Gold Price Today: గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతుందంటే.?
Gold Price Today: బంగారం, వెండి ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. ఒకరోజు పెరిగితే, మరోరోజు తగ్గుంతుంటాయి. అయితే, గత రెండు రోజులుగా పెరుగుతూపోతోన్న బంగారం, వెండి ధరలు నేడు కాస్త రిలీఫ్ ఇచ్చాయనే చెప్పుకోవాలి. నేటి ఉదయం దేశంలో నమోదైన ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం..
Gold Price Today: బంగారం ధరలు మరోసారి తగ్గాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఎఫెక్ట్‌తో దేశీయంగా బంగారం ధరలు రికార్డు స్థాయిలో పడిపోతున్నాయి. గడిచిన వారం రోజుల్లో ఏకంగా రూ. 3 వేల వరకు తగ్గాయి. అయితే, గత రోజుల నుంచి పెరిగిన పసిడి ధరలు.. నేడు తగ్గి వినియోగదారులకు ఊరటనిచ్చాయి. అయితే నిన్నటితో పోలిస్తే.. ఇవాళ బంగారం ధరల్లో రూ.10ల మేర తగ్గింది. ఈ మేరకు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో గోల్డ్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 69,490లుగా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 75,790లుగా ఉంది. ఇక ఆర్ధిక రాజధాని ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 69,340గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 75,640గా కొనసాగుతోంది.
వెండి ధరలు ఇలా..
వెండి ధరలు కూడా బంగారం బాటలోనే సాగుతున్నాయి. నిన్నటితో పోల్చితే, నేడు వెండి ధర కిలోకు రూ. 100ల మేర తగ్గింది. ప్రస్తుతం ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, ముంబై, పూణేలో కిలో వెండి రూ. 89,400గా ఉంది. ఇక హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, చెన్నైలో కేజీ వెండి. రూ. 98,900గా కొనసాగుతోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..