Petrol-Diesel Rates Today: మార్పు కనిపిస్తోంది.. తగ్గడంలో కాదు.. పెట్రోల్, డీజిల్ ధరలు మీ నగరంలో ఇలా..!
Petrol-Diesel Rates Today: దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరల్లో చిన్నపాటి మార్పులు చోటు చేసుకున్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో కూడా స్వల్ప మార్పు కనిపించాయి. మరో వైపు...
Petrol-Diesel Rates Today: దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరల్లో చిన్నపాటి మార్పులు చోటు చేసుకున్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో కూడా స్వల్ప మార్పు కనిపించాయి. మరో వైపు ఎటు తిరిగితే కరోనా మహమ్మారి ఎక్కడ అంటుకుంటుందో అనే భయం ప్రజలు కట్టడిలో ఉంటున్నారు. అత్యవసరం అయితే తప్ప బయట తిరగడానికి ఉత్సాహం చూపించడం లేదు. ఈ నేపథ్యంలో అన్ని రంగాలూ ఏప్రిల్ నెలలో గట్టి తిరోగమన ప్రభావాన్ని ఎదుర్కొన్నాయి. ఇక ఎక్కడా ప్రజల ప్రయాణాలు తగ్గిపోవడంతో దేశంలో పెట్రోల్ డీజిల్ అమ్మకాలు కూడా తగ్గిపోయాయి. అయితే అధికారిక సమాచారం ప్రకారం.. శనివారం నాడు దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి.
తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 95.97గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 90.43గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 96.13 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.90.57 గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 96.03గా ఉండగా.. డీజిల్ ధర రూ. 90.47 గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 96.37గా ఉండగా.. డీజిల్ ధర రూ.90.80గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 95.97ఉండగా.. డీజిల్ ధర రూ.90.43 గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 95.52 పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 90గా ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ. 98.56కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 92.46 లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ. 97.56 ఉండగా.. డీజిల్ ధర రూ.91.47గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 97.77లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.91.67 గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 98.26 గా ఉండగా.. డీజిల్ ధర రూ.92.18గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ. 98.56లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.92.46 లకు లభిస్తోంది.
దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు.. దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ. 92.34గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 82.95 లకు లభిస్తోంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 98.65కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.90.11 గా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ. 92.44 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 85.79గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 94.18 ఉండగా.. డీజిల్ ధర రూ.87.89గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ. 95.41 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.87.94 గా ఉంది. లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 90.17ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.83.32 గా ఉంది.
ఇవి కూడా చదవండి: