AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్.. డీఏను నాలుగు శాతం పెంచే యోచనలో ప్రభుత్వం!

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త చెప్పింది. ప్రస్తుతం ఉన్న డియర్‌నెస్ అలవెన్స్‌ (DA)ను 4 శాతం వరకూ పెంచే యోచనలో కేంద్రం ఉంది. గత సారి కంటే ఈసారి పెంపు మరింతగా ఉండనుందని విశ్వసనీయ సమాచారం చెబుతోంది. అయితే, ఈ విషయంపై కేంద్రం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. వచ్చే నెలలో నిర్ణయం తీసుకొని సెప్టెంబర్ మొదటి వారంలో అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం.

DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్.. డీఏను నాలుగు శాతం పెంచే యోచనలో ప్రభుత్వం!
Da Hike
Anand T
|

Updated on: Jun 25, 2025 | 11:37 PM

Share

ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ డేటా ప్రకారం.. 2025 జనవరి నుంచి ఏప్రిల్ వరకు DA 57.47 శాతానికి కి చేరింది. దీంతో, 2025 రెండో అర్ధభాగంలో డీఏ 3 శాతానికి పైగా పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. 7వ వేతన సంఘం ప్రకారం, ఈ పెంపు 3 శాతం పెరగవచ్చు . అయితే,  ఈ ప్రకటనకు ఇంకా రెండు నెలలు మిగిలి ఉన్నందున, ఈ నెల గణాంకాలను కూడా ఇందులో చేర్చవచ్చని అధికారులు భావిస్తున్నారు

కేబినెట్ ఆమోదం అవసరం..

తాజాగా సవరించిన డీఏ పెంపును అమలు చేయడానికి కేంద్ర కేబినెట్‌ ఆమోదం అవసరం ఉంటుంది. సాధారణంగా జూలై చివరి వారం నాటికి ఆర్థిక శాఖ గణాంకాలను సమీక్షించి, కేబినెట్‌కు నివేదికను పంపుతుంది. తర్వాత మంత్రివర్గం దానికి ఆమోదం తెలిపి అధికారికంగా ప్రకటిస్తుంది. ఈ ప్రకటన తర్వాత నెలల వారిగా బకాయిలు కూడా చెల్లించబడతాయి.

అయితే ప్రభుత్వం ఏడాదికి రెండుసార్లు డీఏలను పెంచుతుంది. మొదటిగా జనవరిలో డీఏ పెంపు ప్రకటన చేసి..  ఈ ప్రకటనకు సంబంధించిన డీఏలను మార్చి-ఏప్రిల్‌లో చెల్లిస్తుంది. రెండోసారి జూలైలో డీఏలను ప్రకటింది,  రెండు-మూడు నెలలు తర్వాత వాటిని చెల్లిస్తుంది. అయితే రెండో సారి ప్రకటన తర్వాత బకాయిల మొత్తాన్ని ప్రభుత్వం చెల్లిస్తుంది.

ప్రాథమిక జీతం విలీన విధానం…

అయితే ఒక్కసారి డీఏ మొత్తం 50 శాతాన్ని దాటితే, దానిని ప్రభుత్వం ప్రాథమిక జీతంలో విలీనం చేస్తుంది. అయితే, ప్రస్తుత డీఏ 57.47% ఉన్నప్పటికీ, ఇది విలీనం కాలేదు. ఇది సాధారణంగా కొత్త వేతన సంఘం (Pay Commission) వచ్చినపుడు, డీఏను సున్నాగా మార్చి కొత్త ప్రాథమిక జీతంగా విలీనం చేస్తారు. మొత్తంగా, కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లు డీఏ పెంపుపై ఆశలు పెట్టుకోవచ్చు. అధికారిక ప్రకటన కోసం జూలై చివరి వారం లేదా సెప్టెంబర్ మొదటివారాన్ని వేచి చూడాల్సిందే.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..