Gold Prices: పసిడి ప్రియులకు శుభవార్త.. ఇకపై భారీగా తగ్గనున్న బంగారం, వెండి రేట్లు.. ఎందుకంటే..
Gold Prices: దేశంలో రానున్న రోజుల్లో బంగారం ధరలు తగ్గే అవకాశం ఉంది. దీనికి ప్రధాన కారణం అమెరికాలో వడ్డీ రేటు పెంపుగా తెలుస్తోంది. అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ బుధవారం కీలక వడ్డీ రేట్లను ప్రకటించనుంది.
Gold Prices: దేశంలో రానున్న రోజుల్లో బంగారం ధరలు తగ్గే అవకాశం ఉంది. దీనికి ప్రధాన కారణం అమెరికాలో వడ్డీ రేటు పెంపుగా తెలుస్తోంది. అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ బుధవారం కీలక వడ్డీ రేట్లను ప్రకటించనుంది. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఆర్థికవేత్తలు ఈసారి ఫెడ్ రిజర్వ్ 28 ఏళ్లలో అతిపెద్ద రేటు పెంపును చేయవచ్చని అంచనా వేస్తున్నారు. US సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేటులో 0.75 శాతం పెంపును ప్రకటించవచ్చు. నవంబర్ 1994 తర్వాత వడ్డీ రేటులో ఇంత భారీ పెరుగుదల ఇదే తొలిసారి. వడ్డీ రేట్ల పెరుగుదల వల్ల డాలర్ మరింతగా బలపడుతుంది. దీని ప్రత్యక్ష ప్రభావం బంగారం ధరల పతనం రూపంలో కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు కూడా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి.
దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్‌లోనూ బంగారం ధర తగ్గుముఖం పట్టింది. MCX ఎక్స్ఛేంజ్‌లో.. ఆగస్ట్ 5, 2022న డెలివరీ చేయాల్సిన బంగారం విలువ ఈ రోజు సాయంత్రానికి.. 10 గ్రాములకు రూ. 366 తగ్గి రూ. 50,398 వద్ద ట్రేడవుతోంది. ప్రపంచవ్యాప్తంగా కూడా బంగారం ఫ్యూచర్స్ రేట్లు తగ్గుతున్నాయి.
బంగారంతో పాటు వెండి ఫ్యూచర్స్ ధర కూడా ఈ రోజు పడిపోయాయి . MCXలో జూలై 5, 2022న డెలివరీ అయ్యే వెండి కిలో ధర రూ. 60,134 వద్ద ట్రేడవుతోంది. ఈ రోజు సాయంత్రం వెండి ఫ్యూచర్స్ విలువ రూ. 177 మేర తగ్గింది. గ్లోబల్‌గా కూడా వెండి ఫ్యూచర్స్ ధర మంగళవారం సాయంత్రం క్షీణించాయి. బ్లూమ్‌బెర్గ్ ప్రకారం.. మంగళవారం సాయంత్రం Comexలో బంగారం గ్లోబల్ ఫ్యూచర్స్ ధర 0.57 శాతం లేదా 10.40 డాలర్లు తగ్గి ఔన్స్ 1821.40 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అదే సమయంలో.. వెండి గ్లోబల్ ఫ్యూచర్స్ ధర Comexలో 0.35 శాతం తగ్గింది.