Gold Price Today: మహిళలకు గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే?

Gold Price Today: ప్రపంచవ్యాప్తంగా బంగారం, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది. అయితే, వీటి ధరలు ఒక్కోసారి తగ్గితే.. మరికొన్ని సార్లు పెరుగుతుంటాయి. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల మేరకు ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు జరుగుతుంటాయి. ఇటీవల కాలంలో తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు.. మళ్లీ పెరుగుతున్నాయి.

Gold Price Today: మహిళలకు గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే?
Gold Price Today
Follow us
Venkata Chari

|

Updated on: Oct 21, 2024 | 7:52 AM

Gold Price Today: బంగారం ధరల్లో ప్రతీరోజూ హెచ్చుతగ్గులు కనిపిస్తుంటాయి. గత మూడు రోజులుగా పెరుడుతోన్న బంగారం ధర.. తాజాగా తగ్గి జనాలకు షాక్ ఇచ్చింది. ప్రస్తుతం 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ఏకంగా రూ. 10 మేరకు తగ్గి రూ. 79,410కి చేరింది. అటు 22 క్యారెట్ల తులం గోల్డ్‌ రూ. 10కి తగ్గి పెరిగి రూ. 72,790గా ఉంది. అంతర్జాతీయంగా మార్కెట్ ఒడిదుడుకులు, గోల్డ్ రిజర్వ్‌ల నిల్వ వంటి అంశాలు గోల్డ్ రేట్స్‌పై ప్రభావం చూపిస్తున్నాయని నిపుణులు అంటున్నారు. మరి దేశంలోని వివిధ నగరాల్లో సోమవారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దామా..

* దేశ రాజధాని న్యూఢిల్లీలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 72,920గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ ధర రూ. 79,560కి ఎగబాకింది.

* దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 72,790గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 79,410 వద్ద కొనసాగుతోంది.

* చెన్నైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 72,790గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 79,410 వద్ద కొనసాగుతోంది.

* బెంగళూరు విషయానికొస్తే ఇక్కడ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 72,790 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ ధర రూ. 79,410 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..

* హైదరాబాద్‌లో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 72,790గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 79,410 వద్ద కొనసాగుతోంది.

* ఇక విజయవాడలో కూడా 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 72,790కాగా,24 క్యారెట్ల బంగారం ధర రూ. 79,410గా ఉంది.

* సాగరనగరం విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 72,790గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 79,410 వద్ద కొనసాగుతోంది.

వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

బంగారం ధరలో పెరుగుదల కనిపిస్తే.. వెండి ధరలోనూ స్వల్ప పెరుగుదల కనిపించింది. తాజాగా సోమవారం కిలో వెండి ధరలో ఎలాంటి పెరుగుదల కనిపించలేదు. దీంతో ఢిల్లీతో పాటు, కోల్‌కతా, ముంబయి, పుణె వంటి నగరాల్లో కిలో వెండి ధర రూ. 99,400కి చేరింది. అలాగే చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,06,900గా.. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖలో కిలో వెండి ధర రూ. 1,06,900గా ఉంది. ఈ ధరలు ఈరోజు ఉదయం ఆరు గంటలకు నమోదైనవిగా గమనించగలరు. ఇక మిస్డ్ కాల్ ద్వారా బంగారం, వెండి తాజా ధరలను తెలుసుకోవచ్చు. బంగారం ధరలను తెలుసుకోవడానికి, మీరు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..