HDFC Bank: ద్విచక్ర వాహనం కొనుగోలు చేసేవారికి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ అదిరిపోయే ఆఫర్‌..!

HDFC Bank: పండగ సీజన్‌లో కస్టమర్లకు పలు ఆఫర్లను ప్రకటిస్తున్నాయి బ్యాంకులు. వివిధ రకాల రుణాలపై ఆఫర్ల అందించడమే కాకుండా ద్విచక్ర వాహనాలపై..

HDFC Bank: ద్విచక్ర వాహనం కొనుగోలు చేసేవారికి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ అదిరిపోయే ఆఫర్‌..!
Follow us
Subhash Goud

|

Updated on: Oct 06, 2021 | 7:05 AM

HDFC Bank: పండగ సీజన్‌లో కస్టమర్లకు పలు ఆఫర్లను ప్రకటిస్తున్నాయి బ్యాంకులు. వివిధ రకాల రుణాలపై ఆఫర్ల అందించడమే కాకుండా ద్విచక్ర వాహనాలపై కూడా ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. తాజాగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కొత్త బైక్‌ కొనుగోలు చేసేవారికి శుభవార్త అందించింది. తాజాగా ఫెస్టివ్‌ ట్రీట్స్‌ 3.0 ప్రకటించింది. ఇందులో భాగంగా టూవీలర్ కొనుగోలు చేసే వారికి అదిరిపోయే ఆఫర్లను అందుబాటులో ఉన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్లు అయితే 4 శాతం వరకు తక్కువ వడ్డీకే ద్విచక్ర వాహనంపై రుణం పొందవచ్చు. ప్రాసెసింగ్ ఫీజులో 50 శాతం తగ్గింపు లభిస్తుంది. అదే ఇతర బ్యాంక్ కస్టమర్లకు అయితే తొలి మూడు నెలలు 50 శాతం తక్కువ ఈఎంఐ చెల్లించవచ్చు. లోన్ ఆన్ కేవైసీ బెనిఫిట్ సదుపాయం కూడా ఉంది. ఈ ఆఫర్ నవంబర్ నెల చివరి వరకు అందుబాటులో ఉంటుందని బ్యాంకు అధికారులు వెల్లడించారు. ద్విచక్ర వాహనం వ్యయంలో 80 శాతం నుంచి 100 శాతం వరకు మొత్తాన్ని రుణం రూపంలో పొందవచ్చు.

ఇతర ఆఫర్లు..

ఈ ఆఫర్లలో భాగంగా టూవీలర్‌ మాత్రమే కాకుండా హెచ్‌డీఎఫ్‌సీ ఫెస్టివ్‌ ట్రీట్స్‌లో భాగంగా పలు రకాల ఆఫర్లు కూడా ఉన్నాయి. ఐఫోన్‌పై క్యాష్‌బ్యాక్ ఉంది. ఇంకా చాలా బ్రాండ్లపై తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. కారు లోన్ కూడా తక్కువ వడ్డీకే లభిస్తోంది.

అయితే పండగ సీజన్‌లో భాగంగా కస్టమర్లను మరింతగా ఆకట్టుకునేందుకు ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు వినియోగదారులకు ఎన్నో ఆఫర్లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. వ్యక్తిగత రుణాలు, హోమ్‌ లోన్స్‌పై ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. తక్కువ వడ్డీకే రుణాలను అందజేస్తున్నాయి.

ఇవీ కూడా చదవండి:

Credit Guarantee Scheme: కేంద్ర ప్రభుత్వం శుభవార్త.. ఆ స్కీమ్‌ గడువు పొడిగింపు.. ఇప్పటి వరకు అంటే..!

UAE Lottery: అబుదాబిలో భారతీయులకు అదృష్టం వరించింది.. రూ.20 కోట్ల లాటరీ.. వారి కోసం నిర్వాహకుల వెతుకులాట..!