Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

HDFC Bank: విస్తరణ యోచనలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్.. కొత్తగా మరిన్ని శాఖలు తెరిచేందుకు కసరత్తు..

హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సితో విలీనం తర్వాత తన విస్తరణ ప్రణాళికను మరింత వేగవంతం చేసేందకు కసరత్తు చేస్తోంది...

HDFC Bank: విస్తరణ యోచనలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్.. కొత్తగా మరిన్ని శాఖలు తెరిచేందుకు కసరత్తు..
HDFC
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Jun 22, 2022 | 6:43 AM

హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సితో విలీనం తర్వాత తన విస్తరణ ప్రణాళికను మరింత వేగవంతం చేసేందకు కసరత్తు చేస్తోంది. బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ శశిధర్ జగదీశన్ మాట్లాడుతూ, రాబోయే మూడు నుంచి ఐదేళ్లలో తన బ్రాంచ్‌ల నెట్‌వర్క్‌ను రెట్టింపు చేసే ప్రణాళికపై బ్యాంక్ పనిచేస్తోందని, ఇది ప్రతి ఐదేళ్లకు మరో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌ను జోడించడానికి సమానమని అన్నారు. ప్రణాళిక ప్రకారం బ్యాంకు ప్రతి సంవత్సరం కొత్త శాఖలను తెరుస్తుందన్నారు. హెచ్‌డిఎఫ్‌సి , హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌ల విలీనంపై సిఈఓ తన స్టాండ్‌ను తెలియజేసిన షేర్‌హోల్డర్‌లకు రాసిన లేఖలో జగదీశన్ పేర్కొన్నారు. ప్రస్తుతం బ్యాంకుకు దేశవ్యాప్తంగా 6000 శాఖలు ఉన్నాయి. జనాభాకు సంబంధించిన శాఖల సాంద్రత చాలా తక్కువగా ఉందని చెప్పారు. బ్రాంచ్ బ్యాంకింగ్ వ్యూహానికి ఇదే కారణం.

రాబోయే మూడు నుండి ఐదు సంవత్సరాలలో ప్రతి సంవత్సరం కొత్త శాఖలను తెరవడం ద్వారా మా నెట్‌వర్క్‌ను దాదాపు రెట్టింపు చేయాలని మేము ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. ఏప్రిల్‌లోనే, హెచ్‌డిఎఫ్‌సి, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ విలీనాన్ని ప్రకటించాయి. ఇది వచ్చే ఏడాదిన్నరలో పూర్తవుతుందని భావిస్తున్నారు. గృహ రుణం దేశానికి అత్యంత ముఖ్యమైన ఆర్థిక ఉత్పత్తి అయినందున ఈ విలీనం చాలా ప్రయోజనకరంగా ఉంటుందని, ఇది విస్తరణలో బ్యాంకుకు చాలా ప్రయోజనం చేకూరుస్తుందని జగదీషన్ అన్నారు. RERA ప్రక్రియలో మరింత పారదర్శకతను నిర్ధారించిందన్నారు. ప్రాపర్టీ మార్కెట్ ధరలను మెరుగుపరచడంతో ఇన్వెంటరీలో తగ్గింపును చూసిందని పేర్కొన్నారు. అలాగే, పెరుగుతున్న ఆదాయం అంటే గృహ రుణ EMI భారం ఇప్పుడు తగ్గిందని వివరించారు. ఇవన్నీ రానున్న కాలంలో గృహ రుణాల విభాగం గణనీయంగా వృద్ధి చెందే అవకాశం ఉందని సూచిస్తున్నాయని తెలిపారు.

ఇవి కూడా చదవండి

గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో బ్యాంక్ 563 శాఖలను ప్రారంభించింది. కొత్తగా 7,167 మంది ఉద్యోగులను చేర్చుకుంది. మొత్తం ఆర్థిక సంవత్సరం గురించి మాట్లాడినట్లయితే, HDFC బ్యాంక్ 734 శాఖలను ప్రారంభించింది. 21,486 మంది ఉద్యోగులను నియమించుకుంది. మార్చి 2022 చివరి నాటికి HDFC బ్యాంక్ మొత్తం డిపాజిట్లు 16.8 శాతం పెరిగి రూ. 1,559,217 కోట్లకు చేరుకున్నాయి. మరోవైపు, 2021-22 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ప్రైవేట్ రంగ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ స్టాండ్‌లోన్ ప్రాతిపదికన నికర లాభం దాదాపు 23 శాతం పెరిగి రూ.10,055.20 కోట్లకు చేరుకుంది. వివిధ రంగాలలో రుణాలకు డిమాండ్ పెరగడం, మొండి బకాయిలకు ఆర్థిక సదుపాయం అవసరం తగ్గడం వల్ల బ్యాంక్ లాభంలో ఈ అద్భుతమైన వృద్ధి నమోదైంది.