PPF vs FD: ఆ పోస్టాఫీస్‌ పథకాల్లో పెట్టుబడితో మంచి రాబడి.. ఈ నెలాఖరులోపు డిపాజిట్‌ చేస్తే బెటర్‌

ముఖ్యంగా పోస్టాఫీస్‌ వంటి పథకాల్లో పెట్టుబడితో మంచి రాబడి పొందవచ్చని సూచిస్తున్నారు. అయితే ఆర్‌బీఐ సెప్టెంబర్‌ 30 నుంచి మళ్లీ వడ్డీ రేట్లు సవరిస్తుందనే వార్తలు మార్కెట్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ పథకాల్లో పెట్టుబడికి ఇదే మంచి సమయమని సూచిస్తున్నారు. కాబట్టి ప్రస్తుతం ఏయే పథకాల్లో వడ్డీ రేట్లు అధికంగా ఉన్నాయో? ఓ సారి చెక్‌ చేద్దాం.

PPF vs FD: ఆ పోస్టాఫీస్‌ పథకాల్లో పెట్టుబడితో మంచి రాబడి.. ఈ నెలాఖరులోపు డిపాజిట్‌ చేస్తే బెటర్‌
Post Office Scheme
Follow us
Srinu

|

Updated on: Sep 23, 2023 | 7:30 PM

కష్టపడి సంపాదించిన సొమ్ముకు మంచి రాబడి కావాలని ప్రతి పెట్టుబడిదారుని కోరిక. ప్రభుత్వం కూడా పొదుపు ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వివిధ పెట్టుబడిపథకాలపై అధిక వడ్డీ రేట్లు అందిస్తుంది. దాదాపు రెండేళ్ల నుంచి ఆర్‌బీఐ చర్యలతో భారతదేశంలో డిపాజిట్లపై అధిక వడ్డీ రేట్లు లభిస్తున్నాయి. అయితే గత రెండు త్రైమాసికాల నుంచి రెపోరేటు యథాతథంగా ఉంచడంతో వడ్డీ రేట్లు పెంపునకు బ్రేక్‌ పడింది. అయితే గత ఐదేళ్ల నుంచి పోల్చుకుంటే ఈ వడ్డీ రేట్లు బెటర్‌ అని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పోస్టాఫీస్‌ వంటి పథకాల్లో పెట్టుబడితో మంచి రాబడి పొందవచ్చని సూచిస్తున్నారు. అయితే ఆర్‌బీఐ సెప్టెంబర్‌ 30 నుంచి మళ్లీ వడ్డీ రేట్లు సవరిస్తుందనే వార్తలు మార్కెట్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ పథకాల్లో పెట్టుబడికి ఇదే మంచి సమయమని సూచిస్తున్నారు. కాబట్టి ప్రస్తుతం ఏయే పథకాల్లో వడ్డీ రేట్లు అధికంగా ఉన్నాయో? ఓ సారి చెక్‌ చేద్దాం.

వడ్డీ రేట్లు అత్యధిక రేట్ల వద్ద ఉన్నప్పటికీ స్థిర-ఆదాయ సాధనాలు కూడా ఆకర్షణీయమైన పెట్టుబడి మార్గాలుగా మారాయి. వీటిలో బ్యాంక్‌ ఎఫ్‌డీలు, పీపీఎఫ్‌ జాతీయ పొదుపు ధ్రువపత్రాలు, పోస్టాఫీసు డిపాజిట్లు, సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్‌లు ఉన్నాయి. వడ్డీ రేట్ల విషయానికి వస్తే సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ వార్షిక వడ్డీని 8.2 శాతం, బ్యాంక్ ఎఫ్‌డీలు 7.75 శాతం, పోస్టాఫీసు టైమ్ డిపాజిట్లపై 7.5 శాతం వార్షిక వడ్డీ రేటును అందిస్తోంది. పీపీఎఫ్‌ 7.1 శాతం వడ్డీ రేటును వస్తుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ డిపాజిట్ పదవీకాలం, డిపాజిటర్ వయస్సు ఆధారంగా ఎఫ్‌డీపై 7.75 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది. ఎస్‌బీఐ ఏటా 7.50 శాతం వరకు ఎఫ్‌డీ రేట్లను అందిస్తోంది. పీఎన్‌బీ సంవత్సరానికి 7.75 శాతం వరకు ఇస్తోంది. ప్రస్తుతం చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు నాలుగు శాతం (పోస్టాఫీసు సేవింగ్స్ డిపాజిట్లు), 8.2 శాతం (సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్) మధ్య ఉంటాయి. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో 10-సంవత్సరాల జీసెక్‌ ఇప్పటివరకు 7.0 శాతం, 7.2 శాతం మధ్య ఉంది. 

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం వడ్డీ రేట్లు ఇలా

  • సేవింగ్స్ డిపాజిట్ 4 శాతం
  • 1 సంవత్సరం పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్లు 6.9 శాతం
  • 2-సంవత్సరాల పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్లు 7.0 శాతం
  • 3-సంవత్సరాల పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్లు 7 శాతం
  • 5-సంవత్సరాల పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్లు 7.5 శాతం
  • 5-సంవత్సరాల రికరింగ్ డిపాజిట్లు 6.5 శాతం
  • నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్లు (ఎన్‌ఎస్‌సీ): 7.7 శాతం
  • కిసాన్ వికాస్ పత్ర: 7.5 శాతం (115 నెలల్లో మెచ్యూర్ అవుతుంది)
  • పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్: 7.1 శాతం
  • సుకన్య సమృద్ధి ఖాతా: 8.0 శాతం
  • సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్: 8.2 శాతం
  • నెలవారీ ఆదాయ ఖాతా: 7.4 శాతం.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం

రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!