Nexgen Energia: మధ్యతరగతి ప్రజలే అసలు టార్గెట్‌గా కొత్త ఈవీ స్కూటర్ లాంచ్.. ధరెంతో తెలిస్తే షాకవుతారు

తాజాగా నోయిడాకు చెందిన ఈ-మొబిలిటీ కంపెనీ నెక్స్‌జెన్ ఎనర్జియా గురువారం రూ.36,990 నుండి ప్రారంభ ధరతో సరసమైన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని వ్యాపారవేత్త-నటుడు సునీల్ శెట్టి బుధవారం ఆవిష్కరించారు. ముఖ్యంగా భారతదేశంలోని మధ్యతరగతి ప్రజలే అసలు టార్గెట్‌గా ఈ సరికొత్త ఈవీను నెక్స్‌జెన్ లాంచ్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

Nexgen Energia: మధ్యతరగతి ప్రజలే అసలు టార్గెట్‌గా కొత్త ఈవీ స్కూటర్ లాంచ్.. ధరెంతో తెలిస్తే షాకవుతారు
Nexgen Energia
Follow us
Srinu

|

Updated on: Apr 07, 2024 | 7:20 PM

భారతదేశంలో ఈవీ మార్కెట్ రోజురోజుకూ వృద్ధి చెందుతుంది. ఈ నేపథ్యంలో టాప్ కంపెనీల దగ్గర నుంచి స్టార్టప్ కంపెనీల వరకూ ఎప్పటికప్పడు సరికొత్త ఈవీలను లాంచ్ చేస్తున్నాయి. తాజాగా నోయిడాకు చెందిన ఈ-మొబిలిటీ కంపెనీ నెక్స్‌జెన్ ఎనర్జియా గురువారం రూ.36,990 నుండి ప్రారంభ ధరతో సరసమైన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని వ్యాపారవేత్త-నటుడు సునీల్ శెట్టి బుధవారం ఆవిష్కరించారు. ముఖ్యంగా భారతదేశంలోని మధ్యతరగతి ప్రజలే అసలు టార్గెట్‌గా ఈ సరికొత్త ఈవీను నెక్స్‌జెన్ లాంచ్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నెక్స్‌జెన్ రిలీజ్ చేసిన ఈవీ స్కూటర్‌కు సంబంధించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

 ముఖ్యంగా  రాబోయే తరానికి ఎలక్ట్రిక్ వాహనాలను (ఈవీలు) మరింత అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా నెక్స్‌జెన్ ఎనర్జీయాను లాంచ్ చేసినట్లు ఆ కంపెనీ ప్రతినిధులు చెబతున్నారు. నెక్స్‌జెన్ ఎనర్జీ చైర్మన్ పీయూష్ ద్వివేది మాట్లాడుతూ ప్రతి భారతీయుడికి ఎలక్ట్రిక్ వాహనాలను ఆచరణీయమైన ఎంపికగా మార్చడంతో పాటు అందరికీ పరిశుభ్రమైన భవిష్యత్తును అందించడమే తమ సంస్థ లక్ష్యమని అన్నారు.  ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.500 కోట్ల కంటే ఎక్కువ అమ్మకాలను దాటాలని తమ కంపెనీ లక్ష్యమని పేర్కొన్నారు. 

కంపెనీ లక్ష్యాన్ని సాధించడానకి ఎక్కువ డీలర్లతో పాటు పంపిణీదారులను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. ముఖ్యంగా నెక్స్‌జెన్ దాదాపు 50,000 ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలను సృష్టించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఎన్‌జీఈ ఈ-మొబిలిటీ వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రపంచంలోనే అత్యంత సరసమైన నాలుగు చక్రాల వాహనాన్ని విడుదల చేయనుందని సమాచారం. అలాగే ఈ కారు ధర కూడా రూ.5 లక్షల లోపు ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి