AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Suzuki e-access: సుజుకీ నుంచి తొలి ఎలక్ట్రిక్ స్కూటర్.. అదిరే ఫీచర్లు.. సూపర్ రేంజ్

ప్రస్తుతం ఎక్కడ చూసినా ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాల హవా నడుస్తోంది. కొత్తగా టూ వీలర్‌ కొనుగోలు చేయాలనుకునే వారు ముందుగా వీటికే ప్రాధాన్యం ఇస్తున్నారు. మార్కెట్‌లో ఉన్న డిమాండ్‌కు అనుగుణంగా దాదాపు అన్ని ద్విచక్ర వాహనాల కంపెనీలు ఎలక్ట్రిక్‌ విభాగంలో మోడళ్లను విడుదల చేస్తున్నాయి. అయితే ప్రముఖ కంపెనీ సుజుకి మాత్రం కాస్త ఆలస్యంగా ఈ విభాగంలోకి రానుంది. తన మొట్టమొదటి ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను ఇ-యాక్సెస్‌ పేరుతో మార్కెట్‌లోకి విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో ఆ స్కూటర్‌ ప్రత్యేకతలు, ధర, ఇతర వివరాలను తెలుసుకుందాం.

Suzuki e-access: సుజుకీ నుంచి తొలి ఎలక్ట్రిక్ స్కూటర్.. అదిరే ఫీచర్లు.. సూపర్ రేంజ్
Suzuki E Access
Nikhil
|

Updated on: Jun 03, 2025 | 4:15 PM

Share

దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఏడాది జనవరిలో భారత్‌ మొబిలిటీ గ్లోబల్‌ ఎక్స్‌పో జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా అనేక కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శించాయి. దీనిలోనే సుజుకీ కంపెనీ తన ఇ-యాక్సెస్‌ను ప్రదర్శనకు ఉంచింది. ఆ కంపెనీ ఇప్పటికే యాక్సెస్‌ పేరుతో ఐసీటీ వెర్షన్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ స్కూటర్‌కు ప్రజల నుంచి ఎంతో ఆదరణ లభించింది. దీంతో ఆ పేరునే ఎలక్ట్రిక్‌ స్కూటర్‌కు తీసుకున్నారు. అయితే ఇ-యాక్సెస్‌ (ఎలక్ట్రిక్‌) స్కూటర్‌కు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి.

ఇ-యాక్సెస్‌ స్కూటర్‌ ఆధునిక లుక్‌తో అత్యద్భుతంగా కనిపిస్తోంది. ముందు సన్నని ఎల్‌ఈడీ హెడ్‌ ల్యాంప్‌ ఏర్పాటు చేశారు. అప్రాన్‌పై నిలువుగా ఎల్‌ఈడీ డేటైమ్‌ రన్నింగ్‌ లాంప్‌ అమర్చారు. ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన అల్లాయ్‌ వీల్స్‌, పొడవైన సీటు, వెనుక భాగంలో డ్యూయల్‌ టోన్‌ కలర్‌ డిజైన్‌ ఆకట్టుకుంటున్నాయి. పెర్ల్‌ గ్రేస్‌ వైట్‌, మెటాలిక్‌ మ్యాట్‌ బోర్డయక్స్‌ రెడ్‌, మెటాయిక్‌ పైబ్రోయిన్‌ గ్రే రంగుల్లో అందుబాటులో ఉంది.

నగరంలోని ట్రాఫిక్‌ రద్దీలో చాలా సులభంగా నడిపేలా ఈ స్కూటర్‌ను రూపొందించారు. ఇది గరిష్టంగా 5.49 బీహెచ్‌పీ శక్తిని, 15 ఎన్‌ఎం టార్కును విడుదల చేస్తుంది. దీనిలో ఏకో, రైడ్‌ ఏ, రైడ్‌ బి అనే మూడు రైడింగ్‌ మోడ్‌ లు ఉన్నాయి. ఈ స్కూటర్‌లో 3.072 కేడబ్ల్యూహెచ్‌ బ్యాటరీ ప్యాక్‌ ఏర్పాటు చేశారు. సింగిల్‌ చార్జింగ్‌పై సుమారు 95 కిలోమీటర్ల రేంజ్‌ ఇస్తుందని అంచనా. సుజుకి సొంత యాజమాన్య కనెక్టర్‌ను ఉపయోగించి చార్జింగ్‌ చేసుకోవచ్చు. పోర్టబుల్‌ ఏసీ చార్జర్‌తో 4.30 గంటల్లో సున్నా నుంచి 80 శాతం చార్జింగ్‌ అవుతుంది. ఇ-యాక్సెస్‌ డీసీ చార్జింగ్‌తో సున్నా నుంచి 80 శాతం చార్జింగ్‌ను కేవలం 1.12 గంటల్లో చేసుకోవచ్చు. అలాగే 2.12 గంటల్లో సున్నా నుంచి వంద శాతం చేసుకునే వీలుంది.

