Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PMSSY Scheme: పేదలకు భరోసాగా నిలుస్తోన్న ఈ కేంద్ర ప్రభుత్వ పథకం.. పూర్తి వివరాలు ఇవి..

ప్రజల జీవన పరిస్థితులను మెరుగుపరిచేందుకు ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. అనేక పథకాలు ప్రవేశపెడుతున్నాయి. ప్రజల ఆరోగ్య, సామాజిక స్థితిగతులను మార్చేందుకు, ప్రాంతీయ అసమానతలను అధిగమించేందుకు ప్రోత్సాహకాలను అందిస్తోంది. అలాంటి వాటిల్లో ప్రధాన మంత్రి స్వాస్థ్య సురక్ష యోజన(పీఎంఎస్‌ఎస్‌వై) ఒకటి. 2003లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకం చాలా ప్రయోజనాలను కలిగి ఉంది.

PMSSY Scheme: పేదలకు భరోసాగా నిలుస్తోన్న ఈ కేంద్ర ప్రభుత్వ పథకం.. పూర్తి వివరాలు ఇవి..
Insurance Policy
Follow us
Madhu

| Edited By: Janardhan Veluru

Updated on: Dec 20, 2023 | 3:19 PM

ప్రజల జీవన పరిస్థితులను మెరుగుపరిచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. అనేక పథకాలు ప్రవేశపెడుతున్నాయి. ప్రజల ఆరోగ్య, సామాజిక స్థితిగతులను మార్చేందుకు, ప్రాంతీయ అసమానతలను అధిగమించేందుకు ప్రోత్సాహకాలను అందిస్తోంది. అలాంటి వాటిల్లో ప్రధాన మంత్రి స్వాస్థ్య సురక్ష యోజన(PMSSY) ఒకటి. 2003లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకం చాలా ప్రయోజనాలను కలిగి ఉంది. అయితే దీని గురించి చాలా తక్కువ మందికి తెలుసు. దేశంలో నాణ్యమైన వైద్య విద్య సౌకర్యాలను పెంపొందించే లక్ష్యంగా దీనిని తీసుకొచ్చారు. సామాజిక అసమతుల్యతను సరిదిద్ది, ఆరోగ్య సంరక్షణను అందించాలనే సంకల్పంతో దీనిని తీసుకొచ్చారు. ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన..

ఈ కేంద్రం ప్రభుత్వ పథకంలో చేరాలంటే కనీస వయస్సు 18 సంవత్సరాలు. గరిష్ట వయస్సు 70 సంవత్సరాలు. సేవింగ్స్ బ్యాంక్ ఖాతా ఉన్న ప్రతి ఒక్కరూ పాలసీని తీసుకునేందుకు అర్హులు.అయితే ఆ బ్యాంకు ఖాతా ఆధార్ కార్డుతో అనుసంధానం చేసి ఉండాలి. వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ పొదుపు ఖాతాలు ఉంటే, అతను లేదా ఆమె ఒకే బ్యాంకు ఖాతా ద్వారా మాత్రమే పథకంలో చేరడానికి అర్హులు.

ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన ప్రయోజనాలు ఇవి..

యాక్సిడెంటల్‌ ఇన్సురెన్స్‌ కవర్‌ అనేది ప్రతి ఏడాది రెన్యూవల్‌ అవుతుంది. ఏదైనా అనుకోని ఘటన లేదా ప్రమాదం కారణంగా ఖాతాదారుడి మరణం సంభవిస్తే రూ. 2 లక్షల కవరేజీని చందాదారుడి నామినీకి చెల్లించబడుతుంది ప్రమాదం కారణంగా వికలాంగులైన ఇదే మొత్తంలో చెల్లిస్తారు. సబ్‌స్క్రైబర్ దీర్ఘకాలిక ఎంపికను పొందవచ్చు లేదా ప్రతి సంవత్సరం పథకాన్ని పునరుద్ధరించవచ్చు. సబ్‌స్క్రైబర్ ఎప్పుడైనా స్కీమ్ నుంచి నిష్క్రమించవచ్చు. భవిష్యత్తులో ఎప్పుడైనా సైన్ అప్ చేయవచ్చు. సబ్‌స్క్రైబర్ చెల్లించిన ప్రీమియం కోసం సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపును పొందుతుంది. సెక్షన్ 10(10డీడి) కింద రూ.1 లక్ష వరకు పొందే బీమా మొత్తం కూడా పన్ను రహితంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఈ బ్యాంకుల్లో ఖాతా ప్రారంభించొచ్చు..

యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, భారతీయ మహిళా బ్యాంక్, కెనరా బ్యాంక్, సెంట్రల్‌ బ్యాంకు, ఫెడరల్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, కేరళ గ్రామీణ బ్యాంక్, కోటక్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, సౌత్ ఇండియన్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.

రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ..

  • ప్రభుత్వ జన్ సురక్ష వెబ్‌సైట్ నుంచి దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
  • మీరు ఖాతా కలిగి ఉన్న బ్యాంకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ సౌకర్యం ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించవచ్చు.
  • ఆన్‌బోర్డింగ్ సంస్థ టోల్-ఫ్రీ నంబర్‌కు ఎస్‌ఎంఎస్‌ పంపడం ద్వారా కూడా ప్రక్రియను ప్రారంభించవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..