AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RD Scheme: నెలవారీ పొదుపు చేసే వాళ్లకి గుడ్ న్యూస్.. ఆ పోస్టాఫీస్ స్కీమ్ ద్వారా అదిరే రాబడి..!

భారతదేశంలోని పెట్టుబడిదారులకు నమ్మకమైన పెట్టుబడి ఎంపికలుగా పోస్టాఫీసు పథకాలు ఉంటాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు పొదుపు అలవాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గతంలో పోస్టాఫీసుల్లో చిన్న మొత్తాల పొదుపు పథకాలను ప్రారంభించింది. ఈ పథకాల్లో నెలవారీ పొదుపు చేసే వాళ్లకు రికరింగ్ డిపాజిట్ స్కీమ్ అనువైనదని నిపుణులు చెబుతున్నారు. అయితే స్కీమ్‌లో రాబడి గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

RD Scheme: నెలవారీ పొదుపు చేసే వాళ్లకి గుడ్ న్యూస్.. ఆ పోస్టాఫీస్ స్కీమ్ ద్వారా అదిరే రాబడి..!
Post Office Money
Nikhil
|

Updated on: Mar 01, 2025 | 4:16 PM

Share

పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ (ఆర్‌డీ) పథకం చిన్న నెలవారీ విరాళాల ద్వారా సంపదను పెంచుకోవడానికి ఒక గొప్ప మార్గం. కేవలం రూ. 100 కనీస డిపాజిట్‌తో ఈ స్కీమ్‌లో చేరవచ్చు. ఈ పథకంలో 6.7 శాతం ఆకర్షణీయమైన వడ్డీ రేటును పొందవచ్చు. అలాగే పెట్టుబడిపై హామీతో పాటు సురక్షితమైన రాబడిని వస్తుంది. పోస్ట్ ఆఫీస్ ఆర్‌డీ పథకం స్థిర రాబడితో కూడిన నమ్మకమైన పెట్టుబడి ఎంపిక. ఇది ఐదు సంవత్సరాల మెచ్యూరిటీ ప్లాన్ చిన్న నెలవారీ డిపాజిట్లు చేయడం ద్వారా గణనీయమైన పొదుపులను కూడబెట్టుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ స్కీమ్‌లో నెలకు ఎంత పెట్టుబడి పెడితే ఎంత లాభం వస్తుందో? ఓ సారి తెలుసుకుందాం.

వివిధ నెలవారీ పెట్టుబడులపై రాబడి

  • ప్రతి నెలా రూ. 2000 పెట్టుబడి పెట్టడం 5 సంవత్సరాలలో మొత్తం పెట్టుబడి రూ. 1,20,000 అవుతుంది. మెచ్యూరిటీ మొత్తం రూ. 1,42,732 వస్తుంది. అంటే ఈ స్కీమ్‌ ద్వారా పెట్టుబడిపై రూ. 22,732 మేర లాభం పొందవచ్చు. 
  • ప్రతి నెలా రూ. 3000 పెట్టుబడి పెట్టడం 5 సంవత్సరాలలో మొత్తం పెట్టుబడి రూ. 1,80,000 అవతుంది. మెచ్యూరిటీ మొత్తం రూ. 2,14,097 వస్తుంది. లాభం రూ. 34,097 వస్తుంది. 
  • ప్రతి నెలా రూ. 5000 పెట్టుబడి పెట్టడం ద్వారా ఐదు సంవత్సరాలలో మొత్తం పెట్టుబడి రూ. 3,00,000 అవతుంది. మెచ్యూరిటీ అనంతరం రూ. 3,56,830 పొందవచ్చు. ఈ స్కీమ్‌లో సంపాదించిన మొత్తం వడ్డీ రూ. 56,830గా ఉంటుంది. 

పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ పథకం అనేది కాలక్రమేణా తమ పొదుపును పెంచుకోవాలనుకునే వ్యక్తులకు సురక్షితమైన, క్రమశిక్షణ కలిగిన పెట్టుబడి ఎంపిక అని నిపుణులు చెబుతున్నారు. స్థిరమైన డిపాజిట్ ప్లాన్‌తో మీరు స్థిర వడ్డీ రేటు నుంచి ప్రయోజనం పొందుతూ గణనీయమైన రాబడిని పొందవచ్చు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..