ఈ-యాక్సెస్ లో సీటు కింద స్టోరేజీ ఏర్పాటు చేశారు. యూఎస్ బీ పోర్టు, క్యూబీ స్పేస్, మల్టీ ఫంక్షన్ స్టార్టర్ నాబ్ ఉన్నాయి. వీటిలో సీటును తెరవొచ్చు, ఆన్ చేయవచ్చు. చార్జింగ్ ఫ్లాప్ ను ఓపెన్ చేసుకోవచ్చు. సుజుకి బ్యాక్ ఫంక్షనాలిటీతో కీలెస్ సిస్టమ్ ను అందిస్తుంది. స్టార్ట్ ఫోన్ కనెక్టివిటీతో కూడిన టీఎఫ్ టీ ఎల్సీడీ డిస్ ప్లే, ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ స్పీడో మీటర్, బ్యాటరీ స్థాయి, ఓడోమీటర్, క్లాక్, వోల్టమీటర్ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి.

బంగారం - వెండి కాదు.. ఇప్పుడు మార్కెట్‌లో దీనిదే హవా.. ఏడాదిలోనే
బంగారం - వెండి కాదు.. ఇప్పుడు మార్కెట్‌లో దీనిదే హవా.. ఏడాదిలోనే
ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తున్నారా..? ఒక్కసారి ఈ విషయాలు తెలుసుకోండి
ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తున్నారా..? ఒక్కసారి ఈ విషయాలు తెలుసుకోండి
8 ఫోర్లు, 8 సిక్స్‌లు.. 62 బంతుల్లోనే సెంచరీతో చెలరేగిన రోహిత్
8 ఫోర్లు, 8 సిక్స్‌లు.. 62 బంతుల్లోనే సెంచరీతో చెలరేగిన రోహిత్
మీ సెల్‌ఫోన్ పోయిందా.. అయితే ఇలా చేయండి.!
మీ సెల్‌ఫోన్ పోయిందా.. అయితే ఇలా చేయండి.!
సీనియర్ హీరోయిన్ నిరోషా గుర్తుందా.. ?
సీనియర్ హీరోయిన్ నిరోషా గుర్తుందా.. ?
నిరుద్యోగులకు అలర్ట్.. రైల్వేలో 22,000 గ్రూప్‌ డి ఉద్యోగాలు
నిరుద్యోగులకు అలర్ట్.. రైల్వేలో 22,000 గ్రూప్‌ డి ఉద్యోగాలు
సాఫ్ట్‌వేర్ గర్ల్ ఫ్రెండ్.. బద్మాష్ బాయ్ ఫ్రెండ్.. ఇద్దరు కలిసి
సాఫ్ట్‌వేర్ గర్ల్ ఫ్రెండ్.. బద్మాష్ బాయ్ ఫ్రెండ్.. ఇద్దరు కలిసి
బీపీ ఒకేసారి ఎక్కువైతే ఏం చేయాలి..? వెంటనే ఇలా చేస్తే తగ్గుతుంది!
బీపీ ఒకేసారి ఎక్కువైతే ఏం చేయాలి..? వెంటనే ఇలా చేస్తే తగ్గుతుంది!
సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తికి దారిలో ఏదో వస్తువు కనిపించింది..
సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తికి దారిలో ఏదో వస్తువు కనిపించింది..
ఆఖరికి సావే సచ్చిపోయింది.. రష్మిక మైసా గ్లింప్స్ రిలీజ్..
ఆఖరికి సావే సచ్చిపోయింది.. రష్మిక మైసా గ్లింప్స్ రిలీజ్..