AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LIC Saral Pension: ఆ ఎల్ఐసీ పథకంతో రిటైర్‌మెంట్ లైఫ్ హ్యాపీ.. నెలకు రూ.12 వేల వరకూ పింఛన్ రాబడి

పెట్టుబడి మార్కెట్‌లో మంచి పెన్షన్‌ను అందించే వివిధ పథకాలు అందుబాటులో ఉన్నాయి. అలాంటి పథకమే ఎల్ఐసీకు సంబంధించిన సరళ్ పెన్షన్ పథకం. ఈ పథకం మార్చి 1, 2023న ప్రారంభించారు. ఎల్‌ఐసీ సరళ్ పెన్షన్ స్కీమ్ అనేది ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్‌డీఏఐ) మార్గదర్శకాల ప్రకారం ఒక స్టాండర్డ్ ఇమ్మీడియట్ యాన్యుటీ ప్లాన్. ఇది అన్ని జీవిత బీమా సంస్థల్లాగా ఒకే విధమైన నిబంధనలు, షరతులను అందిస్తుంది.

LIC Saral Pension: ఆ ఎల్ఐసీ పథకంతో రిటైర్‌మెంట్ లైఫ్ హ్యాపీ.. నెలకు రూ.12 వేల వరకూ పింఛన్ రాబడి
Lic Scheme
Nikhil
|

Updated on: Apr 07, 2024 | 8:00 PM

Share

ఇటీవల కాలంలో ప్రైవేట్ ఉద్యోగాలు చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు పోటీ వేతనాన్ని అందించినా రిటైర్‌మెంట్ తర్వాత గౌరవప్రదమైన పెన్షన్‌కు హామీ ఇవ్వవు. అయితే పెరుగుతున్న ఖర్చుల నేపథ్యంలో పింఛను అవసరం చాలా ఎక్కువని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో పెట్టుబడి మార్కెట్‌లో మంచి పెన్షన్‌ను అందించే వివిధ పథకాలు అందుబాటులో ఉన్నాయి. అలాంటి పథకమే ఎల్ఐసీకు సంబంధించిన సరళ్ పెన్షన్ పథకం. ఈ పథకం మార్చి 1, 2023న ప్రారంభించారు. ఎల్‌ఐసీ సరళ్ పెన్షన్ స్కీమ్ అనేది ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్‌డీఏఐ) మార్గదర్శకాల ప్రకారం ఒక స్టాండర్డ్ ఇమ్మీడియట్ యాన్యుటీ ప్లాన్. ఇది అన్ని జీవిత బీమా సంస్థల్లాగా ఒకే విధమైన నిబంధనలు, షరతులను అందిస్తుంది. ఈ పథకం  ప్రకారం పాలసీ ప్రారంభంలో యాన్యుటీ రేట్లు హామీ ఇస్తారు. అలాగే ఆయా యాన్యుటీ(లు) జీవితకాలం మొత్తం చెల్లించబడతాయి. పథకం రెండు యాన్యుటీ ఎంపికలను అందిస్తుంది. కాబట్టి ఎల్ఐసీ సరళ్ పెన్షన్ స్కీమ్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

యాన్యూటీ ప్లాన్-1

ఈ ఎంపిక కింద ఎల్ఐసీ సరళ్ పెన్షన్ స్కీమ్‌కు సంబంధించిన కొనుగోలు ధరలో 100 శాతం రాబడితో లైఫ్ యాన్యుటీని ప్లాన్ అందిస్తుంది. యాన్యుటీ చెల్లింపులు ఎంచుకున్న యాన్యుటీ చెల్లింపు విధానం ప్రకారం యాన్యుయిటెంట్ జీవించి ఉన్నంత వరకు బకాయిలు చెల్లిస్తారు. యాన్యుటింట్ మరణించిన తర్వాత యాన్యుటీ చెల్లింపు తక్షణమే నిలిపివేస్తారు. నామినీ(లు)/చట్టపరమైన వారసులకు కొనుగోలు ధరలో 100 శాతం చెల్లిస్తారు. 

