AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadhaar Card: కొత్త సిమ్ తీసుకోవాలంటే ఆధార్ తప్పనిసరా..? అసలైన నిబంధనలు తెలిస్తే షాక్

భారతదేశంలో ప్రతి చిన్న అవసరానికి ఆధార్ కార్డు ఆధారంగా మారింది. ముఖ్యంగా బ్యాంకు ఖాతాలను తెరవడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను పొందాలంటే ఆధార్ తప్పనిసరిగా మారింది. అయితే ఇటీవల కాలంలో ఫోన్ వాడకం బాగా పెరిగింది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ ఓ ప్రత్యేక ఫోన్ నెంబర్ ఉండడం అనేది పరిపాటిగా మారింది. అయితే కొత్త సిమ్ తీసుకునే సమయంలో ఆధార్ కార్డు తప్పనిసరి అని కొంత మంది చెబుతూ ఉంటారు. అయితే సిమ్ కార్డు తీసుకోవడానికి టెలికం సంస్థలు పాటించే నిబంధనల గురించి తెలుసుకుందాం.

Aadhaar Card: కొత్త సిమ్ తీసుకోవాలంటే ఆధార్ తప్పనిసరా..? అసలైన నిబంధనలు తెలిస్తే షాక్
Aadhaar Card Sim
Nikhil
|

Updated on: Oct 21, 2024 | 12:45 PM

Share

భారతదేశంలో ఒక వ్యక్తికి సంబంధించిన గుర్తింపును ధ్రువీకరించడానికి ఆధార్ అత్యంత కీలకమైన పత్రాలలో ఒకటిగా మారింది. ఆధార్ అంటే వ్యక్తికి సంబంధించిన బయోమెట్రిక్, డెమోగ్రాఫిక్ డేటాకు అనుసంధానించిన ప్రత్యేకమైన 12 అంకెల గుర్తింపు సంఖ్య. ప్రభుత్వ సేవలను పొందడం, పన్నులు దాఖలు చేయడం, బ్యాంకు ఖాతాలు తెరవడం, పాస్‌పోర్ట్‌ల కోసం దరఖాస్తు చేయడం, మొబైల్ సిమ్ కార్డులను పొందడం వంటి వివిధ అధికారిక ప్రయోజనాల కోసం ఆధార్ తప్పనిసరిగా మారింది. దీని విస్తృత వినియోగం పరిపాలనా ప్రక్రియలను క్రమబద్ధీకరించడంలో సహాయపడుతుంది. అలాగే పబ్లిక్ సర్వీస్ డెలివరీలో పారదర్శకత నిర్ధారిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి భారతదేశంలో మొబైల్ సిమ్ పొందడానికి ఆధార్ తప్పనిసరి కాదు. 

అయితే ఆధార్ అనేది నో యువర్ కస్టమర్ ప్రక్రియ కోసం ఆమోదించిన గుర్తింపు రుజువులలో ఇది ఒకటిగా ఉంది. యూఐడీఏఐ  అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం మొబైల్ కనెక్షన్ పొందేందుకు ఆధార్ తప్పనిసరి కాదు. అయినప్పటికీ టెలిగ్రాఫ్ చట్టం, 1885కి సవరణల ప్రకారం టెలికాం వినియోగదారులు కొత్త సిమ్ కార్డ్‌ని పొందేందుకు ధ్రువీకరణతో పాటుగా తమ ఆధార్ నంబర్‌ను కేవైసీ డాక్యుమెంట్‌గా స్వచ్ఛందంగా ఉపయోగించవచ్చు. మీ భద్రతతో పాటు దేశ భద్రత కోసం ఆధార్ వంటి నమ్మకమైన ఐడెంటిఫైయర్‌ని ఉపయోగించి మొబైల్ వినియోగదారుల గుర్తింపును ధ్రువీకరించాలని సిఫార్సు చేస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. 

ముఖ్యంగా ఆధార్ ధ్రువీకరణతో సిమ్ దుర్వినియోగం అదుపులో ఉంటుంది ఎందుకంటే చాలా మంది నేరస్థులు, ఉగ్రవాదులు నకిలీ గుర్తింపులను ఉపయోగించి లేదా మోసం మరియు ఇతర నేరాలకు పాల్పడేందుకు అనుమానం లేని వ్యక్తుల పేర్లతో సిమ్ కార్డ్‌లను పొందుతున్నారు. మొబైల్ నంబర్‌ని ధ్రువీకరించి ఆధార్‌తో లింక్ చేసినప్పుడు, మోసగాళ్లు, నేరస్థులు, ఉగ్రవాదులను గుర్తించడం సులభం అవుతుంది. ఆధార్ ధృవీకరణ సమయంలో సేకరించిన మీ బయోమెట్రిక్‌లను నిల్వ చేయడానికి లేదా ఉపయోగించడానికి మొబైల్ ఫోన్ కంపెనీలతో సహా ఏ సంస్థకు అనుమతి లేదని యూఐడీఏఐ స్పష్టం చేసింది. అలాగే డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ మార్గదర్శకాల ప్రకారం మీరు మీ పేరుతో తొమ్మిది మొబైల్ నంబర్‌లను నమోదు చేసుకోవచ్చు. అంటే ఆధార్ కార్డు ఆధారంగా ప్రతి వ్యక్తి తొమ్మిది నెంబర్లు తీసుకునే వెసులుబాటు ఉంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..