Gold: బంగారం ఇప్పుడు కొనొచ్చా? కొన్ని రోజులు ఆగితే బెటరా..?

బడ్జెట్‌లో బంగారంపై కస్టమ్స్‌ డ్యూటీని 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గించడంతో దిగుమతి భారం తగ్గింది. సుంకాన్ని తగ్గించడంతో కిలోకు సుమారు రూ.3.90 లక్షల వరకు బంగారం ధర తగ్గింది. బడ్జెట్‌ తర్వాత 10 గ్రాముల బంగారం మీద రూ.5 వేల వరకు తగ్గింది. అటు వెండి కిలోకు రూ.7 వేల వరకు తగ్గి ప్రస్తుతం రూ.84 వేల రేటు పలుకుతోంది.

Gold: బంగారం ఇప్పుడు కొనొచ్చా? కొన్ని రోజులు ఆగితే బెటరా..?
Gold
Follow us

|

Updated on: Jul 26, 2024 | 9:51 PM

బంగారం ఇప్పుడు కొనొచ్చా?.. అవును.. కొనండి అంటున్నారు నిపుణులు. కేంద్ర బడ్జెట్‌ తర్వాత బంగారం ధరలు భారీగా తగ్గడంతో, దుకాణాల్లో కొనుగోళ్ల జోష్‌ పెరిగింది. గత వారం రోజులుగా పసిడి రేట్లు పడిపోతుండడంతో, బంగారం కొనడానికి వినియోగదారులు ఉత్సాహం చూపిస్తున్నారు. బడ్జెట్‌ తర్వాత హైదరాబాద్‌ మార్కెట్‌లో 10 గ్రాముల పసిడి ధర దాదాపు రూ.5 వేల మేర దిగొచ్చింది. బడ్జెట్‌లో కస్టమ్స్‌ సుంకాన్ని భారీగా తగ్గించడమే దీనికి ప్రధాన కారణం. దీంతో నగల దుకాణాల్లో ఒక్కసారిగా రద్దీ పెరిగింది. సాధారణ రోజులతో పోలిస్తే సుమారు 20 శాతం మేర బంగారానికి డిమాండ్‌ పెరిగిందని దుకాణదారులు చెబుతున్నారు. మరికొద్ది రోజుల్లో పండగల సీజన్‌ ప్రారంభం కానుండడంతో బంగారాన్ని కొనుగోలు చేసేందుకు జనం పోటీపడుతున్నారు. బంగారం ధర భారీగా తగ్గిన నేపథ్యంలో బంగారంలో పెట్టుబడులు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

బడ్జెట్‌లో బంగారంపై కస్టమ్స్‌ డ్యూటీని 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గించడంతో దిగుమతి భారం తగ్గింది. సుంకాన్ని తగ్గించడంతో కిలోకు సుమారు రూ.3.90 లక్షల వరకు బంగారం ధర తగ్గింది. బడ్జెట్‌ తర్వాత 10 గ్రాముల బంగారం మీద రూ.5 వేల వరకు తగ్గింది. అటు వెండి కిలోకు రూ.7 వేల వరకు తగ్గి ప్రస్తుతం రూ.84 వేల రేటు పలుకుతోంది. హైదరాబాదులో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 69 వేల ఎనిమిది వందల ఇరవై రూపాయలు ఉంది. ఇక 22 క్యారెట్స్ 10 గ్రాముల గోల్డ్ ధర 64 వేల రూపాయలు ఉంది. ధర తగ్గడం వల్ల రిటైల్‌ ఇన్వెస్టర్ల నుంచి బంగారంపై పెట్టుబడులు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో గోల్డ్‌ స్మగ్లింగ్‌ మాఫియాకు అడ్డుకట్ట పడడంతో పాటు, ప్రభుత్వానికి జీఎస్టీ, ఆదాయపు పన్ను రూపంలో రెవెన్యూ సమకూరుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇక బంగారం ధరలో స్థిరత్వం అనేది అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల నిర్ణయం, వివిధ దేశాల ఆర్థిక, భౌగోళిక రాజకీయ పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు.

బంగారం కొనాలనుకునేవాళ్లు వెంటనే కొనుక్కోండని సలహా ఇస్తున్నారు గోల్డ్ అనలిస్ట్‌ ప్రతాప్‌. కేంద్రం కస్టమ్స్‌ డ్యూటీని తగ్గించడంతో గోల్డ్, సిల్వర్ రేట్లు పెరిగాయంటున్నారు ఆయన. ఐదేళ్ల క్రితం సుంకం తగ్గడంతో బంగారం రేట్లు తగ్గాయని, ఆ తర్వాత రెండుమూడు నెలలకు మళ్లీ పెరిగాయని ప్రతాప్‌ చెబుతున్నారు. మరో మూడు నెలల తర్వాత బంగారం రేట్లు పెరిగే అవకాశం ఉంటుందని, కొనాలకున్నవాళ్లు ఇప్పుడే కొనుక్కోవడం మంచిదంటున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారిన విశాల్‌ ఇష్యూ
ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారిన విశాల్‌ ఇష్యూ
కొత్త వ్యాపారంలోకి నటుడు కృష్ణుడు.. ప్రభాస్ పెళ్లి షాపింగ్ ఇక్కడే
కొత్త వ్యాపారంలోకి నటుడు కృష్ణుడు.. ప్రభాస్ పెళ్లి షాపింగ్ ఇక్కడే
తెలుసా.. ఒంట్లో ఈ విటమిన్‌ లోపించినా కిడ్నీల్లో రాళ్లు పడతాయట!
తెలుసా.. ఒంట్లో ఈ విటమిన్‌ లోపించినా కిడ్నీల్లో రాళ్లు పడతాయట!
ఇకపై కథలు కుదరవ్.. గంజాయి సేవిస్తే ఈజీగా దొరికిపోతారు
ఇకపై కథలు కుదరవ్.. గంజాయి సేవిస్తే ఈజీగా దొరికిపోతారు
ఈ లక్షణాలు కనిపిస్తే క్యాన్సర్ ఉన్నట్లే.. అలస్యం చేయకండి
ఈ లక్షణాలు కనిపిస్తే క్యాన్సర్ ఉన్నట్లే.. అలస్యం చేయకండి
పానీయాలు తాగేందుకు ప్లాస్టిక్‌స్ట్రా వాడుతున్నారా.. జాగ్రత్త సుమా
పానీయాలు తాగేందుకు ప్లాస్టిక్‌స్ట్రా వాడుతున్నారా.. జాగ్రత్త సుమా
వామ్మో ఎలుగుబంట్లు..! బెంబేలెత్తుతున్న స్థానికులు..
వామ్మో ఎలుగుబంట్లు..! బెంబేలెత్తుతున్న స్థానికులు..
ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు ఎన్ని గుడ్లు తినాలో తెలుసా?
ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు ఎన్ని గుడ్లు తినాలో తెలుసా?
రేణు దేశాయ్‌కు సారె పెట్టి ఘనంగా సత్కరించిన మంత్రి కొండా సురేఖ..
రేణు దేశాయ్‌కు సారె పెట్టి ఘనంగా సత్కరించిన మంత్రి కొండా సురేఖ..
ఆరోగ్యానికి మంచిది కదాని డైజెస్టివ్ బిస్కెట్లు మీరూ తింటున్నారా?
ఆరోగ్యానికి మంచిది కదాని డైజెస్టివ్ బిస్కెట్లు మీరూ తింటున్నారా?
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!