AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajnish wellness: పది రూపాయలుంటే మూడు షేర్లు మీవే.. ట్రేడింగ్‌లో ఆ కంపెనీపై పెట్టుబడిదారుల ఆసక్తి

ఇటీవల కాలంలో స్టాక్ మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. వాటిలో పెట్టుబడులు పెట్టేవారు ఎక్కువవుతున్నారు. పెరిగిన టెక్నాలజీ కారణంగా సామాన్య ప్రజలకు కూడా స్టాక్ లపై అవగాహన పెరిగింది. సిప్ లు, లంప్ సమ్ పెట్టుబడులు, ఐపీవోకు వస్తున్న కంపెనీలు తదితర వాటిని ఆసక్తిగా గమనిస్తున్నారు. తమ ఆదాయానికి అనుగుణంగా స్టాక్ లలో ఇన్వెస్ట్ చేస్తున్నారు.

Rajnish wellness: పది రూపాయలుంటే మూడు షేర్లు మీవే.. ట్రేడింగ్‌లో ఆ కంపెనీపై పెట్టుబడిదారుల ఆసక్తి
Stock Market
Nikhil
|

Updated on: Oct 21, 2024 | 12:26 PM

Share

సాధారణంగా స్టాక్ లలో పెట్టుబడులు పెట్టాలంటే కనీసం వేలల్లో అయినా ఇన్వెస్ట్ చేయాలని భావన అందరిలో నెలకొంది. కానీ అది నిజం కాదు. మీ దగ్గర రూ.పది రూపాయలు ఉన్నా స్టాక్ లను కొనే అవకాశం ఉంది. కొన్ని కంపెనీల స్టాక్ లు కేవలం రూ.5 కన్నా తక్కువగా ఉంటాయి. వాటిని పెన్నీ స్టాక్ లు అంటారు. వీటి ధర కూడా మార్కెట్ పరిస్థితులకు లోబడి పెరుగుతూ, తగ్గుతూ ఉంటుంది. ఇటీవల రజనీష్ కంపెనీకి చెందిన పెన్నీ స్టాక్ ధర 5 శాతం పెరిగింది. పెద్ద కంపెనీల షేర్ల ధర వేలల్లో ఉన్నట్టే కొన్నికంపెనీల షేర్లు ఐదు రూపాయల కంటే తక్కువగా ఉంటాయి. వీటిలో రజనీష్ కంపెనీ షేర్లు కూడా పెన్ని స్టాక్ లుగా కొనసాగుతున్నాయి. ఈ కంపెనీ షేర్ అక్టోబర్ 15వ తేదీన దాదాపు ఐదు శాతం పెరిగింది.

దేశ వ్యాప్తంగా కొత్తగా 20 దవా అవుట్ లెట్ స్టోర్లు తెరుస్తున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో షేర్ ధర పెరిగింది. హెల్త్ కేర్, వెల్నెస్ కు సంబంధించిన ఉత్పత్తులను రజనీస్ కంపెనీ విక్రయిస్తుంది. దేశ వ్యాప్తంగా కొనుగోలుదారుల ఆదరణ పొందింది. రజనీష్ కంపెనీ షేర్ అక్టోబర్ 15వ తేదీ మధ్యాహ్నం నాటికి బీఎస్ఈలో 41.2 శాతం పెరిగి రూ.3.03 వద్ద గ్రీన్ లో ట్రేడ్ అవుతోంది. అలాగే ఇంట్రా డే డీల్స్ లో స్టాక్ ధర 5.5 శాతం పెరిగి రూ.3.07 గరిష్ట స్థాయికి చేరుకుంది. అంటే ఈ స్టాక్ ధర ఐదు రూపాయల కంటే తక్కువగా ట్రేడవుతోంది. ఈ కంపెనీకి రూ.232.85 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ ను ఉంది.

దేశంలో కొత్తగా 20 దవా అవుట్ లెట్ల ఏర్పాటుకు రజనీష్ కంపెనీ సన్నాహాలు చేస్తోంది. దీని కోసం పటిష్టమైన ప్రణాళిక రూపొందించింది. వీటి విస్తరణ ద్వారా వార్షిక ఆదాయాన్ని రూ.300 కోట్ల నుంచి రూ.400 కోట్లకు పెరుగుతుందని భావిస్తోంది. ప్రతి అవుట్ లెట్ ద్వారా ఏడాదికి రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్ల ఆదాయం సమకూరనుంది. ఈ అవుట్ లెట్ల ద్వారా వచ్చే లాభాల మార్జిన్ ఐదు నుంచి తొమ్మిది శాతం వరకూ ఉంటుంది. హెల్త్ కేర్ ఉత్పత్తుల మార్కెట్ లో రజనీష్ కంపెనీకి మంచి స్థానం ఉంది. లైంగిక ఆరోగ్యం, వ్యక్తిగత సంరక్షణకు సంబంధించి ఉత్పత్తులను విక్రయిస్తోంది. అవుట్ లెట్ల ద్వారా తక్కువ ధరలకు విక్రయాలు జరపడంతో వినియోగదారుల ఆదరణ బాగుంది. 2015లో ఏర్పాటు చేసిన ఈ కంపెనీ అంచెలంచెలుగా ఎదుగుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..