Gold Silver Price Today: మహిళలకు శుభవార్త.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతంటే..
Latest Gold Silver Prices: బులియన్ మార్కెట్‌లో పసిడి, వెండి ధరల్లో నిత్యం మార్పులు చోటుచేసుకుంటుంటాయన్న విషయం తెలిసిందే. ఒక్కోసారి పెరిగితే.. మరికొన్ని సార్లు తగ్గుతుంటాయి. తాజాగా పసిడి ధర తగ్గింది...
Latest Gold Silver Prices: బులియన్ మార్కెట్‌లో పసిడి, వెండి ధరల్లో నిత్యం మార్పులు చోటుచేసుకుంటుంటాయన్న విషయం తెలిసిందే. ఒక్కోసారి పెరిగితే.. మరికొన్ని సార్లు తగ్గుతుంటాయి. తాజాగా పసిడి ధర తగ్గింది. ఆదివారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,100 గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,750 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,100 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,800 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,120 గా ఉంది. చెన్నై నగరంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,850, 24 క్యారెట్ల ధర రూ.52,210 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,750 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,210 ఉంది. కేరళలో 22 క్యారెట్ల ధర రూ.47,750 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,210గా ఉంది.
కాగా.. ఈ ధరలు బులియన్ మార్కెట్ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. అయితే.. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు చేర్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. కావున మీరు కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది. వెండి కిలో రూ.1000 తగ్గి రూ.61,700 ఉంది.