Gold Price Today: బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. పది గ్రాముల ధర ఎంత ఉందంటే..

బులియన్ మార్కెట్‌లో గత కొంత కాలం నుంచి బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. పది గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.65 వేల మార్క్‌ను దాటింది. వాస్తవానికి అంతర్జాతీయంగా జరగుతున్న పరిణామాల ప్రకారం.. బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కొన్నిసార్లు బంగారం, వెండి ధరలు తగ్గితే.. మరికొన్ని సార్లు పెరుగుతుంటాయి.

Gold Price Today: బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. పది గ్రాముల ధర ఎంత ఉందంటే..
Gold Price Today
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Mar 09, 2024 | 6:34 AM

బులియన్ మార్కెట్‌లో గత కొంత కాలం నుంచి బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. పది గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.65 వేల మార్క్‌ను దాటింది. వాస్తవానికి అంతర్జాతీయంగా జరగుతున్న పరిణామాల ప్రకారం.. బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కొన్నిసార్లు బంగారం, వెండి ధరలు తగ్గితే.. మరికొన్ని సార్లు పెరుగుతుంటాయి. అందుకే చాలా మంది బంగారం, వెండి ధరలపై దృష్టిసారిస్తుంటారు. అయితే, బంగారం, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది. పెళ్లిళ్లు, శుభకార్యాల సమయంలో చాలామంది కొనుగోలు చేస్తుంటారు. తాజాగా.. గోల్డ్, సిల్వర్ రేట్లు పెరిగాయి. పది గ్రాముల గోల్డ్ పై రూ. 10 మేర ధర పెరగగా.. కిలో వెండిపై రూ.100 మేర ధర పెరిగింది. శనివారం ( మార్చి 9 2024) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,260, 24 క్యారెట్ల ధర రూ.65,740 గా ఉంది. వెండి కిలో ధర రూ.75,600 లుగా ఉంది.

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

ఢిల్లీలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.60,410 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.65,890 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.60,260, 24 క్యారెట్ల ధర రూ.65,740, బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.60,260, 24 క్యారెట్లు రూ.65,740, చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.61,060, 24 క్యారెట్ల ధర రూ.66,610, కోల్‌కతాలో 22 క్యారెట్ల ధర రూ.60,260, 24 క్యారెట్ల ధర రూ.65,740, కేరళలో 22 క్యారెట్ల ధర రూ.60,260, 24 క్యారెట్ల ధర రూ.65,740 గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పది గ్రా బంగారం ధర రూ.60,260 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.65,740 గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రా బంగారం ధర రూ.60,260, 24 క్యారెట్ల ధర రూ.65,740 గా ఉంది.

వెండి ధరలు..

చెన్నైలో వెండి కిలో ధర రూ.79,100 గా ఉంది.. ఢిల్లీలో వెండి కిలో ధర రూ.75,600, ముంబైలో రూ.75,600, బెంగళూరులో రూ.74,600, కేరళలో రూ.79,100, కోల్‌కతాలో రూ.75,600 ఉంది. హైదరాబాద్‌లో వెండి కిలో ధర రూ.79,100, విజయవాడలో రూ.79,100, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.79,100 గా ఉంది.

గమనిక.. బంగారం, వెండి ధరలు బులియన్ మార్కెట్ వెబ్‌సైట్‌లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి.. అయితే, ఈ ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉంటుంది.. కావున, కొనేముందు ఒకసారి బంగారం, వెండి ధరలను పరిశీలించి వెళ్లడం మంచిది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..