AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Radhika Jeweltech: 50 శాతం పెరగనున్న ఆ స్టాక్‌..! అంచనాలను తగ్గించిన బ్రోకింగ్ సంస్థ..

గత మూడు వారాలుగా స్టాక్ మార్కెట్‌లో రికవరీ కొనసాగుతోంది. దీంతో పాటు పడిపోయిన షేర్లలో బై బ్యాక్ కూడా నమోదైంది. అటువంటి షేర్లలో రాధికా జ్యువెల్‌టెక్‌ కంపెనీ స్టాక్ గత 3 సెషన్‌లలో 13 శాతం పెరిగింది.

Radhika Jeweltech: 50 శాతం పెరగనున్న ఆ స్టాక్‌..! అంచనాలను తగ్గించిన బ్రోకింగ్ సంస్థ..
Stock Market
Srinivas Chekkilla
|

Updated on: Jun 05, 2022 | 7:26 AM

Share

గత మూడు వారాలుగా స్టాక్ మార్కెట్‌లో రికవరీ కొనసాగుతోంది. దీంతో పాటు పడిపోయిన షేర్లలో బై బ్యాక్ కూడా నమోదైంది. అటువంటి షేర్లలో రాధికా జ్యువెల్‌టెక్‌ కంపెనీ స్టాక్ గత 3 సెషన్‌లలో 13 శాతం పెరిగింది. కంపెనీ త్రైమాసిక పనితీరు బలహీనంగా ఉంది. బ్రోకింగ్ సంస్థ ఇక్కడ నుండి స్టాక్ 50 శాతానికి పైగా పెరుగుతుందని అంచనా వేసింది. బ్రోకింగ్ సంస్థ జూన్ 1న విడుదల చేసిన పరిశోధన నివేదికలో స్టాక్‌కు 295 టార్గెట్‌ను ఇచ్చింది, ప్రస్తుతం ఈ స్టాక్ 195.35 స్థాయిలో ఉంది. అంటే, ఇక్కడి నుంచి కూడా షేరులో 51 శాతం పెరుగుదల అంచనా. బ్రోకింగ్ సంస్థ ఇంతకుముందు స్టాక్‌కు 303 లక్ష్యాన్ని నిర్దేశించింది. బ్రోకింగ్ సంస్థ ప్రకారం, కంపెనీ నాల్గవ త్రైమాసిక ఫలితాలు అంచనాల కంటే బలహీనంగా ఉన్నాయి. కాబట్టి లక్ష్యం తగ్గింది. నాలుగో త్రైమాసికంలో కంపెనీ ఆదాయాలు 9.7 శాతం క్షీణించాయి. ఎబిటా మార్జిన్ కూడా పడిపోయాయి. ఇదే సమయంలో గతేడాదితో పోలిస్తే లాభాలు 50 శాతానికి పైగా తగ్గాయి.

రాధిక జ్యువెల్‌టెక్ అనేది బంగారం, వజ్రాల ఆభరణాలతో వ్యవహరించే రిటైల్ జ్యువెలర్. కంపెనీ దాదాపు 35 ఏళ్లుగా వ్యాపారం చేస్తోంది. బ్రోకింగ్ కంపెనీ ఏప్రిల్‌లో విడుదల చేసిన నివేదికలో, కంపెనీ తన కస్టమర్లలో మంచి పట్టును కలిగి ఉందని తెలిపింది. కంపెనీ ప్రకారం, భారతదేశంలో ఆభరణాలు కొనుగోలు చేయడం సంప్రదాయంలో భాగమని, ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్నందున, ప్రజల కొనుగోలు శక్తి కూడా పెరుగుతోంది. దీంతో రానున్న కాలంలో బంగారు ఆభరణాలకు డిమాండ్ కూడా పెరుగుతుంది. మే నెల దిగుమతి డేటాలో కూడా ఈ ట్రెండ్‌కు మద్దతు ఉంది. గతేడాదితో పోలిస్తే గత నెలలో బంగారం దిగుమతులు 700 శాతానికి పైగా పెరిగాయి. దేశంలోకి దిగుమతి అయ్యే వస్తువులలో బంగారం దిగుమతి విలువ కంటే ముడి చమురు మాత్రమే ఎక్కువగా ఉంది.