Post office RD: ఐదేళ్లలో రూ. 10.71లక్షలు సంపాదించొచ్చు.. నెలనెలా పొదుపు చేయాలనుకునే వారికి ఇదే బెస్ట్..

పోస్టాఫీసులే కాకుండా, ఈ ఆర్‌డీ పథకాన్ని బ్యాంకులు కూడా నిర్వహిస్తాయి. అయితే, పోస్టాఫీసుతో పోల్చితే బ్యాంకులలో ఆర్‌డీలపై వడ్డీ రేట్లు భిన్నంగా ఉంటాయి. పోస్టాఫీసు ఆర్‌డీ పథకంలో నెలకు రూ. 5,000, రూ. 10,000, రూ. 15,000 పెట్టుబడి పెడితే నెలకు రూ. 3.57 లక్షలు, రూ. 7.14 లక్షలు, రూ. 10.71 లక్షల వరకు పొందవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..

Post office RD: ఐదేళ్లలో రూ. 10.71లక్షలు సంపాదించొచ్చు.. నెలనెలా పొదుపు చేయాలనుకునే వారికి ఇదే బెస్ట్..
Post Office Scheme
Follow us

|

Updated on: Apr 21, 2024 | 3:47 PM

ప్రజలను పొదుపు మార్గంలో నడిపించేందుకు ప్రభుత్వం పోస్టాఫీసు ద్వారా పలు పథకాలను అమలు చేస్తోంది. అనేక రకాల పథకాలను పోస్టాఫీసులో అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా స్మాల్‌ సేవింగ్‌ స్కీమ్‌లు బాగా ప్రాచుర్యం పొందాయి. వీటిల్లో ఎక్కువ శాతం మంది ప్రజలు పెట్టుబడులు పెడుతున్నారు. అలాంటి వాటిల్లో నేషనల్‌ సేవింగ్స్‌ రికరింగ్‌ డిపాజిట్‌ అకౌంట్‌ లేదా ఐదేళ్ల పోస్టాఫీస్‌ రికరింగ్‌ డిపాజిట్‌ అకౌంట్‌(ఆర్‌డీ) ఒకటి. ఇక్కడ, పెట్టుబడిదారుడు నెలవారీ డిపాజిట్లు చేయవచ్చు. ఐదేళ్ల లాక్-ఇన్ వ్యవధి ముగింపులో మెచ్యూరిటీ మొత్తాన్ని పొందవచ్చు. ఇది హామీతో కూడిన రిటర్న్స్‌ ఇచ్చే పథకం కాబట్టి, సురక్షితమైన పెట్టుబడి ఎంపికలను కోరుకునే వ్యక్తులు, మార్కెట్-లింక్డ్ మార్గాల్లో పెట్టుబడి పెట్టకూడదనుకునే వ్యక్తులు వీటిల్లో పెట్టుబడులు పెట్టొచ్చు. పోస్టాఫీసులే కాకుండా, ఈ ఆర్‌డీ పథకాన్ని బ్యాంకులు కూడా నిర్వహిస్తాయి. అయితే, పోస్టాఫీసుతో పోల్చితే బ్యాంకులలో ఆర్‌డీలపై వడ్డీ రేట్లు భిన్నంగా ఉంటాయి. పోస్టాఫీసు ఆర్‌డీ పథకంలో నెలకు రూ. 5,000, రూ. 10,000, రూ. 15,000 పెట్టుబడి పెడితే నెలకు రూ. 3.57 లక్షలు, రూ. 7.14 లక్షలు, రూ. 10.71 లక్షల వరకు పొందవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..

అర్హతలు ఇవి.. పోస్టాఫీసు ఆర్‌డీలో ఒక సింగిల్ లేదా జాయింట్ ఖాతాను తెరవవచ్చు. మైనర్ తరఫున గార్డియన్, లేదా మానసిక స్థితి లేని వ్యక్తి తరపున లేదా 10 ఏళ్లు పైబడిన మైనర్ పేరు మీద ఖాతా తెరవవచ్చు.

వడ్డీ రేటు.. ఈ పోస్టాఫీసు పథకంలో 6.7 శాతం వార్షిక వడ్డీ రేటును అందిస్తుంది. ఇది ప్రతి త్రైమాసికానికి ఖాతాలో జమవుతుంది.

కనీస, గరిష్ట డిపాజిట్లు.. ఈ పథకంలో కనీస డిపాజిట్ నెలకు రూ. 100 లేదా రూ. 10 గుణకాలలో ఏదైనా మొత్తం. అయితే, గరిష్ట డిపాజిట్లకు పరిమితి లేదు. ఆర్డీ ఖాతా నిలిపివేయబడకపోతే 5 సంవత్సరాల వరకు అడ్వాన్స్ డిపాజిట్లు కూడా చేయవచ్చు.

మెచ్యూరిటీ కాలం.. ఆర్‌డీ ఖాతాకు మెచ్యూరిటీ వ్యవధి ఐదేళ్లు, అయితే ఖాతాను మరో ఐదేళ్ల పాటు పొడిగించుకోవచ్చు. ఖాతా తెరిచిన తేదీ నుంచి మూడు సంవత్సరాల తర్వాత కూడా అకౌంటును ముందుగానే మూసివేయవచ్చు.

ఆర్‌డీపై లోన్.. ఖాతా ప్రారంభించిన తర్వాత 12 వాయిదాలు సమయానికి జమచేసిన తర్వాత ఖాతాదారుడు ఖాతాలోని బ్యాలెన్స్ క్రెడిట్‌లో 50 శాతం వరకు రుణ సౌకర్యాన్ని పొందవచ్చు

పెట్టుబడి.. రాబడి..

  • మీరు పోస్టాఫీసు ఆర్‌డీలో ఐదేళ్లపాటు (60 నెలలు) నెలకు రూ. 5,000 చొప్పున పెట్టుబడి పెడితే, మీ మొత్తం డిపాజిట్లు రూ. 3,00,000, వచ్చే వడ్డీ రూ. 56,830, మీ మెచ్యూరిటీ మొత్తం రూ. 3,56,830 అవుతుంది.
  • ఐదేళ్లపాటు నెలకు రూ. 10,000 పెట్టుబడిపై, మీ మొత్తం డిపాజిట్ రూ. 6,00,000, సంపాదించిన వడ్డీ రూ. 1,13,659 మెచ్యూరిటీ మొత్తం రూ. 7,13,659 అవుతుంది.
  • మీరు మీ పెట్టుబడి మొత్తాన్ని నెలకు రూ. 15,000కి పెంచి, దానిని ఐదేళ్లపాటు పెట్టుబడి పెడితే, ఆ కాలంలో మీ మొత్తం డిపాజిట్లు రూ. 9,00,000, వడ్డీ మొత్తం రూ. 1,70,492, మెచ్యూరిటీ సమయానికి మొత్తం రూ. 10,70,492 అవుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..