Health Insurance: ఆరోగ్య బీమా తీసుకుంటున్నారా..? ఈ విషయాలను తప్పక తెలుసుకోండి!
Health Insurance: కరోనా కాలం నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే వారి సంఖ్య పెరిగిపోయింది. గతంలో ఆరోగ్య బీమా పాలసీల గురించి పెద్దగా పట్టించుకోకపోయినా..
Health Insurance: కరోనా కాలం నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే వారి సంఖ్య పెరిగిపోయింది. గతంలో ఆరోగ్య బీమా పాలసీల గురించి పెద్దగా పట్టించుకోకపోయినా.. ఇప్పుడు పాలసీలు కొనుగోలు చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. రోజురోజుకు కొత్త కొత్త వైరస్‌లు వ్యాపిస్తుండటంతో అనారోగ్యం బారిన పడే వారి సంఖ్య పెరిగిపోతోంది. దీనివల్ల ఆసుపత్రుల చుట్టు తిరగాల్సి ఉంటుంది. వైద్యానికి కూడా చాలా ఖర్చు అవుతుంది. వైద్య ఖర్చులను నివారించడానికి ప్రజలు ఆరోగ్య బీమాపై చాలా శ్రద్ధ వహిస్తున్నారు. ఆరోగ్య ప్రణాళిక సహాయంతో, ఆసుపత్రికి సంబంధించిన అనేక పెద్ద ఖర్చులను అధిగమించవచ్చు. చాలా కంపెనీలు మార్కెట్‌లో హెల్త్ ప్లాన్‌లను అందిస్తున్నప్పటికీ, వాటిలో ఏది మంచిదో తెలుసుకోవడంలో చాలా మంది తికమక పడుతుంటారు.
పాలసీలు తీసుకునే ముందు గుర్తించుకోవాల్సిన విషయాలు:
☛ వయస్సు ప్రమాణాలు
☛ ప్రీమియం, కవరేజ్
☛ వెయిటింగ్ పీరియడ్
☛ క్యాష్‌లెస్ హాస్పిటలైజేషన్ ప్రయోజనాలు
☛ ముందు ఆసుపత్రిలో చేరిన తర్వాత కవరేజ్, ప్రసూతి కవరేజ్, నో-క్లెయిమ్-బోనస్/నో-క్లెయిమ్-డిస్కౌంట్
ఇంకో విషయం ఏంటంటే ఆరోగ్య బీమా పాలసీలు తీసుకునే ముందు పాలసీకి సంబంధించిన వివరాలన్ని పూర్తిగా తెలుసుకోవడం మంచిది. లేకపోతే ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఏవైనా సందేహాలుంటే ముందుగానే ఇన్సురెన్స్ ఏజెంటును గానీ, సంబంధిత అధికారులను అడగండి. ఎందులో ఎక్కువ ప్రయోజనాలు ఉంటే ఈ పాలసీని కొనుగోలు చేయడం మంచిదంటున్నారు నిపుణులు.
కొన్ని పాలసీలు ఆస్పత్రి గది అద్దె చెల్లింపులు, ఐసీయూ ఛార్జీలపై పరిమితి ఉంటుంది. అలాంటి విషయాలను ముందుగానే తెలుసుకోవడం మంచిది. పరిమితి ఖర్చులను మాత్రమే కంపెనీలు చెల్లిస్తుంటాయి. తర్వాత అదనపు మొత్తాన్ని పాలసీదారుడే చెల్లించాల్సి ఉంటుంది. దీని కారణంగా కొన్ని ఛార్జీలు మీరే భరించాల్సి వస్తుంటుంది. అలాంటి పాలసీలను తీసుకోకపోవడం మంచిది. మీ ఆస్పత్రి చికిత్స ఖర్చులు కొంత శాతం మాత్రమే బీమా కంపెనీలు చెల్లిస్తుంటాయి. మిగతా ఖర్చులు మీరే భరించుకోవాల్సి ఉంటుంది. పరిమితులు లేని పాలసీలు తీసుకోవడం మంచిది.
ఇంకో విషయం ఏంటంటే మీరు చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరిలో ముందుగా మొత్తం బిల్లులు చెల్లించిన తర్వాత క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా కొన్ని పాలసీలు మీరు ఎలాంటి ఖర్చు పెట్టుకోకుండానే మొత్తం కంపెనీ చూసుకుంటుంది. ఆస్పత్రిలో చేరిన తర్వాత డబ్బులతో పని లేకుండా ఆస్పత్రి యాజమాన్యం సదరు బీమా కంపెనీతో సంప్రదింపులు జరిపి బిల్లును క్లెయిమ్ చేసుకుంటాయి. అలాంటి పాలసీలను తీసుకోవడం మంచిది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి