AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Onion Price: ఉల్లి కోసం కేంద్ర సర్కార్‌ ప్రత్యేక ప్రణాళిక.. ఫూల్‌ప్రూఫ్ ప్లాన్‌

ప్రభుత్వం ఈ ఏడాది ఐదు లక్షల టన్నుల ఉల్లిని బఫర్ స్టాక్ కోసం కొనుగోలు చేయాలని యోచిస్తోంది. ధరలు పెరిగినప్పుడు వాటిని నియంత్రించడానికి దీనిని ఉపయోగించవచ్చు. ప్రభుత్వం తరపున ఎన్‌సిసిఎఫ్ (నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్), నాఫెడ్ (నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్) వంటి ఏజెన్సీలు ఉల్లిని కొనుగోలు చేయనున్నాయని వర్గాలు

Onion Price: ఉల్లి కోసం కేంద్ర సర్కార్‌ ప్రత్యేక ప్రణాళిక.. ఫూల్‌ప్రూఫ్ ప్లాన్‌
Onion
Subhash Goud
|

Updated on: Mar 09, 2024 | 10:20 AM

Share

ప్రస్తుతం ఉల్లి ధరలు అదుపులో ఉన్నప్పటికీ భవిష్యత్తు కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసింది. ఉల్లి ద్రవ్యోల్బణాన్ని అధిగమించేందుకు ప్రభుత్వం ఫూల్‌ప్రూఫ్ ప్లాన్‌ను రూపొందించింది. ఆ తర్వాత ఉల్లికి సంబంధించి సంక్షోభం ఏర్పడినా సామాన్యులు మాత్రం కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. గతేడాది ఉల్లి ధరలు సామాన్య ప్రజలను కంటతడి పెట్టించాయి. ధరలను నియంత్రించేందుకు, అలాగే ఉల్లి కొరత లేకుండా ఉండేందుకు ప్రభుత్వం ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించింది. ఉల్లికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి ప్రణాళిక రూపొందించిందో చూద్దాం..

ప్రభుత్వం ప్రణాళిక ఏంటి?

ప్రభుత్వం ఈ ఏడాది ఐదు లక్షల టన్నుల ఉల్లిని బఫర్ స్టాక్ కోసం కొనుగోలు చేయాలని యోచిస్తోంది. ధరలు పెరిగినప్పుడు వాటిని నియంత్రించడానికి దీనిని ఉపయోగించవచ్చు. ప్రభుత్వం తరపున ఎన్‌సిసిఎఫ్ (నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్), నాఫెడ్ (నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్) వంటి ఏజెన్సీలు ఉల్లిని కొనుగోలు చేయనున్నాయని వర్గాలు తెలిపాయి. ఆహార, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ గత ఏడాది ఐదు లక్షల టన్నుల బఫర్ స్టాక్‌ను రూపొందించింది. ఇందులో ఇంకా లక్ష టన్నులు అందుబాటులోనే ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

బఫర్ స్టాక్ నుండి రాయితీ ధరలకు ఉల్లిపాయలను విక్రయించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ధరలను నియంత్రించడంలో సహాయపడిందని వర్గాలు తెలిపాయి. ఉల్లి ఎగుమతులపై నిషేధం ఎత్తివేతపై ప్రభుత్వం ఈ నెలాఖరులో నిర్ణయం తీసుకోనుంది. ఈ నిషేధం మార్చి 31 వరకు ఉంటుంది. 2023-24లో ఉల్లి ఉత్పత్తి తగ్గుతుందన్న అంచనాల మధ్య బఫర్ స్టాక్‌ను రూపొందించాలనే ప్రభుత్వ ప్రణాళిక వచ్చింది.

ఎక్కడ, ఎంత ఉత్పత్తి అంచనా?

వ్యవసాయ మంత్రిత్వ శాఖ గురువారం విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. 2023-24లో ఉల్లి ఉత్పత్తి దాదాపు 254.73 లక్షల టన్నులు ఉంటుందని అంచనా వేయగా, గత సంవత్సరం అది దాదాపు 302.08 లక్షల టన్నులుగా ఉంది. మహారాష్ట్రలో 34.31 లక్షల టన్నులు, కర్ణాటకలో 9.95 లక్షల టన్నులు, ఆంధ్రప్రదేశ్‌లో 3.54 లక్షల టన్నులు, రాజస్థాన్‌లో 3.12 లక్షల టన్నుల దిగుబడి తగ్గడం వల్ల మొత్తం ఉత్పత్తిలో ఈ క్షీణత అంచనా వేయబడింది. గణాంకాల ప్రకారం.. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఉల్లి ఉత్పత్తి 316.87 లక్షల టన్నులు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి