Budget 2024: బడ్జెట్లో పొదుపు ఖాతాదారులకు బంపర్ ఆఫర్! అందరి చూపు.. నిర్మలమ్మ వైపే..

పొదుపు ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం త్వరలో శుభవార్త చెప్పనుంది. పొదుపు ఖాతా వడ్డీపై పన్ను మినహాయింపు పెంచనుందని సమాచారం. ఈనెలలో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్ లో ఈ విషయంపై స్పష్టత లభిస్తుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని అందరూ ఎదురు చూస్తున్నారు.

Savings Account
Follow us

|

Updated on: Jul 07, 2024 | 5:08 PM

సాధారణంగా ప్రతి ఒక్కరికీ పొదుపు ఖాతాలు ఉంటాయి. బ్యాంకులు, పోస్టాఫీసులలో వీటిని ప్రారంభిస్తారు. వీటిలో డబ్బులను పొదుపు చేసుకుంటూ ఉంటారు. ఆ మొత్తాలపై బ్యాంకులు లేదా పోస్టాఫీసులు కొంత వడ్డీని కూడా అందజేస్తాయి. ఇలా వడ్డీ రూపంలో వచ్చే డబ్బులలో రూ.10 వేల వరకూ పన్ను మినహాయింపు ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 టీటీఏ ప్రకారం ఈ మినహాయింపు లభిస్తుంది.

శుభవార్త చెబుతారా..

పొదుపు ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం త్వరలో శుభవార్త చెప్పనుంది. పొదుపు ఖాతా వడ్డీపై పన్ను మినహాయింపు పెంచనుందని సమాచారం. ఈనెలలో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్ లో ఈ విషయంపై స్పష్టత లభిస్తుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని అందరూ ఎదురు చూస్తున్నారు.

వడ్డీ మినహాయింపు పెంపు?

పొదుపు ఖాతాలపై పన్ను మినహాయింపు మొత్తాన్ని రూ.10 వేల నుంచి రూ.25 వేలకు పెంచే ప్రతిపాదనను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోంది. ఆ శాఖలోని ముఖ్యమైన అధికారులతో గత వారం సమావేశం జరిగింది. ఈ సందర్బంగా బ్యాంకులు ఈ విషయంలో సూచన చేశాయి. అయితే ఈ అంశం ఇంకా పరిశీలలోనే ఉంది. కొత్త నిబంధన అమలైతే బ్యాంకులకు కూడా మేలు కలుగుతుంది. పొదుపు ఖాతాలలో డిపాజిట్లు చేసేవారు పెరిగే అవకాశం ఉంది.

ప్రస్తుత పరిమితి..

ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 టీటీఏ ప్రకారం పొదుపు ఖాతాల నుంచి ఏడాదికి వచ్చే వడ్డీలో రూ. 10 వేల వరకూ మినహాయింపు లభిస్తుంది. అలాగే 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న వారికి ఈ పరిమితి రూ.50 వేల వరకూ లభిస్తుంది. అయితే దీనిలో సెక్షన్80 టీటీబి కింద ఫిక్స్ డ్ డిపాజిట్ (ఎఫ్ డీ)పై వచ్చే వడ్డీని కూడా కలుపుతారు. అలాగే పాత పన్ను విధానంలో మాత్రమే ఈ ప్రయోజనం కలుగుతుంది. కొత్త పన్ను విధానంలో వర్తించదు.

ఆర్బీఐ నివేదిక..

రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా తాజాగా ఒక నివేదికను వెల్లడించింది. దాని ప్రకారం.. చాలా కుటుంబాలు తమ ఆర్థిక పొదుపులను వైవిధ్యభరితంగా మారుస్తున్నాయని తెలిపింది. అంటే నాన్ బ్యాంకులు, క్యాపిటల్ మార్కెట్‌కు ఎక్కువగా కేటాయింపులు చేస్తున్నాయని గుర్తించింది. క్రెడిట్ డిపాజిట్ రేషియో మధ్య అంతరం పెరిగిపోతోంది. దీంతో బ్యాంకులు ఆందోళన చెందుతున్నాయి. అందుకనే ఖాతాదారులను ఆకర్షించడానికి పొదుపు ఖాతాల వడ్డీ రేట్లపై మినహాయింపును పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. కొత్త విధానంలో ట్యాక్స్ బెనిఫిట్లు కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి.

