AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2024 Suzuki Swift: భద్రతకు గొప్ప భరోసా.. క్రాష్ టెస్ట్‌లో 4 స్టార్ రేటింగ్ సాధించిన కొత్త స్విఫ్ట్..

జపాన్ లో నిర్వహించిన ఎస్సీఏపీ క్రాష్ టెస్ట్ ఫలితాలను సుజుకీ ప్రకటించింది. జపాన్ లో లాంచ్ చేసిన స్విఫ్ట్ కారుకు ఐదు స్టార్లకు గానూ ఏకంగా 4 స్టార్ల రేటింగ్ వచ్చింది. అయితే భారతీయ రోడ్లకు తగ్గట్టుగా ఈ కారుకు కొన్ని మార్పులు చేయడంతో పాటు కొన్ని స్పెసిఫికేషన్లలో మార్పులుంటాయి. దీంతో క్రాష్ టెస్ట్ ఫలితాల్లో కూడా ఇండియన్ మోడల్ కు అదే తరహా రేటింగ్ వచ్చే అవకాశాలు తక్కువ.

2024 Suzuki Swift: భద్రతకు గొప్ప భరోసా.. క్రాష్ టెస్ట్‌లో 4 స్టార్ రేటింగ్ సాధించిన కొత్త స్విఫ్ట్..
Crash Test
Madhu
|

Updated on: Apr 21, 2024 | 5:17 PM

Share

మారుతి సుజుకీ మరో కొత్త వాహనాన్ని లాంచ్ చేసేందుకు సర్వం సిద్ధం చేసింది. నాలుగో జనరేషన్ స్విఫ్ట్ ను మన దేశీయ మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ముహూర్తం ఫిక్స్ చేసింది. ఇది మొదట జపాన్ లో లాంచ్ అయ్యింది. కాగా వచ్చే నెల అంటే మే నెలలో ఈ కొత్త జనరేషన్ స్విఫ్ట్ మన ఇండియాలోని రోడ్లపైకి రానుంది. ఈ నేపథ్యంలో జపాన్ లో నిర్వహించిన ఎస్సీఏపీ క్రాష్ టెస్ట్ ఫలితాలను సుజుకీ ప్రకటించింది. జపాన్ లో లాంచ్ చేసిన స్విఫ్ట్ కారుకు ఐదు స్టార్లకు గానూ ఏకంగా 4 స్టార్ల రేటింగ్ వచ్చింది. అయితే భారతీయ రోడ్లకు తగ్గట్టుగా ఈ కారుకు కొన్ని మార్పులు చేయడంతో పాటు కొన్ని స్పెసిఫికేషన్లలో మార్పులుంటాయి. దీంతో క్రాష్ టెస్ట్ ఫలితాల్లో కూడా ఇండియన్ మోడల్ కు అదే తరహా రేటింగ్ వచ్చే అవకాశాలు తక్కువ.

క్రాష్ టెస్ట్ రేటింగ్ ఇలా..

జపాన్ కు చెందిన ఈ ఏజెన్సీ 2024 స్విఫ్ట్ కారుకు ప్రివెంటివ్ సేఫ్టీ పెర్ఫామెన్స్ అండ్ కొలిషన్ సేఫ్టీ పెర్ఫామెన్స్ పరీక్ష నిర్వహించింది. కారు దేనినైనా ఢీకొట్టినప్పుడు డ్యామేజ్ కంట్రోల్ కోసం నిర్వహించిన వివిధ పరీక్షల్లో ఐదుకు ఐదు రేటింగ్ సాధించింది. అదే సమయంలో సీట్ బెల్ట్ వార్నింగ్, వెనుక కూర్చున్న వారి సంరక్షణ, ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు కారు యాక్సలరేషన్ తగ్గడం వంటి తదితర అంశాల్లో ఎన్సీఏపీ నాలుగు స్టార్ల రేటింగ్ ఇచ్చింది.

2024 మారుతి సుజుకీ స్విఫ్ట్ ఎక్స్ టీరియర్..

ఇండియన్ స్పెక్ స్పిఫ్ట్ కారులో కొత్త తరహా బంపర్లు వచ్చే అవకాశం ఉంది. అయితే ఐకానిక్ సిల్ హౌటే ని అలాగే కొనసాగించింది. అలాగే కొత్త సెట్ అల్లాయ్ వీల్స్, వెనుకవైపు డోర్ హ్యాండిల్స్ ఇచ్చారు.

2024 మారుతి సుజుకీ స్విఫ్ట్ ఇంటీరియర్..

ఈ కారు లోపల బ్లాక్ , ఆఫ్ వైట్ థీమ్ తో క్యాబిన్ ఇచ్చారు. దీనిని న్యూ జెన్ బాలెనో మోడల్లో తీర్చిదిద్దారు. సరికొత్త ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్, అప్ డేటెడ్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్ దీనిలో అమర్చారు.

2024 మారుతి సుజుకీ స్విఫ్ట్ ఇంజిన్..

ఈకారులో జెడ్12ఈ కోడ్ నేమ్ కూడిన త్రీ సిలెండర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ యూనిట్ ఉంటుంది. ఇది 80బీహె 108ఎన్ఎం గరిష్ట టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. అయితే ఇది ప్రస్తుతం ఉన్న స్విఫ్ట్ కన్నా కొంచెం తక్కువ. ఇది ప్రతి లీటర్ పై 24 కిలోమటర్ల మేలేజీని అందిస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..