FD Interest Rates: కస్టమర్లకు ఆ బ్యాంకు శుభవార్త.. ఆ బ్యాంకులకు పోటీగా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్ల సవరణ

బీఓఐ రూ.2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్ల కోసం తన ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను అప్‌డేట్ చేసింది  సవరించిన తర్వాత బ్యాంక్ ఇప్పుడు 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు డిపాజిట్ పీరియడ్‌లకు 3 శాతం నుండి 7.25 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తుంది. ఈ రేట్లు 1 ఏప్రిల్ 2024 నుంచి అమల్లోకి వచ్చాయి. సీనియర్ సిటిజన్‌లు 6 నెలలు-అంతకంటే ఎక్కువ కాల వ్యవధిలో 50 బేసిస్ పాయింట్లను (బీపీఎస్) అందుకుంటారు

FD Interest Rates: కస్టమర్లకు ఆ బ్యాంకు శుభవార్త.. ఆ బ్యాంకులకు పోటీగా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్ల సవరణ
Money
Follow us
Srinu

|

Updated on: Apr 07, 2024 | 7:00 PM

భారతదేశంలో నమ్మకమైన రాబడి కోసం ప్రజలు ఫిక్స్‌డ్ డిపాజిట్లను ఆశ్రయిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ప్రజా ఆదరణ పొందడానికి చాలా బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ప్రత్యేక వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. ముఖ్యంగా కొత్త ఆర్థిక సంవత్స్యంలో అన్ని బ్యాంకులుల ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను సవరిస్తున్నాయి. తాజాగా ప్రముఖబ్యాంక్ ఆఫ్ ఇండియా ఎఫ్‌డీ రేట్లను సవరించింది. బీఓఐ రూ.2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్ల కోసం తన ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను అప్‌డేట్ చేసింది  సవరించిన తర్వాత బ్యాంక్ ఇప్పుడు 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు డిపాజిట్ పీరియడ్‌లకు 3 శాతం నుండి 7.25 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తుంది. ఈ రేట్లు 1 ఏప్రిల్ 2024 నుంచి అమల్లోకి వచ్చాయి. సీనియర్ సిటిజన్‌లు 6 నెలలు-అంతకంటే ఎక్కువ కాల వ్యవధిలో 50 బేసిస్ పాయింట్లను (బీపీఎస్) అందుకుంటారు. సూపర్ సీనియర్ సిటిజన్‌లకు అదనంగా 65 బీపీఎస్ మంజూరు చేశారు. బ్యాంకు ఆఫ్ ఇండియా ఎఫ్‌డీలపై సవరించిన వడ్డీ రేట్లకు సంబంధించిన మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

రూ.2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్‌లపై 3 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ కాల వ్యవధి ఉన్నవారికి సీనియర్ సిటిజన్‌లు 25 బీపీఎస్ అదనపు ప్రీమియం పొందుతారు. అదేవిధంగా సూపర్ సీనియర్ సిటిజన్లకు 25 బీపీఎస్ అదనపు ప్రీమియం అందిస్తుంది. తాజాగా బ్యాంక్ ఆఫ్ ఇండియా సవరించిన వడ్డీ రేట్ట ప్రకారం 7 రోజుల నుంచి 45 రోజుల మధ్య మెచ్యూర్ అయ్యే డిపాజిట్ల కోసం బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ) 3 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. 46 రోజుల నుంచి 179 రోజుల మధ్య మెచ్యూర్ అయ్యే డిపాజిట్లకు బీఓఐ 4.50 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. 180 రోజుల నుంచి 269 రోజుల వ్యవధి ఉన్న డిపాజిట్లపై బీఓఐ 5.50 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. అయితే 270 రోజుల నుంచి 1 సంవత్సరం కంటే తక్కువ వ్యవధి ఉన్న డిపాజిట్లకు బ్యాంక్ 5.75 శాతం వడ్డీని అందిస్తుంది. 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాలలోపు మెచ్యూర్ అయ్యే డిపాజిట్లకు 6.80 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. 2 సంవత్సరాలలో మెచ్యూర్ అయిన వాటికి గరిష్ట రాబడి 7.25 శాతం  ఉంటుంది. బీఓఐ రెండేళ్లలోపు, మూడేళ్లలోపు మెచ్యూరిటీ ఉన్న టర్మ్ డిపాజిట్లపై 6.75 శాతం వడ్డీని చెల్లిస్తుంది. అయితే మూడేళ్ల నుంచి ఐదేళ్లలోపు మెచ్యూర్ అయ్యే డిపాజిట్లకు 6.50 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. ఐదు నుంచి పదేళ్లలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై వడ్డీ రేటు ఆరు శాతం. వడ్డీ రేట్లు అందిస్తుంది. 

ఎస్‌బీఐ ఎఫ్‌డీలపై వడ్డీ రేటు ఇలా

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) అందించే తాజా ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ) రేట్లు సాధారణ కస్టమర్‌లకు ఏడు రోజుల నుంచి పది సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్‌లకు 3.5 శాతం నుంచి 7 శాతం మధ్య వడ్డీ రేట్లను అందిస్తుంది. సీనియర్ సిటిజన్‌లకు 4 శాతం నుంచి 7.5 శాతం మధ్య ఉంటాయి. ఈ సవరించిన రేట్లు డిసెంబర్ 27, 2023 నుండి అమల్లోకి వచ్చాయి.

ఇవి కూడా చదవండి

హెచ్‌డీఎఫ్‌సీ వడ్డీ రేట్లు

హెచ్‌డీఎఫ్‌సీ ఏడు రోజుల నుంచి 10 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై సాధారణ కస్టమర్లకు 3 శాతం నుంచి 7.25 శాతం మధ్య వడ్డీ రేట్లను అందిస్తుంది. సీనియర్ సిటిజన్లు ఈ డిపాజిట్లపై 3.5 శాతం నుంచి 7.75 శాతం వరకు వడ్డీ రేట్లు అందుకుంటారు. ఈ రేట్లు ఫిబ్రవరి 9, 2024 నుండి అమల్లోకి వచ్చాయి.

ఐసీఐసీఐ బ్యాంక్ వడ్డీ రేట్లు

ఐసీఐసీఐ బ్యాంక్ సాధారణ కస్టమర్లకు ఏడు రోజుల నుంచి పదేళ్లలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 3 శాతం నుంచి 7.2 శాతం మధ్య వడ్డీ రేట్లను అందిస్తోంది. సీనియర్ సిటిజన్లు ఈ డిపాజిట్లపై 3.5 శాతం నుంచి 7.75 శాతం వరకు వడ్డీ రేట్లు అందుకుంటారు. ఈ రేట్లు ఫిబ్రవరి 17 2024 నుంచి అమల్లోకి వచ్చాయి. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి