సామ్ కరణ్ అచ్చం ధోనిలా ఆడాడు.. అందుకే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.. ఇద్దరి గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ ఏం చెప్పాడంటే..
Buttler Coments : భారత్, ఇంగ్లాండ్ (IND vs ENG) మధ్య జరిగిన మూడో మ్యాచ్‌లో టీమ్ ఇండియా గెలిచి వన్డే సిరీస్‌ను గెలుచుకుంది. పూణేలో
Buttler Coments : భారత్, ఇంగ్లాండ్ (IND vs ENG) మధ్య జరిగిన మూడో మ్యాచ్‌లో టీమ్ ఇండియా గెలిచి వన్డే సిరీస్‌ను గెలుచుకుంది. పూణేలో జరిగిన ఆఖరి మ్యాచ్‌లో భారత్ కేవలం 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇంగ్లండ్ ఆల్ రౌండర్ సామ్ కుర్రాన్ భారత విజయాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశాడు ఒంటరిగా కష్టపడ్డాడు. అందుకే 330 పరుగుల లక్ష్యం ఉన్నప్పటికీ, భారత్ కేవలం 7 పరుగుల తేడాతో మాత్రమే విజయం సాధించింది. అయితే మ్యాచ్ అనంతరం ఇంగ్లాండ్ కెప్టెన్ మాట్లాడుతూ.. సామ్ అచ్చం ధోనిలా ఆడానని ప్రశంసించాడు. ఈ సందర్భంగా పలు విషయాలను వెల్లడించాడు.
సామ్ మైదానంలోకి వచ్చే సమయానికి, ఇంగ్లాండ్ మ్యాచ్ ఓడిపోయే స్థితిలో ఉంది. అయితే, 83 బంతుల్లో సామ్ 95 పరుగులు చేయడం భారత్ పెద్ద దెబ్బ. సామ్ కరణ్ చివరి వరకు అజేయంగా నిలిచాడు కానీ అతను ఇంగ్లాండ్‌ను విజయతీరాలకు చేర్చలేకపోయాడని చెప్పాడు. కరణ్‌లో ఎంఎస్ ధోనిలా ఆలోచించి ఇంగ్లాండ్‌ను గెలిపించాలనుకున్నాడని అన్నాడు. ధోని మ్యాచ్‌ను ఉత్తేజకరమైన స్థితిలో ఉంచుతాడు. సామ్ కరణ్ కూడా అలానే చేశాడు.
ధోని గొప్ప ఆటగాడు, సామ్ కరణ్ ఐపిఎల్ 14 లో ఇవన్ని నేర్చుకున్నాడు.అయితే అతడికి ఈ మ్యాచ్ ఓడిపోయినప్పటికీ గొప్ప అనుభవం మిగిలిందని పేర్కొన్నాడు. కష్ట సమయాల్లో ఎలా ముందుకు సాగాలో సామ్‌ని చూసి నేర్చుకోవాలని కొనియాడాడు. ఆల్ రౌండర్ సామ్ కరణ్ బ్యాటింగ్‌లో రాణించడమే కాదు.. బౌలింగ్‌లో కూడా రానించాడని అన్నాడు. రిషభ్ పంత్‌ను ఔట్ చేసి పెను ప్రమాదాన్ని తప్పించాడన్నాడు. అతను ఆడిన తీరు అద్భుతమని బట్లర్ ప్రశంసించాడు.