Gold Price Today: బంగారం ప్రియులకు బ్యాడ్‌న్యూస్‌.. వరుసగా పెరుగుతున్న బంగారం ధర.. తాజా ధరల వివరాలు

Gold Price Today: బంగారం ప్రియులకు బ్యాడ్‌న్యూస్‌. గత కొత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన పసిడి.. ఇటీవల నుంచి మళ్లీ పెరుగుతోంది. మే నెలలో నుంచి రోజురోజుకు పెరుగుతూనే..

Gold Price Today: బంగారం ప్రియులకు బ్యాడ్‌న్యూస్‌.. వరుసగా పెరుగుతున్న బంగారం ధర.. తాజా ధరల వివరాలు
Gold Price

Gold Price Today: బంగారం ప్రియులకు బ్యాడ్‌న్యూస్‌. గత కొత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన పసిడి.. ఇటీవల నుంచి మళ్లీ పెరుగుతోంది. మే నెలలో నుంచి రోజురోజుకు పెరుగుతూనే ఉంది. అయితే అన్ని ప్రాంతాల్లో ధరలు ఒకేలా ఉండటం లేదు. తాజాగా సోమవారం కూడా బంగారం ధర పెరిగింది. అయితే రోజు పెరిగినదానికంటే ఈ రోజు స్వల్పంగా పెరిగింది. దేంంలోని ప్రధాన నగరాల్లో ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,910 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,910 ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,910 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,910 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45,110 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,210 వద్ద ఉంది. అలాగే కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,660 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,610 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,670 ఉంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,610 ఉండగా,24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,180 వద్ద కొనసాగుతోంది.

ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,610 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,180 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,610 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,180 ఉంది.

అయితే పసిడి రేట్లపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, కరోనా, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, బాండ్ ఈల్డ్ వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని చెబుతున్నారు. అయితే బంగారం ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతూనే ఉంటాయి. బంగారం కొనుగోలు చేసే వారు ధరలను తెలుసుకొని వెళ్లడం మంచిది.

ఇవీ కూడా చదవండి:

Income Tax: బ్యాంకు లావాదేవీలు జరుపుతున్నారా..? అయితే జాగ్రత్త.. ఐటీ నోటీసులు వచ్చే 5 రకాల లావాదేవీలు ఇవే..!

One Rupee Note: మీ వద్ద రూపాయి నోటు ఉందా.? అయితే మీరు కోటీశ్వరులు కావచ్చు.. ఎలాగంటే..!