ్య సంరక్షణ మద్దతును పొందుతారు.
  • ఆర్థిక సహాయం: రీయింబర్స్‌మెంట్ ప్రాతిపదికన మాత్రమే బీమా కవరేజ్ ఉంటుంది.
  • విస్తృత శ్రేణి సేవలు: రెగ్యులర్ చెకప్‌లు, ఆస్పత్రిలో చేరడం, చికిత్సలు, దిద్దుబాటు శస్త్రచికిత్సలు, రవాణా కోసం కూడా కవరేజీని ఆస్వాదించొచ్చు.
  • వైద్య పరీక్షలు అవసరం లేదు: మీ కవరేజీని వెంటనే ప్రారంభించొచ్చు. బీమాకు ముందు వైద్య పరీక్షలు అవసరం లేదు.
  • హాస్పిటల్స్‌లో ఫ్లెక్సిబిలిటీ: ఎలాంటి పరిమితులు లేకుండా మీ చికిత్స కోసం ఏదైనా ఆస్పత్రిని ఎంచుకోవచ్చు.

లాభాలు..

ఆరోగ్య బీమా కవరేజీ: వివిధ హాస్పటల్ ఖర్చుల కోసం రూ. 1,00,000/- వరకు కవరేజ్ లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఔట్ పేషెంట్ విభాగం (OPD) చికిత్స: ఔషధాలు, పాథాలజీ, రోగనిర్ధారణ పరీక్షలు మొదలైనవాటిని కవర్ చేస్తుంది.

రెగ్యులర్ మెడికల్ చెకప్‌లు: వైకల్యాలున్న అనారోగ్యం లేని వ్యక్తుల కోసం రెగ్యూల్ మెడికల్ చెకప్స్ ఉంటాయి. దంత సంరక్షణ: ప్రివెంటివ్ డెంటిస్ట్రీ సేవలు పొందొచ్చు.

శస్త్రచికిత్స: వైకల్యం మరింత తీవ్రతరం కాకుండా నిరోధించడానికి లేదా ఇప్పటికే ఉన్న వైకల్యాలకు (పుట్టుకతో సహా) ఆపరేషన్ చేసేందుకు వీలు కల్పిస్తుంది.

నాన్-సర్జికల్/హాస్పిటలైజేషన్: నాన్-సర్జికల్ చికిత్సలు, సంబంధిత హాస్పిటల్ చార్జీలు కవర్ అవుతాయి.

కొనసాగుతున్న చికిత్సలు: వైకల్యం, సంబంధిత సమస్యల నిర్వహణ కోసం కవరేజ్ ఉంటుంది.

ప్రత్యామ్నాయ ఔషధం: ప్రత్యామ్నాయ చికిత్స ఎంపికల కోసం కవరేజ్ ఉంటుంది.

రవాణా ఖర్చులు: వైద్య సంరక్షణకు సంబంధించిన రవాణా కోసం రీయింబర్స్‌మెంట్ అవకాశం ఉంటుంది.

అర్హతలు ఇవి..

నేషనల్ ట్రస్ట్ యాక్ట్, 1999 ప్రకారం చెల్లుబాటు అయ్యే వైకల్య ధ్రువీకరణ పత్రాలతో కనీసం ఒక వైకల్యం ఉన్న ఎవరైనా దివ్యాంగులు ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆటిజం, సెరిబ్రల్ పాల్స్, మానసిక రుగ్మతలు, దివ్యాంగులు ఎవరైనా దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు ప్రక్రియ ఇలా..

దివ్యాంగుల తల్లిదండ్రులు/సంరక్షకులు అవసరమైన పత్రాలతో నిరామయ నమోదు కోసం సమీపంలోని రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్ (ఆర్ఓ)ని సందర్శించాలి. ఆర్ఓ నిరామయ దరఖాస్తు ఫారమ్‌ను ఆన్‌లైన్‌లో నింపి, అసలైన వాటి ధ్రువీకరణ తర్వాత అవసరమైన విధంగా స్కాన్ చేసిన పత్రాలను అప్‌లోడ్ చేయాలి. నమోదు విజయవంతం అయిన తర్వాత, ప్రతి లబ్ధిదారునికి హెల్త్ ఐడీ నంబర్ /కార్డ్ జారీ అవుతుంది. లేదా లబ్ధిదారు ఆన్‌లైన్ లేదా ఆర్ఓ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

అవసరమైన పత్రాలు..

జిల్లా ఆసుపత్రి లేదా తగిన ప్రభుత్వ అధికారి నుంచి జారీ చేసిన వైకల్య ధ్రవీకరణ పత్రం. పేదరిక స్థాయికి దిగువన లేదా బీపీఎల్ కార్డ్ (లబ్దిదారుడు బీపీఎల్ వర్గానికి చెందినవారైతే), చిరునామా రుజువు, లబ్దిదారుడు ఏపీఎల్ వర్గానికి చెందినట్లయితే ఆదాయ ధ్రువీకరణ పత్రం.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!