Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TVS Jupiter 125: టీవీఎస్‌ జూపిటర్‌ లవర్స్‌కు గుడ్‌ న్యూస్‌.. కొత్త ఫీచర్లతో స్మార్టెస్ట్‌ వెర్షన్‌ రిలీజ్‌…

ఈ స్కూటర్ల రంగంలో మొదటి నుంచి హోండా యాక్టివా, టీవీఎస్‌ జూపిటర్‌ తమదైన హవా నిరూపిస్తున్నాయి. తాజాగా టీవీఎస్‌  జూపిటర్ 125లో నవీకరించిన వేరియంట్‌ను విడుదల చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. అదనపు రైడర్ సౌలభ్యం కోసం కనెక్ట్ చేసిన ఫీచర్లతో టీవీఎస్‌ జూపిటర్‌ 125 మార్కెట్‌లో లాంచ్‌ చేశారు. ఈ అప్‌డేటెడ్‌ టీవీఎస్‌ జూపిటర్‌ 125లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయో? ఓ సారి తెలుసుకుందాం.

TVS Jupiter 125: టీవీఎస్‌ జూపిటర్‌ లవర్స్‌కు గుడ్‌ న్యూస్‌..  కొత్త ఫీచర్లతో స్మార్టెస్ట్‌ వెర్షన్‌ రిలీజ్‌…
Tvs Jupiter
Follow us
Srinu

|

Updated on: Oct 20, 2023 | 5:00 PM

భారతదేశంలో స్కూటర్లకు ఉన్న డిమాండ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలతో పోల్చుకుంటే పట్టణ ప్రాంతాల్లో స్కూటర్ల వినియోగం అధికం ఉంటుంది. పట్టణ ప్రాంతాల్లో పెరిగిన ట్రాఫిక్‌ నేపథ్యంలో ప్రతి సిగ్నల్‌ పాయింట్‌ వద్ద బైక్‌ ఆపి, గేర్‌లు మార్చుకుని వెళ్లడం చికాకుగా అనిపిస్తుండడంతో చాలా మంది స్కూటర్లను ఆశ్రయిస్తున్నారు. అలాగే మహిళా ఉద్యోగులు సైతం స్కూటర్లను వాడడానికి ఇష్టపడడంతో వీటి డిమాండ్‌ ఆమాంతం పెరిగింది. దీనికి అనుగుణంగా కంపెనీలు కూడా కొత్త ఫీచర్లతో స్కూటర్లను మార్కెట్‌లోకి లాంచ్‌ చేస్తున్నాయి. ఈ స్కూటర్ల రంగంలో మొదటి నుంచి హోండా యాక్టివా, టీవీఎస్‌ జూపిటర్‌ తమదైన హవా నిరూపిస్తున్నాయి. తాజాగా టీవీఎస్‌  జూపిటర్ 125లో నవీకరించిన వేరియంట్‌ను విడుదల చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. అదనపు రైడర్ సౌలభ్యం కోసం కనెక్ట్ చేసిన ఫీచర్లతో టీవీఎస్‌ జూపిటర్‌ 125 మార్కెట్‌లో లాంచ్‌ చేశారు. ఈ అప్‌డేటెడ్‌ టీవీఎస్‌ జూపిటర్‌ 125లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయో? ఓ సారి తెలుసుకుందాం.

టీవీఎస్‌ జూపిటర్‌ 125 స్కూటర్‌ స్మార్ట్‌ఎక్స్‌ కనెక్ట్‌ సూట్‌తో ఆకర్షణీయంగా ఉంటుంది. జూపిటర్ స్కూటర్‌లో బ్లూటూత్ ఎనేబుల్ చేసిన టీఎఫ్‌టీ స్క్రీన్‌తో పాటు క్లస్టర్ ద్వారా  స్మార్ట్‌ ఎక్స్‌ టాక్‌, స్మార్ట్‌ ఎక్స్‌ ట్రాక్‌ ఫీచర్లకు మరింత మద్దతు ఇస్తుంది. అంటే టీవీఎస్‌ జూపిటర్ 125 స్కూటర్ ఇప్పుడు టర్న్-బై-టర్న్ నావిగేషన్, వాయిస్ అసిస్టెంట్, కాల్, మెసేజ్ నోటిఫికేషన్‌లకు మద్దతు ఇస్తుంది. అలాగే రైడర్‌ రైడ్‌ చేస్తున్న సమయంలోనే సోషల్ మీడియా నోటిఫికేషన్‌లను కూడా వీక్షించే అవకాశం ఉంటుంది. రియల్ టైమ్ స్పోర్ట్స్ స్కోర్‌ల, వాతావరణ అప్‌డేట్‌లు, న్యూస్ అప్‌డేట్‌లను తెలుసుకోవడానికి వీలుగా ఉంటుంది. టీవీఎస్‌ జూపిటర్‌ 125 స్మార్ట్‌ ఎక్స్‌ కనెక్ట్‌ వేరియంట్ ఎలిగెంట్ రెడ్, మాట్ కాపర్ బ్రాంజ్ అనే రెండు కొత్త కలర్ ఆప్షన్‌లతో కంపెనీ లాంచ్‌ చేసింది. 

ఈ నయా లాంచ్‌పై టీవీఎస్ మోటార్ కంపెనీకి చెందిన కమ్యూటర్స్, కార్పొరేట్ బ్రాండ్ & డీలర్ ట్రాన్స్‌ఫర్మేషన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అనిరుద్ధ హల్దార్ మాట్లాడుతూ నేటి వేగవంతమైన ప్రపంచంలో కనెక్ట్ అవ్వడం చాలా సౌకర్యంగా మారింది. స్మార్ట్‌ఎక్స్‌ కనెక్ట్‌తో సరికొత్త టీవీఎస్‌ జూపిటర్ 125 పరిచయం ప్రయాణంలో మిమ్మల్ని సజావుగా కనెక్ట్ చేసేలా రూపొందించామని వివరించారు. పనితీరు పరంగా జూపిటర్ 125 124.8 సీసీ ఎయిర్-కూల్డ్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. అలాగే 8 హెచ్‌పీ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే లీటర్‌ పెట్రోల్‌కు 57.27 కిలోమీటర్ల మైలేజ్‌ను అందిస్తుంది. జూపిటర్ స్ట్రాట్ ధరలు రూ. 86,305 నుంచి రూ. 96,655 వరకూ ఉంటాయి. జూపిటర్‌ స్మార్ట్‌ కనెక్ట్‌ టాప్ ట్రిమ్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి