Gold Price: స్వల్పంగా దిగివచ్చిన పసిడి ధరలు.. హైదరాబాద్‎లో తులం ఎంతంటే..

|

Feb 10, 2024 | 6:20 AM

పసిడి కొనేందుకు ఇష్టపడని వారు ఉండరు. అవకాశం దొరికితే ఒక్క గ్రాము అయినా కొనాలనుకుంటారు. అలాంటి వారికి స్వల్ప ఊరట లభించింది. పసిడి ధరలు నిన్న కాస్త పెరిగినప్పటికీ ఈరోజు స్వల్పంగా తగ్గింది. దీనికి ప్రధాన కారణం.. అంతర్జాతీయంగా డాలర్ విలువ పెరుగుదలతో పాటూ ఇజ్రాయిల్, పాలస్తీనా యుద్దం కూడా పసిడిపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

Gold Price: స్వల్పంగా దిగివచ్చిన పసిడి ధరలు.. హైదరాబాద్‎లో తులం ఎంతంటే..
Gold Price Today
Follow us on

పసిడి కొనేందుకు ఇష్టపడని వారు ఉండరు. అవకాశం దొరికితే ఒక్క గ్రాము అయినా కొనాలనుకుంటారు. అలాంటి వారికి స్వల్ప ఊరట లభించింది. పసిడి ధరలు నిన్న కాస్త పెరిగినప్పటికీ ఈరోజు స్వల్పంగా తగ్గింది. దీనికి ప్రధాన కారణం.. అంతర్జాతీయంగా డాలర్ విలువ పెరుగుదలతో పాటూ ఇజ్రాయిల్, పాలస్తీనా యుద్దం కూడా పసిడిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పైగా అంతర్జాతీయ మార్కెట్ ద్రవ్యోల్భణంలో వచ్చిన మార్పులు, విదేశాల్లో కొనసాగుతున్న ఆర్థిక మాంధ్యం, రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేట్లలో వచ్చిన హెచ్చుతగ్గులు ఇవన్నీ వెరసి బంగారు ధరల హెచ్చు, తగ్గుదలకు కారణం అవుతోంది.

నిన్న హైదరాబాద్ మార్కెట్లో 10గ్రాములు 24 క్యారెట్ పసిడి ధర రూ. 63,160 కాగా ఈరోజు తులంపై రూ.10 తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో తులం 24 క్యారెట్ బంగారం ధర రూ. 63,150 కి చేరింది. ఇక 10గ్రాములు 22 క్యారెట్ బంగారం ధర నిన్న రూ. 57,900 ఉండగా ఈరోజు తులంపై రూ.10 తగ్గుదల కనిపిస్తోంది. అంటే రూ.57,890 కి చేరింది. ఈవారం మొత్తం ఇలాగే కొనసాగే అవకాశం ఉందంటున్నారు మార్కెట్ నిపుణులు. ఇక వెండి విషయానికొస్తే నిన్న, మొన్నటి వరకు కిలో వెండి రూ.76,500 కాగా ఈరోజు కిలోపై రూ. 100 పెరిగి 76,600 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. హైదరాబాద్‌తో పాటూ పలు ప్రధాన నగరాల్లో బంగారం,వెండి ధరలు ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇవి కూడా చదవండి

10 గ్రాముల 24క్యారెట్ బంగారం ధర

  • హైదరాబాద్..రూ. 63,150
  • విజయవాడ..రూ. 63,150
  • ముంబాయి..రూ. 63,150
  • బెంగళూరు..రూ. 63,150
  • చెన్నై..రూ. 63,700

10గ్రాముల 22క్యారెట్ బంగారం ధర

  • హైదరాబాద్..రూ. 57,890
  • విజయవాడ..రూ. 57,890
  • ముంబాయి..రూ. 57,890
  • బెంగళూరు..రూ. 57,890
  • చెన్నై..రూ.58,380

దేశంలోని ప్రధాన నగరాల్లో కిలో వెండి ధరలు ఇలా..

  • హైదరాబాద్..రూ. 76,600
  • విజయవాడ..రూ. 76,600
  • చెన్నై..రూ. 76,600
  • ముంబాయి..రూ. 75,100
  • బెంగళూరు..రూ. 72,600

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..