Gold Hallmarking: హాల్‌మార్క్‌ మాండేటరీతో బంగారం మోసాలకి ఫుల్‌ స్టాప్‌.. అసలు ఏంటీ గోల్డ్‌ మార్క్‌..?

హాల్‌ మార్క్‌.. ఇదే ఇకపై గోల్డ్‌ మార్క్‌... ఇకపై బంగారం స్వచ్ఛతకి నిఖార్సైన పూచీ ఇదే. యిప్పుడిదే పదం దేశవ్యాప్తంగా హల్‌చల్‌ చేస్తోంది. మీ బంగారం స్వచ్ఛతను నిగ్గుతేల్చే అత్యున్నత ప్రమాణం హాల్‌ మార్క్‌ని కేంద్రం తప్పనిసరి చేసింది. ఇకపై మీరు కొనే బంగారం స్వచ్ఛతని కొలుచుకోవాల్సిన పనిలేదు. కేంద్రం తీసుకున్న హాల్‌మార్క్‌ మాండేటరీ బంగారం క్రయవిక్రయాల్లో మోసాలకి ఫుల్‌ స్టాప్‌ పెట్టనుంది. అసలు ఏంటీ గోల్డ్‌ మార్క్‌? ఏమా కథ?

Gold Hallmarking: హాల్‌మార్క్‌ మాండేటరీతో బంగారం మోసాలకి ఫుల్‌ స్టాప్‌.. అసలు ఏంటీ గోల్డ్‌ మార్క్‌..?
Follow us
Sanjay Kasula

|

Updated on: Jun 01, 2022 | 8:00 PM

సాధారణంగా మనం నగలు, డిజైన్‌, పనితనంపై చూపే శ్రద్ధ ఆ నగను గుర్తించడంలో చూడం. అప్పటికే చాలా నగలు, రకరకాల డిజైన్లు చూసి ఉంటాం కాబట్టి, ఒకటి సెలక్ట్‌ చేసుకోగానే హమ్మయ్య అంటాం. కాని, నగను సెలక్ట్‌ చేసుకున్న తర్వాత దాన్ని ముందు, వెనుక ఉండే సింబల్స్ చూడాలి. హాల్‌మార్కింగ్‌ నగలు విక్రయించే ప్రతీ షాపు వారు తాము హాల్‌మార్కింగ్‌ నగలు మాత్రమే విక్రయిస్తామని బోర్డు పెట్టాలి. దానికి సంబంధించి BIS జారీ చేసిన సర్టిఫికేట్‌ను కూడా డిస్‌ప్లే చేయాలి. హాల్‌ మార్కింగ్‌ గుర్తును చేసేందుకు కనీసం 10 రెట్లు ఎక్కువ చేసి చూపే మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ అంటే భూతద్దం షాపులో ఉండాలి. హాల్‌ మార్కింగ్‌ కోసం మీరు చూసేటప్పుడు ముందు BIS అంటే బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్‌ లోగో ఉంటుంది. ఆ తర్వాత కనిపించే సంఖ్య బంగారం ప్యూరిటీని తెలియజేస్తుంది. ఆ తర్వాత ఉండేది అస్సె సెంటర్‌ పేరు అంటే ఏ కేంద్రంలో అయితే దాన్ని నిర్థారించారో ఆ కేంద్రం వివరాలు. ఆ తర్వాత తయారీదారు అంటే నగల వర్తకుడి గుర్తింపు సంఖ్య ఉంటుంది. అలాగే ఏ సంవత్సరం ఆ నగకు హాల్‌మార్కింగ్‌ ఇచ్చారో అది ఉంటుంది. ఇప్పుడు కొత్తగా HUID నెంబర్‌ కూడా చేర్చబోతున్నారు. HUID అంటే మనకు ఇస్తున్న ఆధార్‌ లాంటి సంఖ్య వంటిది. అంటే ఒక నగకు ఒక నెంబర్‌ ఇచ్చారంటే అది మరొక నగకు కేటాయించరు. HUID అంటే హాల్‌మార్కింగ్‌ యూనిక్‌ ఐడీ నెంబర్‌.

ఒకప్పుడు బంగారమంటే సంపన్నుల ఇళ్ళకే పరిమితమైన పదం. కానీ దాని ఖరీదు చుక్కలనంటుతోన్నా ఆ బంగారానికి గిరాకీ తగ్గిందీ లేదు. దాని కళ తప్పిందీ లేదు. అయితే ఒకప్పటిలా బంగారాన్ని ఆభరణంలా మాత్రమే చూసే స్థితి లేదు. బంగారం ఇప్పుడొక భరోసా. బంగారం ఇప్పుడొక పెట్టుబడి. బంగారం ఇప్పుడు భవిష్యత్తుకి ఒక పూచీ. షేర్‌ మార్కెట్‌ ఢమాల్‌ మన్నా బంగారం ధర ఆకసానికెగురుతుంది.

ఇకపై ఈ బంగారానికి మంచి రోజులొస్తున్నాయా? అన్న ప్రశ్నకు అవుననే సమాధానమిస్తోంది కేంద్రం నిర్ణయం. ఇకనుంచి బంగారానికి హాల్‌ మార్క్‌ని మాండేటరీ చేశారు. అది లేకుండా అమ్మే అర్హత ఏ బంగారం షాపుకీ ఉండదు. అసలింతకీ ఏమిటీ హాల్‌ మార్క్‌? దీని ప్రాధాన్యతేమిటి? ఇప్పుడదే సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. నిజానికి నిఖార్సైన బంగారానికి నిజమైన భరోసాయే హాల్‌ మార్క్‌.

