Gold Prices: గోల్డ్ ప్రియులకు గుడ్ న్యూస్.. బంగారం ధరలు ఒక్కసారిగా క్రాష్.. ఇప్పుడు తులం ఎంతంటే..?
దేశంలో బంగారం ధరలు గత కొద్దిరోజులుగా భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే.. అయితే ఇవాళ ఒక్కసారిగా తగ్గాయి. దీంతో కొనుగోలు చేేేసేవారికి ఇది మంచి పరిణామంగా చెప్పవచ్చు. ఇవాళ రూ.500 మేర బంగారం ధర తగ్గింది. ఇక వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.

బంగారం కొనుగోలు చేసేవారికి భారీ గుడ్ న్యూస్ అందింది. గోల్డ్ రేట్లు ఒక్కసారిగా డౌన్ అయ్యాయి. గత కొద్ది రోజులుగా ధరల్లో పెరుగుదల నమోదవుతుండగా.. ఇవాళ ఒక్కసారిగా క్రాష్ అయ్యాయి. దీంతో కొనుగోలుచేసేవారికి ఇది మంచి పరిణామంగా చెప్పవచ్చు. గోల్డ్ కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేసుకున్నవారికి ఇది సరైన సమయంగా చెప్పవచ్చు. గత కొద్ది రోజులుగా అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో ధరలు తగ్గినా.. దేశీయంగా మాత్రం పడిపోలేదు. కానీ డాలర్‌తో పోలిస్తే రాపాయి మారకం విలువ మళ్లీ పుంజుకుంది. దీంతో భారత్‌లో పసిడి ధరలు కుప్పకూలుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. శనివారం ధరలు పతనమవ్వగా.. ఈ పరిణామం తర్వాత ప్రస్తుతం దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో బంగారం, సిల్వర్ ధరలు ఎలా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం.
గోల్డ్ రేట్లు ఇలా..
-హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,59,060గా ఉండగా.. శుక్రవారం రూ.1,59,490 వద్ద స్థిరపడింది. దీంతో నిన్నటితో పోల్చుకుంటే ఇవాళ ఒక్కరోజే రూ.430 పడిపోయింది. ఇక 22 క్యారెట్ల ధర ప్రస్తుతం రూ.1,45,800 వద్ద ట్రేడవుతుండగా.. నిన్న రూ.1,46,200గా ఉంది. నేడు రూ.400 మేర తగ్గింది.
-శనివారం చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,60,690 వద్ద కొసాగుతోంది. నిన్న రూ.1,61,240 వద్ద స్ధిరపడగా.. ఈ రోజు రూ.550 తగ్గుదల నమోదైంది. ఇక 22 క్యారెట్ల ధర రూ.1,47,300గా ఉండగా.. శుక్రవారం రూ.1,47,800గా ఉంది. ఇవాళ ఒక్కరోజే రూ.500 తగ్గింది.
-బెంగళూరులో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,59,060గా ఉండగా.. నిన్న రూ.1,59,490 వద్ద ఉంది. ఇక 22 క్యారెట్ల ధర రూ.1,45,800గా ఉంది.
-ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన మేలిమి బంగారం ధర రూ.1,59,210 వద్ద ఉండగా.. నిన్నటి ధర రూ.1,59,640గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే ఇవాళ ఒక్కరోజే రూ.430గా ఉంది. ఇక 22 క్యారెట్ల ధర రూ.1,45,950గా ఉండగా.. శుక్రవారం రూ.1,46,250గా ఉంది. ఇవాళ రూ. 300 తగ్గింది.
వెండి రేట్లు ఇలా..
-ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.2.85 లక్షల వద్ద కొనసాగుతోంది.
-హైదరాబాద్‌లో కిలో సిల్వర్ ధర రూ.2.95 లక్షలుగా ఉంది
-చెన్నైలో కిలో సిల్వర్ ధర రూ.2.95 లక్షలుగా ఉంది
-బెంగళూరులో కేజీ సిల్వర్ ధర రూ.2.85 లక్షలుగా ఉంది