ఎంతో ప్రయోజనం..

పొదుపు ఖాతాల వడ్డీ మినహాయింపును పెంచితే ఆదాయపు పన్ను చెల్లింపుదారులతో పాటు బ్యాంకులకూ కూడా ప్రయోజనం కలుగుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. పన్ను చెల్లింపుదారులతో పాటు అందరికీ ఏదో ఒక బ్యాంకు లేదా పోస్టాఫీసులో పొదుపు ఖాతా ఉంది. వాటిలో కొంత మేర డబ్బులను పొదుపు చేస్తారు. వాటిపై వడ్డీ రూపంలో కొంతమేర వారికి రాబడి వస్తుంది. కానీ ప్రస్తుతం ఉన్న రూ.10 వేల మినహాయింపు బాగా తక్కువగా ఉందని చెబుతున్నారు. దాన్ని పెంచడం వల్ల ఖాతాలలో పొదుపు కూడా పెరుగుతుందని భావిస్తున్నారు. అలాగే డిపాజిట్లు పెరగడం వల్ల బ్యాంకులకు కూడా ఆదాయం సమకూరుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

యు ముంబా బోణీ.. సూపర్‌‌10తో సత్తా చాటిన జఫర్దనేష్

హోరాహోరీగా ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెస్ హంట్.. 8వ రోజు హైలెట్స్

ప్రొ కబడ్డీ లీగ్.. తమిళ్ తలైవాస్‌కు రెండో విజయం..

భార్యపై అలాంటి కామెంట్స్.. ఘాటుగా స్పందించిన నాగమణికంఠ

ఐశ్వర్యను కాపీ కొట్టి అడ్డంగా బుక్కైన ఆది పురుష్ హీరోయిన్..వీడియో

కుంభకర్ణుణి కత్తి తవ్వకాల్లో బయటపడిందా.? ఫోటోల వెనుక వాస్తవమేంటి?

పెళ్ళి రిసెప్షన్ కు బయలుదేరిన ముగ్గురు మృత్యువాత!

తెప్పపై నదిని దాటేందుకు 20 మంది యత్నం.. నది మధ్యలోకి వచ్చేసరికి.?

మరోసారి అధ్యక్ష భవనాన్ని ముట్టడించిన విద్యార్థులు!

కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
కుంభకర్ణుణి కత్తి తవ్వకాల్లో బయటపడిందా.? ఫోటోల వెనుక వాస్తవమేంటి?
కుంభకర్ణుణి కత్తి తవ్వకాల్లో బయటపడిందా.? ఫోటోల వెనుక వాస్తవమేంటి?
తెప్పపై నదిని దాటేందుకు 20 మంది యత్నం.. నది మధ్యలోకి వచ్చేసరికి.?
తెప్పపై నదిని దాటేందుకు 20 మంది యత్నం.. నది మధ్యలోకి వచ్చేసరికి.?
కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
రిలయన్స్, ఎయిర్‌టెల్‌కు.. బీఎస్ఎన్ఎల్ దిమ్మతిరిగే బిగ్‌ స్ట్రోక్!

రెడ్ అలెర్ట్ తారుమారు.. చుక్క వర్షం లేకుండా ఒక్కసారిగా తుఫాన్.!

లెక్క సరిచేశాం.. యుద్ధం మాత్రం ఆగదు-నెతన్యాహు.. వీడియో వైరల్.

'స్టోన్ ఫ్రూట్స్' అన్ని వ్యాధుల నుంచీ కాపాడే దివ్యౌషధం.!

రైల్వే రిజర్వేషన్లలో కీలక మార్పులు.. ఇక నుంచి కొత్త రూల్స్‌ ఇవే.!

గ్యాంగ్‌స్టర్‌ బిష్ణోయ్‌కు సల్మాన్‌ మాజీ ప్రేయసి మెసేజ్‌.! వైరల్

25 ఏళ్ల తరువాత కూతురి ప్రతీకారం! వ్యక్తిపై 9 ఏళ్ల బాలిక ప్రతీకారం