ఇవి కూడా చదవండి

బంగారం కొనేటప్పుడు మొదట తెలుసుకోవాల్సింది గోల్డ్‌ ప్యూరిటీ… 916 గోల్డ్‌ అయితేనే కొనుగోలు చేయాలి. అందుకు హాల్‌ మార్క్‌ అనేది కేంద్రం నిర్ణయించిన క్వాలిటీ నిర్ధారణా ప్రమాణం. ఇది బ్యూరో ఆఫ్‌ స్టాండర్డ్స్‌(BIS) సంస్థ నిర్ణయిస్తుంది. లోహ స్వచ్ఛతా ప్రమాణాలను నిర్దేశించడానికి హాల్‌మార్క్‌ విధానాన్ని కేంద్రం అమలులోకి తెచ్చింది. హాల్‌ మార్క్‌లేని బంగారు ఆభరణాలను అమ్మడం ఇకపై నేరమౌతుంది.

బంగారాన్ని కొనుగోలు చేసేటప్పుడు బంగారం ధరతో పాటు తరుగు, మజూరీ ఏంటో కనుక్కుంటారు. ఇంతకీ తరుగంటే ఏమిటి? అంటే వివిధ దశల్లో బంగారాన్ని కాల్చడం, కరిగించడం, సుత్తితో కొట్టడం, మిషన్లపై తీగలుగా మార్చడం, డిజైన్లు తీయడం, మెరుగు పెట్టడం ఇలా చేసే ప్రక్రియలో స్వల్ప మెతాదులో బంగారం వృథా అవుతుంది. దీనినే తరుగు లేదా వేస్టెజ్ అంటారు.

బంగారం నాణ్యత లేదా స్వచ్ఛతను 24 క్యారెట్ల రూపంలో కొలుస్తారు. 24 క్యారెట్ల బంగారం అంటే 99.99 శాతం స్వచ్ఛమైదని అర్థం. ఈ బంగారాన్ని ఆభరణంగా మలచాలంటే మాత్రం అందులో ఒక్కో ప్రాంతంలో ఒక్కో లోహాన్ని మిళితం చేస్తారు. 24 క్యారెట్ల బంగారం సున్నితంగా ఉండటంతో దీనితో ఆభరణాలు తయారు చేయడం కష్టం. రాగి, వెండి, కాడ్మియం, జింక్ వంటి ఇతర లోహాలను కలిపితేనే ఆభరనం తయారౌతుంది.

బంగారంలో కలిపిన ఇతర లోహాల శాతం ఆధారంగా బంగారం స్వచ్ఛత అంటే 22 క్యారెట్లు, 18 క్యారెట్లుగా నిర్ణయిస్తారు. 22 క్యారెట్ల బంగారం అంటే అందులో 91.6 శాతం బంగారం, 8.4 శాతం కలిపిన ఇతర లోహాలు ఉంటాయి. అలాగే 18 క్యారెట్లు అంటే బంగారం స్వచ్ఛత 75 శాతం, ఇతర లోహాలు 25 శాతం ఉన్నాయని అర్థం. 14 క్యారెట్లలో బంగారం 58.5 శాతం, 12 క్యారెట్లలో 50 శాతం, 10 క్యారెట్లలో 41.7 శాతానికి మించి బంగారం ఉండదు. అయితే సాధారణంగా 22 క్యారెట్ల బంగారంతోనే ఆభరణాలు తయారు చేస్తారు. డైమండ్‌ జ్యువెలరీకి మాత్రం 18 క్యారెట్‌ గోల్డ్‌ని ఉపయోగిస్తారు. మీరు కొనే బంగారంలో నిఖార్సైన బంగారానికి షాపు వారు ఇచ్చే పూచీయే హాల్‌మార్క్‌.

గతంలో కొన్ని షాపుల్లో మాత్రమే ఈ హాల్‌మార్క్‌ విధానాన్ని పాటించారు. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం హాల్‌మార్క్‌ ని తప్పనిసరి చేసింది. యిప్పటికే 2021 జూన్‌ 23 నుంచి 256 జిల్లాల్లో హాల్‌ మార్కింగ్‌ విధానాన్ని తప్పనిసరి చేశారు. ప్రతి గోల్డ్‌ షాపు నాణ్యమైన హాల్‌మార్క్‌ బంగారాన్నే అమ్ముతామని హామీ ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడే వారికి అనుమతి ఇస్తారు.

నగల్లోపలివైపు దానికి సంబంధించిన స్వచ్ఛత, హాల్‌మార్కింగ్‌ సెంటర్‌ కోడ్‌ ఉంటుంది. అది ఉందోలేదో నిర్ధారించుకోవాలి. బిల్లులో కొన్న వస్తువుకి సంబంధించిన పూర్తి సమాచారం ఉండాలి. రాళ్ల తూకం విడిగా నమోదు చేయాలి. ఇవన్నీ ఇకపై బంగారం షాపులు తప్పనిసరిగా పాటించాల్సిందే. లేదంటే ఆ షాపుని మూసేసే అధికారం సైతం ప్రభుత్వానికి ఉంటుంది.

హాల్‌ మార్క్‌ గోల్డ్‌మార్క్‌కి మరింత విలువనద్దుతుంది. కేంద్రం నిర్ణయం ఇప్పుడు వినియోగదారులకు మోసపోయే ప్రమాదం చాలా తక్కువేనన్నది నిర్వివాదాంశం

భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?