Gold Loan: ఈ బ్యాంకులలో గోల్డ్‌లోన్‌ చాలా చౌక..! తక్కువ వడ్డీ.. సులువైన వాయిదాలు..

uppula Raju

uppula Raju |

Updated on: Sep 07, 2021 | 9:45 AM

Gold Loan: మీకు అత్యవసరంగా డబ్బు అవసరమైతే గోల్డ్‌ లోన్‌ మంచి ఎంపిక అవుతుంది. గోల్డ్‌పై మీరు స్వల్ప కాలానికి

Gold Loan: ఈ బ్యాంకులలో గోల్డ్‌లోన్‌ చాలా చౌక..! తక్కువ వడ్డీ.. సులువైన వాయిదాలు..
Gold Loan
Follow us

Gold Loan: మీకు అత్యవసరంగా డబ్బు అవసరమైతే గోల్డ్‌ లోన్‌ మంచి ఎంపిక అవుతుంది. గోల్డ్‌పై మీరు స్వల్ప కాలానికి రుణం తీసుకోవచ్చు. అవసరం లేనప్పుడు క్లోజ్‌ చేసుకోవచ్చు. వడ్డీ రేటు గురించి మాట్లాడితే ఇతర రుణాల కంటే చాలా తక్కువగా ఉంటుంది. అంతేకాదు లోన్ కూడా సులభంగా మంజూరవుతుంది. మీరు గోల్డ్ లోన్ తీసుకోవాలనుకుంటే ఏం చేయాలి. వడ్డీ ఎంత చెల్లించాల్సి తదితర విషయాలు తెలుసుకోండి.

గోల్డ్ లోన్ అంటే ఏమిటి? ఈ లోన్‌లో భాగంగా మీరు మీ బంగారాన్ని బ్యాంకులో డిపాజిట్ చేయాలి. బంగారం రేటు ప్రకారం రుణం మంజూరవుతుంది. ఇతర రకాల రుణాలతో పోలిస్తే బంగారు రుణంపై వడ్డీ రేటు తక్కువగా ఉంటుంది. బంగారం స్వచ్ఛత, మార్కెట్ విలువ ఆధారంగా మీరు పొందే రుణ మొత్తం ఆధారపడి ఉంటుంది. 18 క్యారెట్లు లేదా అంతకంటే ఎక్కువ స్వచ్ఛత కలిగిన ఆభరణాలపై రుణం సులువుగా లభిస్తుంది. గ్రాము బంగారం ఆధారంగా రుణం లెక్కిస్తారు. బంగారం రుణం కోసం క్రెడిట్ స్కోరు అవసరం లేదు.

ఎంత రుణం తీసుకోవచ్చు? గోల్డ్ లోన్‌లో మీరు మీ బంగారం ప్రకారం 10 వేల నుంచి1 కోటి వరకు రుణం తీసుకోవచ్చు. ఇందులో మీ బంగారంలో 75 శాతం వరకు రుణం పొందవచ్చు. రుణ మొత్తం 22 క్యారెట్ల బంగారం ఆధారంగా లెక్కిస్తారు. తక్కువ క్యారెట్ బంగారం ఉంటే దాని ప్రకారం లోన్ నిర్ణయిస్తారు. ఉదాహరణకు మీ వద్ద లక్ష రూపాయల బంగారం ఉందని అనుకుందాం అప్పుడు మీరు 75 వేల రూపాయల వరకు రుణం తీసుకోవచ్చు.

వడ్డీ ఎంత? పంజాబ్, సింధ్ బ్యాంక్‌లో 7 శాతం, కెనరా బ్యాంక్‌లో 7.35 శాతం, SBI లో 7.50 శాతం, ఇండియన్ బ్యాంక్‌లో 7.50 శాతం, యూనియన్ బ్యాంక్‌లో 8.20 శాతం, బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 8.45 శాతం , UCO బ్యాంక్‌లో 8.50 శాతం. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 8.75 శాతంతో వడ్డీ చెల్లించాలి.

గోల్డ్ లోన్ ఎందుకు మంచిది? గోల్డ్ లోన్ తీసుకోవడం ద్వారా కస్టమర్ అప్పుల ఊబిలో పడడు. అలాగే మీ వద్ద డబ్బు ఉన్నప్పుడు రుణ మొత్తాన్న చెల్లించి బంగారం తీసుకోవచ్చు. దీనిలో మీరు కేవలం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు మీ బంగారం కూడా భద్రంగా ఉంటుంది.

Vinayaka Chavithi: ఇంట్లోనే బంకమట్టితో వినాయక విగ్రహం సులభంగా తయారీ.. స్టెప్ బై స్టెప్..

Viral Video: స్కూటీ మీద వెళుతున్న ఇద్దరు.. ఇంతలో కొండపై నుంచి పడ్డ భారీ రాళ్ళు.. తరువాత ఏం జరిగిందో మీరే చూడండి!

భారత్ లో అనూహ్యంగా పెరుగుతున్న కిడ్నీ సమస్య..! సమస్యను గుర్తించడం ఎలా..?(వీడియో): Kidney Problem

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Click on your DTH Provider to Add TV9 Telugu