IPO Allotment: ఐపీవోతో కంపెనీలకు ఇంత లాభమా? అసలు ప్రక్రియను తెలుసుకుంటే షాక్ అవుతారు..

స్టాక్ మార్కెట్ లో కంపెనీలు ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) విధానం ద్వారా తమ షేర్ల విక్రయాలు చేస్తాయి. ఇందుకోసం సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) అనుమతి తీసుకుంటాయి. సాధారణంగా కంపెనీలు తమ వ్యాపారాన్ని విస్తరించడం, ఉత్పత్తిని పెంచుకోవడం, నష్టాలను పూడ్చుకోవడం కోసం ఐపీవోకు వస్తాయి. దీని ద్వారా తమ వాటాలను ప్రజలకు విక్రయిస్తాయి.

IPO Allotment: ఐపీవోతో కంపెనీలకు ఇంత లాభమా? అసలు ప్రక్రియను తెలుసుకుంటే షాక్ అవుతారు..
Ipo
Follow us

|

Updated on: Jun 30, 2024 | 6:47 PM

స్టాక్ మార్కెట్ గురించి ఇటీవల ప్రజలకు అవగాహన బాగా పెరిగింది. వివిధ కంపెనీల షేర్లను కొనడం, అమ్మడం చేస్తున్నారు. ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు బాగా పెరిగాయి. అయితే స్టాక్ మార్కెట్ లోకి కంపెనీలు ఎలా ప్రవేశిస్తాయి. తమ వాటాలను ఎలా విక్రయిస్తాయనే విషయంపై అవగాహన తక్కువగా ఉంటుంది. అయితే ఇటీవల కంపెనీలు ఐపీఓలకు ఎక్కువగా వెళ్తున్నాయి. దీంతో ఐపీఓ అంటే ఏమిటి అన్న ప్రశ్నలు కూడా చాలా మంది నెటిజనులు గూగుల్ ని అడుగుతున్నారు. ఈ క్రమంలో అసలు ఐపీఓ అంటే ఏమిటి? కంపెనీలు ఐపీఓకి వెళ్లడం వల్ల లాభాలు ఏంటి? దానిలో ప్రజలు ఎలా భాగస్వాములు కావొచ్చు? తెలుసుకుందాం..

ఐపీవో అంటే..

స్టాక్ మార్కెట్ లో కంపెనీలు ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) విధానం ద్వారా తమ షేర్ల విక్రయాలు చేస్తాయి. ఇందుకోసం సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) అనుమతి తీసుకుంటాయి. సాధారణంగా కంపెనీలు తమ వ్యాపారాన్ని విస్తరించడం, ఉత్పత్తిని పెంచుకోవడం, నష్టాలను పూడ్చుకోవడం కోసం ఐపీవోకు వస్తాయి. దీని ద్వారా తమ వాటాలను ప్రజలకు విక్రయిస్తాయి. తద్వారా మూలధనాన్ని సేకరించుకుని వ్యాపారాన్ని విస్తరించుకుంటాయి.

మూలధనం సేకరణ..

ఐపీవో విధానంలో పబ్లిక్ ఇన్వెస్టర్ల నుంచి ప్రైవేటు కంపెనీలు తమ వాటాలను విక్రయించి మూలధనాన్ని సేకరిస్తాయి. ఈ విధానంలో కంపెనీ బిడ్డింగ్ విండో మూడు రోజులు తెరిచి ఉంటుంది. ఈ సమయంలో పెట్టుబడిదారులు ఆ కంపెనీ షేర్ల కోసం దరఖాస్తు చేసుకుంటారు. ఆ తర్వాత కేటాయింపు ప్రక్రియ జరుగుతుంది. ఇది పెట్టుబడిదారుల నుంచి వచ్చిన ప్రతిస్పందనపై ఆధారపడి ఉంటుంది. వివిధ అంశాలు ఈ కేటాయింపు ప్రక్రియను ప్రభావితం చేస్తాయి.

సెబీ నిబంధనలు..

సెబీ నిబంధనల ప్రకారం షేర్లను కేటాయిస్తారు. అర్హత కలిగిన సంస్థాగత కొనుగోలుదారులు (క్యూఐబీ), సంస్థాగతేతర పెట్టుబడిదారులు, రిటైల్ పెట్టుబడిదారులు అనే మూడు వర్గాల వారు ఇందులో ఉంటారు. రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయించిన షేర్ విధానాన్ని అర్థం చేసుకునే ముందుగా లాట్ సైజ్ పై అవగాహన పెంచుకోవాలి. ఒక కంపెనీ ఐపీవోకి వచ్చినప్పుడు దాని మొత్తం ఈక్విటీ షేర్లను లాట్ లుగా విభజిస్తారు.

వారం రోజుల లోపు..

వాటాల కోసం వచ్చిన దరఖాస్తులు మొత్తం లాట్ ల కంటే తక్కువగా ఉన్నప్పుడు , ప్రతి ఒక్కరూ వేలం వేసిన లాట్‌ల సంఖ్యను అందుకుంటారు. అలాగే లాట్ల కంటే దరఖాస్తులు ఎక్కువ వచ్చినప్పుడు సెబీ నియమాలను పరిగణనలోకి తీసుకుంటారు. అప్పుడు ఏ వ్యక్తికి ఒక లాట్ కంటే ఎక్కువ కేటాయించరు. సాధారణంగా సబ్‌క్రిప్షన్ పిరియడ్ ముగిసిన ఒక వారంలోపు పెట్టుబడిదారులకు వారి డీమ్యాట్ ఖాతాల ద్వారా షేర్లను కేటాయిస్తారు.

షేర్లు కేటాయించకపోవడానికి కారణం..

కంపెనీల ఐపీవో ఆఫర్ లో షేర్లను కేటాయించకపోవడానికి కొన్ని కారణాలను ఉన్నాయి. దరఖాస్తుదారుడి పాన్ నంబర్, డీమ్యాట్ ఖాతా చెల్లక పోయినా, ఒకే పేరు మీద అనేక దరఖాస్తులు వచ్చినా వారికి షేర్లు కేటాయించరు. భారీ ఓవర్ సబ్‌స్క్రిప్షన్ విషయంలో, షేర్ల కేటాయింపు కోసం లక్కీ డ్రా ప్రక్రియ తర్వాత దరఖాస్తు ఏదీ కేటాయించబడదు.

చివరిగా..

ప్రైవేటు కంపెనీలు పబ్లిక్ యాజమాన్యానికి మారే దశలో ఐపీవో అనేది చాలా కీలకం. దీనిని ఇన్వెస్టర్లు అర్థం చేసుకుని, వాటాలను కొనుగోలు చేయాలి. అన్ని విషయాలను పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..