Electric Vehicles: అవునా! నిజమా? ఎలక్ట్రిక్ వాహనాలతో అన్ని సమస్యలున్నాయా? అసలు విషయం తెలుసుకోండి..
ఎలక్ట్రిక్ వాహనాలపై కొన్ని అనుమనాలు, సందేహాలు కూడా వెల్లువెత్తుతున్నాయి. వినియోగదారులకు వాటిపై సరైన అవగాహన లేకపోవంతో కొన్ని వదంతులు, అపోహలు విస్తృతమవుతున్నాయి. వాటిల్లో ప్రధానమైనవి ఎలక్ట్రిక్ వాహనాల ధర ఎక్కువ, నాణ్యతుండవు, మెయింటెనెన్స్ కూడా ఎక్కువ అంటూ పలు విధాలుగా రూమర్స్ సమాజంలో చక్కర్లు కొడుతున్నాయి. వాటిల్లో నిజమెంత? వాస్తవం ఏమిటి? తెలుసుకుందాం రండి..

ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. మార్కెట్లో నెమ్మదిగా తమ స్థానాన్ని మెరుగుపరుచుకుంటున్నాయి. మన భారతదేశంలో కూడా కార్లు, బైక్లు, స్కూటర్లు పెద్ద సంఖ్యలోనే లాంచ్ అవుతున్నాయి. ప్రతి కంపెనీ ఎలక్ట్రిక్ వేరియంట్లపై దృష్టి సారిస్తున్నాయి. అత్యాధునిక ఫీచర్లతో పాటు అధిక రేంజ్ ఇచ్చే విధంగా వాహనాలను కంపెనీలు తీసుకొస్తున్నాయి. ఇదే క్రమంలో ఈ ఎలక్ట్రిక్ వాహనాలపై కొన్ని అనుమనాలు, సందేహాలు కూడా వెల్లువెత్తుతున్నాయి. వినియోగదారులకు వాటిపై సరైన అవగాహన లేకపోవంతో కొన్ని వదంతులు, అపోహలు విస్తృతమవుతున్నాయి. వాటిల్లో ప్రధానమైనవి ఎలక్ట్రిక్ వాహనాల ధర ఎక్కువ, నాణ్యతుండవు, మెయింటెనెన్స్ కూడా ఎక్కువ అంటూ పలు విధాలుగా రూమర్స్ సమాజంలో చక్కర్లు కొడుతున్నాయి. వాటిల్లో నిజమెంత? వాస్తవం ఏమిటి? తెలుసుకుందాం రండి..
మెయింటెనెన్స్ చాలా అవసరం.. ఎలక్ట్రిక్ వాహనాలకు మెయింటెన్స్ చాలా అసవరమని ఓ అపోహ స్ప్రెడ్ అవుతోంది. అయితే వాస్తవం మరోలా ఉంది. ఐసీఈ వాహనాలతో పోల్చితే ఈవీలలో రన్నింగ్ కాస్ట్ అనేది చాలా తక్కువ. ఎందుకంటే ఎలక్ట్రిక్ వాహనాల్లో లోపల తిరిగే భాగాలు చాలా తక్కువ. టైర్లు, బ్రేక్‌లు, సస్పెన్షన్ మొదలైన అనేక సాధారణ భాగాలను ఈ ఈవీలు కలిగి ఉంటాయి. బయట చక్రాలు తప్ప.. లోపలి భాగాలకు ఎటువంటి మెయింటెనెన్స్ అవసరం లేదు.
పెట్రోల్ కార్ల కంటే ఈవీల ధర ఎక్కువ.. ట్రోల్ కారును ఈవీతో పోల్చినప్పుడు, ప్రారంభ కొనుగోలు ధర కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అయినప్పటికీ, రోజువారీ రన్నింగ్ ప్రాతిపదికన, పెట్రోల్ కార్ల కంటే ఈవీల ధర చాలా తక్కువ. అలాగే, కాలక్రమేణా, పెట్రోల్ ఇంజిన్ ఆయిల్, వాల్వ్ తనిఖీలు, ఇంజెక్టర్ క్లీనింగ్, మరెన్నో అవసరమవుతాయి. కానీ ఈవీలో ఇవి ఏవీ అవసరం లేదు.




ఎలక్ట్రిక్ వాహనాలు ఖరీదైనవి.. టెస్లా లేదా బీఎండబ్ల్యూ వంటి ఎలక్ట్రిక్ వాహనాలు ఖరీదైనవే. అయినప్పటికీ, మన దేశంలో టాటా నెక్సాన్, టియాగో, మహీంద్రా ఎక్స్యూవీ400 వంటి మోడళ్లు సరసమైన ధరలకే అందుబాటులోకి వచ్చాయి.
ఎలక్ట్రిక్ కార్లు నెమ్మదిగా ఉంటాయి.. ఇది వినియోగిస్తే మీకే అర్థం అవుతుంది. ఈ వాహనాల్లో యాక్సెలరేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాక టాప్ స్పీడ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. హైవేలపై సగటున 100 నుండి 120కి.మీ. వేగంతో దూసుకెళ్లగలవు.
ఛార్జింగ్ సౌకర్యం సమస్య.. అనేక ఇతర దేశాల వలె మన దేశంలో విస్తృతమైన ఈవీ ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు లేనప్పటికీ, చాలా రహదారులు ఈవీ ఫాస్ట్ ఛార్జర్‌లను కలిగి ఉంటాయి. బ్యాటరీలను జ్యూస్ అప్ చేయడానికి కొన్ని గంటలు పడుతుంది. అందుబాటులో ఉన్న అన్ని ఛార్జింగ్ స్టేషన్‌లు తయారీదారులతో సహా వివిధ యాప్‌లలో మ్యాప్ చేసి ఉంటాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..