యాన్యూటీ ప్లాన్-2

ఈ ఎంపిక కింద పాలసీదారు చివరిగా జీవించి ఉన్న వ్యక్తి మరణించినప్పుడు కొనుగోలు ధరలో 100 శాతం రిటర్న్‌తో జాయింట్ లైఫ్ లాస్ట్ సర్వైవర్ యాన్యుటీని ఎంచుకోవచ్చు. ఒకసారి ఎంచుకున్న యాన్యుటీ ఎంపికను మార్చలేరు. మీరు ఎంచుకున్న ఎంపిక ఆధారంగా పథకం యొక్క ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి: ఎంచుకున్న యాన్యుటీ చెల్లింపు విధానం ప్రకారం యాన్యుటీట్ మరియు/లేదా జీవిత భాగస్వామి జీవించి ఉన్నంత వరకు యాన్యుటీ మొత్తం బకాయిల్లో చెల్లిస్తారు. చివరిగా జీవించి ఉన్న వ్యక్తి మరణించిన తర్వాత, యాన్యుటీ చెల్లింపులు వెంటనే నిలిపివేస్తారు. అలాగే నామినీ(లు)/చట్టపరమైన వారసులకు కొనుగోలు ధరలో 100 శాతం చెల్లించాలి. ఈ ఎంపిక వివాహిత పాలసీదారులకు మాత్రమే ఉందని గమనించాలి.

అర్హతలివే

ఎల్ఐసీ సరళ్ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హత పొందాలంటే స్కీమ్‌లోకి ప్రవేశించే సమయంలో పాలసీదారు కనీసం 40 ఏళ్ల వయస్సు (పూర్తి) కలిగి ఉండాలి. పాలసీదారుని ప్రవేశానికి గరిష్ట వయస్సు 80 సంవత్సరాలు (పూర్తయింది). పథకం కోసం గరిష్ట కొనుగోలు ధరకు పరిమితి లేదు. నెలవారీ యాన్యుటీకి కనీస వార్షిక మొత్తం నెలకు రూ. 1000గా ఉంటుంది. త్రైమాసిక యాన్యుటీకి కనీస వార్షిక మొత్తం త్రైమాసికానికి రూ. 3000గా ఉంది. హాఫ్ ఇయర్లీ యాన్యుటీకి కనీస యాన్యుటీ మొత్తం అర్ధ సంవత్సరానికి రూ. 6000గా ఉంది. వార్షిక యాన్యుటీకి కనీస వార్షిక మొత్తం సంవత్సరానికి రూ. 12,000గా ఉంది. 

ప్రోత్సాహకాలు ఇలా

ఎల్ఐసీ సరళ్ పెన్షన్ స్కీమ్ కింద ఈ పథకం యాన్యుటీ రేటును పెంచడం ద్వారా అధిక కొనుగోలు ధరకు ప్రోత్సాహకాన్ని అందిస్తుంది. యాన్యుటీ రేటు పెరుగుదల ద్వారా అధిక కొనుగోలు ధరకు ప్రోత్సాహకం కొనుగోలు ధరకు సంబంధించి మూడు స్లాబ్‌లకు విభజించారు. 

  • రూ. 5,00,000 నుండి రూ. 9,99,999
  • రూ. 10,00,000 నుండి రూ. 24,99,999
  • రూ. 25,00,000 నుంచి అంతకంటే ఎక్కువ కింద శ్లాబ్‌లు విభజించారు. 

అధిక కొనుగోలు ధరకు ప్రోత్సాహకం కొనుగోలు ధర స్లాబ్, యాన్యుటీ చెల్లింపుల విధానంపై ఆధారపడి ఉంటుంది. కొనుగోలు ధర తక్కువ స్లాబ్ నుండి కొనుగోలు ధరకు సంబంధించిన అధిక స్లాబ్‌కు మారినప్పుడు ప్రోత్సాహకం పెరుగుతుంది. యాన్యుటీ చెల్లింపుల ఫ్రీక్వెన్సీ తగ్గింపుతో ప్రోత్సాహకం కూడా పెరుగుతుంది. పదవీ విరమణ తర్వాత వచ్చిన పీఎఫ్, గ్రాట్యుటీ డబ్బును ఉపయోగించి, ఏ వ్యక్తి అయినా ఒకేసారి మొత్తం పెట్టుబడిలో యాన్యుటీని కొనుగోలు చేయవచ్చు కాబట్టి ఈ పథకం పదవీ విరమణ ప్రణాళికకు ఉపయోగపడుతుంది. ఎల్‌ఐసి క్యాలిక్యులేటర్ ప్రకారం 42 ఏళ్ల వ్యక్తి 30 లక్షల యాన్యుటీని కొనుగోలు చేస్తే, అతనికి ప్రతి నెలా పింఛనుగా రూ.12,388 వస్తుంది.