AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Investment Tips: వారెవ్వా.. రూ.30 వేల జీతంలో.. రెండు కోట్ల సంపాదన.. ఎలానో తెలుసా?

మనం జన్మించినప్పటి నుంచి మరణించి మట్టిలో కలిసే దాకా.. మనకు కావాల్సింది డబ్బు. మన జీవితమే డబ్బుతో ముడిపడి ఉంటుంది. డబ్బు లేకుంటే ఏది సాధ్యం కాదు. కాబట్టి రూ.30 వేల జీతం వచ్చే వ్యక్తులు.. రూ.2కోట్లు సంపాదించవచ్చా అంటే చాలా మంది అది అసాధ్యం అంటారు. కానీ ఆ డబ్బును మీరు కొంచెం తెలివిగా ఇన్వెస్ట్ చేస్తే అది చాలా సులభం అంటున్నారు ఆర్థిక నిపుణులు.

Investment Tips: వారెవ్వా.. రూ.30 వేల జీతంలో.. రెండు కోట్ల సంపాదన.. ఎలానో తెలుసా?
Investment Tips
Anand T
|

Updated on: Sep 21, 2025 | 4:35 PM

Share

మనం జన్మించినప్పటి నుంచి మరణించి మట్టిలో కలిసే దాకా.. మనకు కావాల్సింది డబ్బు. మన జీవితమే డబ్బుతో ముడిపడి ఉంటుంది. డబ్బు లేకుంటే ఏది సాధ్యం కాదు.. మనం ఏం చేయాలన్నా డబ్బు కాల్సిందే. అయితే నెలకు రూ.30 వేల జీతం పొందేవారు రూ.కోట్లు సంపాదించొచ్చా అంటే అది అసాధ్యం అంటారు. కానీ మీ జీతాన్ని ఆదా చేసుకొని.. కొంచెం తెలివిగా వాటిని ఇన్వెస్ట్ చేస్తే అది చాలా సులభమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. దీనికి మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసంర లేదు. ఇక్కడ మీరు చేయాల్సిందిల్లా చిన్న పొదుపును స్టార్ట్ చేయడమే. దానిని దీర్ఘకాలిక పెట్టుబడిగా మార్చడమే. ఇలా చేయడం ద్వారా మీరు రూ.30వేల జీతంలో రూ.2కోట్లు ఈజీగా సంపాధించవచ్చు.

రూ.30వేల జీతంలో 2 కోట్లు సంపాధించడం ఎలా?

  • మీరు ప్రస్తుతం రూ. 30,000 సంపాదిస్తున్నట్లయితే, మీ జీతంలోంచి రూ. 5,000 ఆదా చేయండి. ఈ డబ్బును మ్యూచువల్ ఫండ్ SIPలో పెట్టుబడిగా పెట్టండి. ఈ ఫండ్ సంవత్సరానికి 12% CAGR వద్ద వృద్ధి చెందగలిగితే, రూ. 2 కోట్ల కార్పస్‌ను సృష్టించడానికి 31 సంవత్సరాలు పడుతుంది.
  • మీకు ఇప్పుడు 25 సంవత్సరాలు, మీరు ఇప్పుడు రూ. 5,000 SIP ప్రారంభిస్తే, మీరు 56 సంవత్సరాల వయస్సులో, రూ. 2 కోట్ల ధనవంతులు అవుతారు.
  • మీ కెరీర్ పెరుగుతున్న కొద్దీ, మీ ఆదాయం కూడా పెరగవచ్చు. అప్పుడు మీరు మీ పెట్టుబడిని కూడా పెంచుకోవచ్చు.
  • ఈ విధంగా మీరు మీ పెట్టుబడిని సంవత్సరానికి 10% పెంచుకుంటే, మీ కార్పస్ 25 సంవత్సరాలలోనే రూ. 2 కోట్లకు చేరుకుంటుంది.

50:30:10:10 నియమాన్ని తెలుసుకోండి.

  • మీ జీతంలో ఎంత ఖర్చు చేయాలి, ఎంత ఆదా చేయాలి, ఎంత పెట్టుబడి పెట్టాలి అనే విషయంలో మీరు గందరగోళంగా ఉంటే, 50:30:10:10 నియమాన్ని తెలుసుకోండి. మీరు అవసరమైన ఖర్చులు, విచక్షణా ఖర్చులు, పెట్టుబడులు, అత్యవసర పరిస్థితుల కోసం డబ్బును పక్కన పెట్టవచ్చు. ఇంటి అద్దె, EMI, కరెంట్‌ బిల్లు, వాటర్ బిల్లు, ఫోన్ బిల్లు, కిరాణా సామాగ్రి, స్కూల్ ఫీజులు మొదలైన ముఖ్యమైన ఖర్చులు మీ జీతంలో 50% మించకుండా చూసుకోండి.
  • మరో 30 శాతం సంపాదనను సినిమాలకు వెళ్లడం, ఆన్‌లైన్ షాపింగ్ చేయడం, హోటళ్లలో తినడం వంటి వినోద కార్యకలాపాలకు ఖర్చు చేయండి.
  • మీ డబ్బులో 10 శాతం అత్యవసర పరిస్థితుల కోసం పక్కన పెట్టవచ్చు. మిగిలిన 10 శాతం డబ్బును పెట్టుబడులకు ఉపయోగించండి
  • ఇక్కడ, అత్యవసర పరిస్థితుల కోసం రూ. 5-6 లక్షలు ఆదా చేసిన తర్వాత, ఆ డబ్బులో 10శాతం పెట్టుబడులకు ఉపయోగించవచ్చు.
  • వినోదం కోసం పక్కన పెట్టిన 30శాతం డబ్బులో వీలైనంత ఎక్కువ డబ్బు ఆదా చేసి, పెట్టుబడులకు కూడా ఉపయోగించండి.
  • మీరు ఈ విధంగా ఎంత ఎక్కువ డబ్బు పెట్టుబడి పెడితే, మీ భవిష్యత్ ఆర్థిక పరిస్థితి అంత సురక్షితంగా మారుతుంది

(గమనిక: పైన పేర్కొన్న అంశాలు నివేదికలు, ఇంటర్నెట్‌ నుంచి సేకరించిన వివరాల ఆధారంగా అందించబడినవి. కాబట్టి వీటిలో మీకేవైనా సందేహాలు ఉంటే .. సంబంధించిన నిపుణులను సంప్రదించండి)

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.