AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Banana peel car: అరటితొక్క కారు అదుర్స్.. దీన్ని కూర్చుని కాదు పడుకుని నడపాలి..

సాధారణంగా అరటి పండు తిన్న తర్వాత తొక్కను వదిలేస్తాం. దాని వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని భావిస్తాం. ఆ తొక్క ఇంటి పరిసరాల్లో ఉంటే ఎవరైనా జారి పడతారనే భయంతో దూరంగా విసిరేస్తాం. అయితే అందరూ చిన్నరూపు చూసే అరటి తొక్క ఒక కారు తయారీకి ప్రేరణగా నిలిచిందంటే నమ్ముతారా. తైవాన్ చెందిన ఓ కంపెనీ అరటి తొక్క ప్రేరణతో హోండా సివిక్ కారును మోడిఫికేషన్ చేసింది. బనానా పీల్ పేరుతో రూపొందించిన ఈ కారు ఎంతో ఆకట్టుకుంటోంది. సాధారణ కార్లకు భిన్నంగా తయారు చేసిన ఈ కారును చూస్తే అనేక ప్రశ్నలు తలెత్తుతాయి. దీని ప్రత్యేకతలు, ఇతర వివరాలు తెలుసుకుందాం.

Banana peel car: అరటితొక్క కారు అదుర్స్.. దీన్ని కూర్చుని కాదు పడుకుని నడపాలి..
Banana Peel Car
Nikhil
|

Updated on: Jun 03, 2025 | 4:45 PM

Share

స్టాన్స్ గ్యారేజ్ తైవాన్ రూపొందించిన బనానా పీల్ కారు అతి తక్కువ ఎత్తులో ఉంటుంది. దీని చక్రాలు బయటకు కనిపించవు. సాధారణ కారును అడ్డంగా సగానికి కట్ చేస్తే, మిగిలే పైన భాగం మాదిరిగా కనిపిస్తుంది. ఈ మోడల్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అందరికీ ఆకర్షిస్తోంది. కార్ల అభిమానులకు కొత్తదనం అందిస్తోంది. ఈ కారును చూడగానే అందరికీ కలిగే ఒకే ఒక్క సందేహం. దీన్ని డ్రైవర్ ఎలా నడుపుతాడనే. నిజమే ఈ కారును డ్రైవర్ కూర్చుని కాకుండా పడుకుని నడపాలి.

అరటి తొక్క కారును అనేక ప్రత్యేకతలతో రూపొందించారు. సస్పెన్షన్ వ్యవస్థను తక్కువ రైడ్ ఎత్తుకు అనుమతించే విధంగా మార్పు చేశారు. వేగంగా వెళ్లడానికి దోహదపడేలా రూపొందించారు. తగ్గించిన సస్పెన్షన్ కు అనుగుణంగా బాడీని మంచి లుక్ లోకి తీసుకువచ్చారు. ఈ కారులో సీట్లు లేకపోవడం మరో అద్బుతం. డ్రైవర్ పడుకుని కారును నడపాలి. విండ్ షీల్డ్ కు బదులుగా కెమెరాల వ్యవస్థను ఉపయోగించి నావిగేట్ చేయాలి.

బనానా పీల్ కారుకు దానికి రంగు ఎంతో ప్రత్యేకతను తీసుకువచ్చింది. అరటి పండు తొక్క మాదిరిగా పసుపు రంగులో ఆకట్టుకుంటోంది. ఈ రంగును ఎంచుకోవడానికి పెద్ద చరిత్రే ఉంది. పసుపు రంగు ఏ వాతావరణంలోనైనా ప్రత్యేకంగా కనిపించడమే దీనికి ప్రధాన కారణం. ఇక ఈ కారు చక్రాలు బయటకు కనిపించవు. వరద నీటితో తేలుతున్న కారు మాదిరిగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

అతి తక్కువ ఎత్తు ఉన్నప్పటికీ ఈ కారు పనితీరు బ్రహ్మాండంగా ఉంటుంది. భూమి నుంచి కొన్ని మిల్లీమీటర్ల ఎత్తులో ప్రయాణం చేస్తుంది. తక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ ఉండడంతో చదునైన, అడ్డంకులు లేని నేలపైనే పరుగులు తీస్తుంది. అయితే సస్పెన్షన్, అలైన్ మెంట్ లో సర్దుబాటు చేయడం ద్వారా దీన్ని రోడ్డుపై ప్రయాణానికి అనువుగా మార్చుకోవచ్చు. ఈ కారును ఆటో ఎగ్జిబిషన్లలో ప్రదర్శించేందుకు తయారు చేశారు.

సోషల్ మీడియాలో బనానా పీల్ కారు విపరీతంగా వైరల్ అయ్యింది. కొందరు ఈ ఆవిష్కరణను ప్రశంసించగా, మరికొందరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కారులో ఎలా కూర్చోవాలి, ఈ కారు కాంక్రీటులో పాతి పెట్టనట్టు ఉంది, కారు చక్రాలు ఎక్కడ అంటూ కామెంట్లు పెట్టారు. అయితే ఈ కారును రోడ్లపై ఎప్పుడు చూస్తామనే విషయంలో స్పష్టత లేదు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి