Fitch Rating: రిజర్వు బ్యాంక్ రేట్లు మరింత పెంచుతుందన్న ఫిచ్ రేటింగ్ సంస్థ.. ఎంతంటే..

Fitch Rating: భారత రిజర్వ్ బ్యాంక్ డిసెంబర్ 2022 నాటికి వడ్డీ రేట్లను 5.9 శాతానికి పెంచే అవకాశం ఉందని ఫిచ్ రేటింగ్స్ ఈ రోజు తెలిపింది. ఈ క్రమంలో భారత ఆర్థిక వ్యవస్థపై పాజిటివ్ అవుట్ లుక్ ను తన నివేదికలో ఇచ్చింది.

Fitch Rating: రిజర్వు బ్యాంక్ రేట్లు మరింత పెంచుతుందన్న ఫిచ్ రేటింగ్ సంస్థ.. ఎంతంటే..
Rbi
Follow us

|

Updated on: Jun 14, 2022 | 7:40 PM

Fitch Rating: భారత రిజర్వ్ బ్యాంక్ డిసెంబర్ 2022 నాటికి వడ్డీ రేట్లను 5.9 శాతానికి పెంచే అవకాశం ఉందని ఫిచ్ రేటింగ్స్ ఈ రోజు తెలిపింది. గ్లోబల్ ఎకనామిక్ ఔట్‌లుక్‌కి అప్‌డేట్ చేసిన ఫిచ్, భారత ఆర్థిక వ్యవస్థ అధ్వాన్నంగా మారుతోందని, పెరిగిన వస్తువుల ధరలు, కఠినమైన ప్రపంచ ద్రవ్య విధానాన్ని ఎదుర్కొంటుందని పేర్కొంది. 2023 నాటికి కీలక వడ్డీ రేట్లను రిజర్వు బ్యాంక్ 6.15 శాతానికి పెంచుతుందని ఫిచ్ అంచనా వేసింది. గతంలో ఫిచ్ వడ్డీ రేటు పెంపు అంచనాను 5 శాతంగా అంచనా వేసింది. ద్రవ్యోల్బణం ఎనిమిదేళ్ల గరిష్ట స్థాయికి పెరిగి.. వినియోగదారులకు తీవ్ర సవాలుగా మారిందని ఫిచ్ అభిప్రాయపడింది.

మే నెలలో షెడ్యూల్ చేయని పాలసీ ప్రకటనలో.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు పెంచి 4.4 శాతానికి, ఆ తరువాత ఈ నెలలో మరో 50 బేసిస్ పాయింట్లు పెంచి 4.9 శాతానికి చేర్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ద్రవ్యోల్బణం 6.7 శాతంగా ఉంటుందని ఆర్‌బీఐ అంచనా వేసింది. ఈ క్రమంలో మే నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 7.04 శాతంగా నమోదైంది.

ఫిచ్ ప్రకారం.. కరోనా కేసులు మార్చి చివరి నాటికి తగ్గుముఖం పట్టినందున ఏప్రిల్-జూన్ త్రైమాసిక వృద్ధి వినియోగం పుంజుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలో రెండు సంవత్సరాల తరువాత ఫిచ్.. భారత రేటింగ్ ను నెగటివ్ నుంచి స్టేబుల్ కు మార్చింది. రానున్న కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ వేగంగానే పుంజుకుంటుందని, కానీ తాత్కాలికంగా స్వల్పకాలంలో చిన్న పాటి సమస్యలు ఎదురవుతాయని ఫిచ్ తన నివేదికలో అభిప్రాయం వ్యక్తం చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 8.7 శాతం వృద్ధి చెందగా.. ఈ ఆర్థిక సంవత్సరం అది 7.2 శాతంగా ఉంటుందని రిజర్వు  బ్యాంక్ అంచనా వేసింది.