ATM Cards: వీసా, రూపే, మాస్టర్.. అసలు ఈ కార్డులకు అర్దం ఏంటి..? ఏది తీసుకుంటే మంచిది
క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు. ఈ రెండిటిల్లో ఏదైనా సరే వాటిపై మీరు వీసా, మాస్టర్, రూపే లాంటి పేర్లు చూసే ఉంటారు. పేర్లు ఎందుకు ఇలా డిఫరెంట్‌గా ఉంటాయనే అనుమానం మీకు వచ్చే ఉంటుంది. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.

బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతీఒక్కరికీ దాదాపు ఏటీఎం కార్డ్ ఉంటుంది. ఆ డెబిట్ కార్డులపై మీరు వీసా, మాస్టర్, రూపే, మాస్ట్రో అనే పేర్లు చూసే ఉంటారు. ఆన్‌లైన్లో ఈ కార్డులపై మీరు ఆఫర్లు చూసి ఉంటారు. కొన్ని ఫ్లాట్‌ఫామ్స్‌లో వీసా కార్డుపై ఆఫర్లు ఉంటే.. మరోకొన్నిసార్లు రూపే కార్డులపై ఆఫర్లు తీసుకొస్తారు. ఇటీవల వర్చువల్ విధానంలో కూడా కార్డులు అందుబాటులోకి వస్తు్న్నాయి. అంటే ఈ కార్డులను ఫిజికల్‌గా ఉపయోగించుకోలేము. ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్లు చేయడానికి మాత్రమే వర్చువల్ కార్డులను ఉపయోగించుకోవచ్చు. అసలు ఈ కార్డులకు అర్ధం ఏంటి..? ఎందుకు ఇలా డిఫరెంట్‌గా ఉంటాయి..? ఏ కార్డు తీసుకుంటే మంచిది? అనే విషయాలు తెలుసుకుందాం.
వీసా, మాస్టర్ కార్డులు
వీసా, మాస్టర్ కార్డులకు ప్రత్యేక ప్రయోజనం ఉంది. వీటిని మీరు విదేశాల్లో కూడా వాడుకోవచ్చు. ఈ రెండు కార్డులు మంచి ఆఫర్లతో పాటు అనేక బెనిఫిట్స్ కూడా అందిస్తున్నాయి. అలాగే ఇండియాలో వినియోగంలో వీసా కార్డు తొలి స్థానంలో ఉండగా..ఆ తర్వాత మాస్టర్ రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇక వీసా కార్డుల్లో అనేక రకాలు ఉంటాయి. వీసా క్లాసిక్, వీసా ప్లాటినం, వీసా గోల్డ్, వీసా సిగ్నేచర్ వంటివి ఉంటాయి. వీటిల్లో ఒక్కదానిలో ఆఫర్లు, సౌకర్యాలు వేర్వేరు వేర్వేరుగా ఉంటాయి.
రూపే కార్డు
రూపే కార్డు ఇండియాలో బాగా పాపులర్ అయింది. NPCI ఈ కార్డును సృష్టించింది. ఈ కార్డు ఇండియాలో చాలామంది వాడుతున్నారు. ఈ కార్డు తక్కువ ఛార్జీలు వసూలు చేయడంలో గుర్తింపు పొందింది. అంతేకాకుండా క్రెడిట్ కార్డులను యూపీఐ యాప్స్‌తో కూడా లింక్ చేసుకుని వాడొచ్చు.
మాస్ట్రో కార్డు
ఈ కార్డును 1991లో ప్రవేశపెట్టారు. దీని ద్వారా విదేశాల్లో చెల్లింపులు చేయవచ్చు. మీరు ఏదైనా డెబిట్ కార్డు తీసుకునే సమయంలో దాని ఫీజులు, ఏటీఎం లిమిట్స్, అంతర్జాతీయ సౌకర్యం వంటి ఫీచర్లు చూసి తీసుకుంటే మంచింది.




