Last minute deals: దీపావళికి విమానంలో ఎగిరిపోతారా..? టిక్కెట్లపై పేటీఎం ప్రత్యేక ఆఫర్..!
అందరికీ ఇష్టమైన దీపావళి పండగ వచ్చేస్తోంది. కుటుంబ సభ్యులందరితో కలిసి సంతోషంగా జరుపుకోవడానికి ప్రతి ఒక్కరూ అందరికీ ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఉద్యోగాలు, వ్యాపారాల కోసం దూర ప్రాంతాల్లో స్థిర పడిన వారందరూ తమ స్వగ్రామాలకు వెళ్లడానికి ప్రణాళిక రూపొందించుకుంటున్నారు. రైళ్లలో తమ సొంతూర్ల కు వెళ్లడానికి సమయం చాలా ఎక్కువ పడుతుంది. సెలవులన్నీ రైలులోనే గడిచిపోతాయి. అదే విమానాల్లో వెళితే చాలా తక్కువ సమయంలో గమ్యస్థానాలను చేరుకోవచ్చు. కానీ వాటి టిక్కెట్ల ధర ఎక్కువగా ఉంటుంది.
పండగ సమయంలో రద్దీ నేపథ్యంలో మరింత పెరిగే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో ప్రయాణికుల సౌకర్యంలో కోసం పేటీఎం, యాక్సిస్ బ్యాంకు సంయుక్తంగా లాస్ట్ మినిట్ డీల్స్ పేరుతో దీపావళి సేల్స్ ప్రకటించాయి. ఈ ఆఫర్ ద్వారా దేశీయంగా, అంతర్జాతీయంగా విమానాల్లో ప్రయాణించేవారికి ప్రత్యేక తగ్గింపులు అందిస్తున్నాయి. అలాగే క్రెడిట్ కార్డులు, ఈఎంఐ విధానంలో టిక్కెట్లను కొనుగోలు చేయవచ్చు. వన్ 97 కమ్యూనికేషన్ లిమిడెట్ (ఓసీఎల్)కు చెందిన పేటీఎం.. ట్రావెల్ బుక్కింగ్ ల కోసం దీపావల్ సేల్స్ ప్రకటించింది. దీని కోసం యాక్సిస్ బ్యాంకును భాగస్వామిగా చేర్చుకుంది. దీనికి లాస్ట్ మినిట్ డీల్స్ అని పేరు పెట్టింది. పేటీఎం వినియోగదారులు అక్టోబర్ 13 నుంచి 31 లోపు విమానాల టిక్కెట్లను బుక్ చేసుకుంటే ప్రత్యేక తగ్గింపులు అందిస్తుంది. ప్రయాణానికి 15 రోజుల లోపు బుక్ చేసుకునే వారికి ఎంతో ప్రయోజనం కలుగుతుంది.
దీపావళి నేపథ్యంలో ప్రయాణానికి సిద్ధమవుతున్న వారికి పేటీఎం ప్రకటించిన ఆఫర్ ఎంతో ఉపయోగంగా ఉంటుంది. దేశీయంగా, అంతర్జాతీయంగా చేసే ప్రయాణాలపై రాయితీ అందుతుంది. దేశీయ విమానాలకు 12 శాతం, అంతర్జాతీయ విమానాలకు 5 శాతం తగ్గింపును ప్రకటించింది. యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డులు, ఈఎంఐ ల ద్వారా అందుబాటులో ఉంటాయి. పండగ రద్దీ నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం జస్ట్ ఇన్ టైమ్ పేరుతో దీపావళి సేల్ ను ప్రారంభించామని పేటీెఎం ప్రతినిధి తెలిపారు. షార్ట్ నోటీస్ ట్రావెల్ ప్లాన్లకు కూడా తగ్గింపులు అందించడమే తమ ఉద్దేశమన్నారు. అనుకోకుండా ప్రయాణానికి ప్లాన్ చేసుకున్నా, ప్రయాణానికి ముందు తక్కువ సమయంలో టిక్కెట్ల తీసుకున్నా ఈ ఆఫర్ ఉపయోగంగా ఉంటుందన్నారు. దేశీయ, అంతర్జాతీయ విమానాల్లో ప్రయాణించేవారు డబ్బులను పొదుపు చేసుకోవడానికి ఉపయోగపడుతుందన్నారు. తక్కువ ఖర్చుతోనే పండగను ఆనందంగా జరుపుకొనే వీలుంటుందన్నారు.
లాస్ట్ మినిట్ డీల్స్ ద్వారా తక్కువ ధరలో దీపావళి ట్రిప్పులను వేసుకునే అవకాశం ఉంది. చివరి నిమిషంలో బుక్ చేసుకున్న వారికి కూడా ప్రయోజనం కలగడం ఈ ఆఫర్ ప్రత్యేకత. ఈ నేపథ్యంలో దేశీయ ప్రయాణాలు చేసే పేటీఎం వినియోగదారులు ప్లేయాక్సిస్ఎల్ఎండీ ప్రోమో కోడ్ ను ఉపయోగించి టిక్కెట్ బుక్ చేసుకుంటే 12 శాతం అంటే దాదాపు 1200 తగ్గింపు లభిస్తుంది. అలాగే అంతర్జాతీయ ప్రయాణాల కోసం ఇన్టాయాక్సిస్ఎల్ఎండీ ప్రోమో కోడ్ ను ఉపయోగించి 5 శాతం అంటే దాదాపు 5 వేల వరకూ తగ్గింపు పొందే అవకాశం ఉంది. యాక్సిక్ బ్యాంకు క్రెడిట్ కార్డులు, ఈఎంఐ విధానంలో ఈ ఆఫర్ వర్తిస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..