Gold Investment : ఎనిమిది నెలల్లో 12,927 రూపాయలు తగ్గిన బంగారం ధర.. వచ్చే రోజుల్లో పసిడిపై పెట్టుబడి పెట్టొచ్చా.. లేదా..?

Gold Investment : కరోనా సంక్షోభం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు బంగారంపై అధికంగా పెట్టుబడులు పెడుతున్నారు. భారీగా కొనుగోలు చేయడం

Gold Investment : ఎనిమిది నెలల్లో 12,927 రూపాయలు తగ్గిన బంగారం ధర.. వచ్చే రోజుల్లో పసిడిపై పెట్టుబడి పెట్టొచ్చా.. లేదా..?
Gold Price
Follow us

|

Updated on: Mar 29, 2021 | 8:53 PM

Gold Investment : కరోనా సంక్షోభం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు బంగారంపై అధికంగా పెట్టుబడులు పెడుతున్నారు. భారీగా కొనుగోలు చేయడం వల్ల బంగారం ధర 2020 ఆగస్టులో రికార్డు స్థాయికి చేరుకుంది. అంతేకాకుండా పెట్టుబడిదారులకు భారీ లాభాలను ఇచ్చింది. ఆగస్టు 7, 2020న బులియన్ మార్కెట్లో బంగారం ధర 10 గ్రాములకు 57,008 రూపాయల గరిష్టాన్ని తాకింది. అదే సమయంలో వెండి ధర కూడా తారా స్థాయికి చేరింది. కరోనా వ్యాక్సిన్ యొక్క శుభవార్తతో, ప్రజలు ఇతర పెట్టుబడి ఎంపికల వైపు మొగ్గు చూపడంతో బంగారం, వెండి ధరలు తగ్గడం ప్రారంభించాయి. ఇప్పటి వరకు గడిచిన ఎనిమిది నెలల్లో బంగారం ధర 12,927 తగ్గింది.

2020 ఆగస్టు నుంచి 2021 మార్చి 26 శుక్రవారం10 గ్రాములకు రూ .44,081 కు పడిపోయింది. 2020 ఆగస్టు 7 న వెండి కిలోకు రూ.77,840 వద్ద ఉండగా, శుక్రవారం రూ.1రూ .64,276 కు పడిపోయింది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం బంగారం, వెండి ధరలు రోజు రోజుకు పెరుగుతుంటే ఇందులో పెట్టుబడులు పెట్టాలా లేదా ఇతర ఎంపికలపై మొగ్గు చూపాలా అనేది కొంతమంది తేల్చుకోలేకపోతున్నారు. కొంతమంది తమ దగ్గర ఉన్న బంగారాన్ని అమ్మాలా లేదా అనే అయోమయంలో ఉన్నారు. అయితే నిపుణులు మాత్రం మీరు ఇప్పుడు బంగారంపై పెట్టుబడులు పెడితే భవిష్యత్ లో మంచి ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు.

ప్రపంచవ్యాప్తంగా కరోనా టీకా ప్రచారం వేగవంతం కావడంతో ప్రజలు ఇతర పెట్టుబడి ఎంపికల వైపు మొగ్గు చూపుతున్నారని నిపుణులు అంటున్నారు. ఇది బంగారం ధరలను తగ్గించింది. ప్రపంచంలోని అనేక స్టాక్ మార్కెట్లతో పాటు భారత స్టాక్ మార్కెట్ పందుకుంది. స్టాక్ మార్కెట్లు పెరిగేకొద్దీ, లాభాలతో పాటు రిస్క్ కూడా పెరుగుతుంది. అప్పుడు పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడి బంగారం వైపు మొగ్గు చూపుతారు. ఇది బంగారం ధరలకు తోడ్పడుతుంది దీంతో బంగారం ధర మళ్లీ పెరిగే అవకాశాలు ఉన్నాయి. మునుపటి సంవత్సర గణాంకాల ప్రకారం 2021 లో బంగారం ధరలు కూడా పెరుగుతాయని నిపుణులు భావిస్తున్నారు. 2021 లో బంగారం ధరలు రూ.63,000 స్థాయిని దాటి కొత్త రికార్డును సృష్టిస్తాయని అంచనా వేస్తున్నారు.

పెరిగిన కరోనా టీకాలు ఆర్థిక కార్యకలాపాలను వేగవంతం చేశాయి. దీంతో ప్రజలు మరింత ప్రమాదకర పెట్టుబడి ఎంపికల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇందులో ఈక్విటీ, క్రిప్టోకరెన్సీ వంటి ఎంపికలు ఉన్నాయి. క్రిప్టోకరెన్సీపై భారత ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటున్న మాట వాస్తవమే. అదే సమయంలో ఈక్విటీ మార్కెట్ ఇప్పుడు విజృంభిస్తోంది. అయితే బంగారం ధరల పతనం తాత్కాలికమైనది, స్వల్పకాలికం. అందువల్ల, పెట్టుబడిదారులు ప్రస్తుత ధరలకు బంగారంపై పెట్టుబడి పెట్టడం ద్వారా దీర్ఘకాలంలో బలమైన లాభాలను పొందవచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, బంగారం త్వరలో 1960 డాలర్లకు చేరుకుంటుంది.

సామ్ కరణ్ అచ్చం ధోనిలా ఆడాడు.. అందుకే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.. ఇద్దరి గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ ఏం చెప్పాడంటే..

Chavu Kaburu Challaga Movie: ‘సినిమా నచ్చని వారు క్షమించి ఇంకో అవకాశం ఇవ్వండి’.. ఆసక్తికరమైన ట్వీట్ చేసిన హీరో..