ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారా..! టెన్షన్ పడొద్దు.. మీకు పెన్షన్ సౌలభ్యం ఉంది.. ఎలాగో తెలుసా..?

Private Employees : ప్రైవేటు రంగ కార్మికులు తరచుగా పెన్షన్ల గురించి ఆందోళన చెందుతుంటారు. ఉద్యోగ విరమణ తర్వాత చివరి

ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారా..! టెన్షన్ పడొద్దు.. మీకు పెన్షన్ సౌలభ్యం ఉంది.. ఎలాగో తెలుసా..?
Private Employees
Follow us
uppula Raju

|

Updated on: May 15, 2021 | 9:38 AM

Private Employees : ప్రైవేటు రంగ కార్మికులు తరచుగా పెన్షన్ల గురించి ఆందోళన చెందుతుంటారు. ఉద్యోగ విరమణ తర్వాత చివరి రోజులు ఎలా గడుస్తాయోనని భయపడుతుంటారు. అటువంటి వారికి ప్రభుత్వం భరోసా కల్పిస్తుంది. ఉద్యోగ విరమణ కాలం నాటికి చిన్న చిన్న పొదుపులు చేసుకోవాలి. తద్వారా మీరు కూడా ఒక వయస్సు తర్వాత పెన్షన్ పొందవచ్చు. నిర్దిష్ట కాలం తర్వాత దేశ ప్రజలకు పెన్షన్లు అందించే అనేక పథకాలను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీంతో ప్రజలు చివరి రోజుల్లో ఎవరిపైనా ఆధారపడకుండా బతుకుతారు. అందుకే చిన్న వయసులోనే ప్రభుత్వ పథకాలలో చేరి వృద్ధాప్యంలో వచ్చే ఆర్థిక సమస్యలను అధిగమించవచ్చు. ప్రభుత్వ పెన్షన్ పథకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. అటల్ పెన్షన్ పథకం మీరు 20 సంవత్సరాలు శాశ్వత పెన్షన్ ప్రణాళికలో పెట్టుబడి పెట్టాలి. మీ పెట్టుబడి ఆధారంగా మీరు 60 సంవత్సరాల వయస్సు నుంచి పెన్షన్ పొందుతారు. ఈ పథకం కింద మీరు రూ.1000 నుంచి రూ.5000 వరకు పెన్షన్ పొందవచ్చు. 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్న వారు ఇందులో పెట్టుబడులు పెట్టవచ్చు.

2. పిఎం శ్రమ్ యోగి మందిర్ యోజన ఈ పెన్షన్ పథకాన్ని 2019 సంవత్సరంలో ప్రారంభించారు. ఈ పథకం కింద అసంఘటిత రంగంలో పనిచేసే ప్రజలకు ప్రభుత్వం పింఛను అందిస్తుంది. 60 సంవత్సరాల తరువాత వారికి నెలకు రూ.3,000 పింఛను లభిస్తుంది. అంటే ప్రభుత్వం మీకు ప్రతి సంవత్సరం రూ.36 వేలు ఇస్తుంది. దీంట్లో పొదుపుతో ఖాతాను కూడా ప్రారంభించవచ్చు.

3. పీఎం కిసాన్ మాన్‌ధన్ యోజన పీఎం కిసాన్ మాన్‌ధన్ యోజనను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. దీని ద్వారా రైతులకు పెన్షన్ ఇస్తారు. 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు గల రైతులు ఈ పథకంలో చేరవచ్చు. వారి వయస్సును బట్టి డబ్బు పెట్టుబడి పెట్టవచ్చు. తద్వారా నెలకు రూ.3,000 పింఛను పొందడం కొనసాగిస్తారు.

4. ప్రధానమంత్రి చిన్న వ్యాపార గౌరవ పథకం ఈ పథకాన్ని 2019 సంవత్సరంలో ప్రారంభించారు. ఇది ప్రధానంగా చిన్న వ్యాపారులకు పెన్షన్ అందిస్తుంది. 60 సంవత్సరాల వయస్సు తరువాత వీరికి నెలవారీ చొప్పున కొంత మొత్తం పింఛనుగా అందిస్తారు.

Cyclone Tauktae: ఇవాళ భీకర తుఫానుగా మారనున్న తౌక్తా తుఫాను… దేశంలోని పశ్చిమతీరంలో అలజడి సృష్టించే అవకాశం..!

International Day of Families 2021: అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం.. ఈ రోజు చరిత్ర, ప్రాముఖ్యత వివరాలు..

దోసకాయలు ఎందుకు చేదుగా ఉంటాయి..! ఆ చేదును ఎలా వదిలించుకోవాలి..? తెలుసుకోండి..