AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Postal Parcel Service: హైదరాబాద్‌వాసులకు గుడ్‌ న్యూస్‌.. డోర్‌ స్టెప్‌ సర్వీస్‌ స్టార్‌ చేసిన పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌..

ముఖ్యంగా ప్రైవేట్‌ కొరియర్‌ సంస్థలు కస్టమర్‌ ఇళ్ల నుంచే సర్వీస్‌ ఇచ్చేలా పార్శిల్‌ పికప్‌ను ప్రారంభించి ప్రజలకు అ‍త్యంత చేరువ అవుతున్నాయి. అలాగే ఆయా సంస్థల వద్దకు వెళ్లి కొరియర్‌ చేయాలన్నా అక్కడ పెద్దగా లైన్స్‌ లేకపోవడంతో ఇండియా పోస్ట్స్‌ కంటే ఇటీవల కాలంలో ప్రైవేట్‌ కొరియర్‌ సంస్థలకే పార్శిల్లను అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో హోమ్‌ పికప్‌ ప్రాధాన్యతను అర్థం చేసుకున్న ఇండియా పోస్ట్స్‌ డోర్‌స్టెప్‌ పికప్‌ సర్వీసులను ప్రారంభించింది.

Postal Parcel Service: హైదరాబాద్‌వాసులకు గుడ్‌ న్యూస్‌.. డోర్‌ స్టెప్‌ సర్వీస్‌ స్టార్‌ చేసిన పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌..
Post Office
Nikhil
| Edited By: Janardhan Veluru|

Updated on: Dec 20, 2023 | 3:21 PM

Share

భారతీయులకు ఏవైనా లెటర్లు పోస్టు చేయాలంటే ముందుగా గుర్తు వచ్చేది ఇండియా పోస్ట్స్‌. ఎందుకంటే మారుమూల ప్రాంతాలకు కూడా లెటర్లను డెలివరీ ఇవ్వగలిన సామర్థ్యం ఇండియా పోస్ట్స్‌ సొంతం. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా ఇటీవల కాలంలో ప్రైవేట్‌ కొరియర్‌ సంస్థల పోటీ ఇండియా పోస్ట్స్‌ను తెగ ఇబ్బంది పెడుతుంది. ముఖ్యంగా ప్రైవేట్‌ కొరియర్‌ సంస్థలు కస్టమర్‌ ఇళ్ల నుంచే సర్వీస్‌ ఇచ్చేలా పార్శిల్‌ పికప్‌ను ప్రారంభించి ప్రజలకు అ‍త్యంత చేరువ అవుతున్నాయి. అలాగే ఆయా సంస్థల వద్దకు వెళ్లి కొరియర్‌ చేయాలన్నా అక్కడ పెద్దగా లైన్స్‌ లేకపోవడంతో ఇండియా పోస్ట్స్‌ కంటే ఇటీవల కాలంలో ప్రైవేట్‌ కొరియర్‌ సంస్థలకే పార్శిల్లను అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో హోమ్‌ పికప్‌ ప్రాధాన్యతను అర్థం చేసుకున్న ఇండియా పోస్ట్స్‌ డోర్‌స్టెప్‌ పికప్‌ సర్వీసులను ప్రారంభించింది. ఈ సేవలను విస్తరిస్తూ ఇప్పుడు హైదరాబాద్‌లో కూడా ఈ సేవలను అందించనుంది. ఈ నేపథ్యంలో ఇండియా పోస్ట్స్‌ హైదరాబాద్‌కు తీసుకొచ్చిన కొత్త సర్వీసుల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

హైదరాబాద్‌లోని కస్టమర్లు తమ పార్శిళ్లను బుక్ చేసుకోవడానికి పోస్టాఫీసులో పెద్ద క్యూలో నిలబడాల్సిన రోజులు పోయాయి. హైదరాబాద్ నగర వినియోగదారులు ఇప్పుడు వారి లెటర్లతో పాటు పార్శిళ్లను వారి ఇంటి వద్ద నుంచి సేకరించేలా స్పీడ్ పోస్ట్‌ సర్వీస్‌ తెలంగాణ పోస్టల్ డిపార్ట్‌మెంట్ ప్రారంభించింది. ఈ సర్వీస్‌ ఏకంగా 107 పిన్‌కోడ్‌లలో అందుబాటులో ఉంది.  వినియోగదారులు ఇకపై వారి ఇళ్ల నుండే రిజిస్టర్డ్ లెటర్లను క్లిక్‌ అండ్‌ బుక్‌ సర్వీస్‌ ద్వారా పంపవచ్చని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఒకసారి గరిష్టంగా 5 కిలోల బరువుతో ఐదు కథనాలను బుక్ చేసుకోవచ్చు.

టారిఫ్ 500 కంటే ఎక్కువ ఉంటే ఉచిత పికప్ అందిస్తారు. అయితే బుకింగ్ ఛార్జీ 500 కంటే తక్కువ ఉంటే 50 వసూలు చేస్తారని తెలంగాణ పోస్టల్ సర్కిల్ అసిస్టెంట్ డైరెక్టర్ ఎన్‌ఎస్‌ఎస్‌ రామకృష్ణ ఇటీవల ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సేవలు పొందేందుకు కస్టమర్లు పోస్టల్ శాఖ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవచ్చు.ఆదివారం, స్థానిక, గెజిటెడ్ సెలవులు మినహా అదే రోజు లేదా తదుపరి పని రోజున ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కస్టమర్‌లు పికప్ కోసం స్లాట్‌లను బుక్ చేసుకోవచ్చు  అయితే వీటిల్లో ఇండియా పోస్ట్ వెబ్‌సైట్‌లో జాబితా చేసిన నిషేధిత వస్తువులను బుక్ చేయకూడదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం