బంగారం, వెండిపై పెరిగిన దిగుమతి సుంకం.. ఇవాళ ధరల్లో భారీ మార్పు..! హైదరాబాద్‌లో తులం ఎంతంటే..
బంగారం ప్రతి భారతీయుడి సెంటిమెంట్..పెళ్లి, పండగ, పుట్టిన రోజు ఇలా సందర్భం ఏదైనా సరే.. అన్ని శుభకార్యాల్లోనూ బంగారం, వెండి కొనుగోలు తప్పనిసరి. అలాంటి బంగారం ధరలు గత రెండేళ్లుగా ఆకాశంలో చుక్కలన్నంటుతున్నాయి. అయినప్పటికీ పసిడి ప్రియులు ఏమాత్రం తగ్గకుండా గోల్డ్ కొంటునే ఉన్నారు. కానీ, సామాన్య మధ్య తరగతి ప్రజలు మాత్రం పుత్తడి ఎప్పుడు నేలకు దిగి వస్తుందా అని ఎదురు చూస్తూనే ఉన్నారు. అలాంటి వారిపై కేంద్రం బాంబులాంటి వార్తను పేల్చింది..దాంతో రాబోవు రోజుల్లో బంగారం, వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అది ఎలా..? ఇవాళ్టి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..

భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. బంగారం, వెండి దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీని భారీగా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో 6 శాతంగా ఉన్న దిగుమతి సుంకాన్ని ఏకంగా 15 శాతానికి పెంచారు. ఇందులో 10 శాతం ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీ కాగా, మిగిలిన 5 శాతం వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధి సెస్ (AIDC) రూపంలో ఉంటుంది.
ఈ పెంపు నిర్ణయానికి ముందు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఒక ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. విదేశీ మారక నిల్వలను కాపాడుకోవడానికి వీలైనంత వరకు ఏడాది పాటు బంగారం కొనుగోళ్లను వాయిదా వేసుకోవాలని ఆయన సూచించారు. దేశ ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా అనవసర ఖర్చులను తగ్గించుకోవాలని ఆయన కోరారు. ఈ క్రమంలోనే బంగారం, వెండి ధరలు ఈ రోజు భారీగా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
భారతదేశంలో ఈ రోజు 24 క్యారెట్ల బంగారం ధర 10గ్రాములు రూ.1,53,990లకు పడిపోయింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర 10గ్రాములు రూ. 1,41,160లకు చేరింది. దేశంలోని ఢిల్లీ, ముంభై, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
చెన్నైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,56,340, 22 క్యారెట్ల ధర రూ.1,43,310 ఉంది. వెండి కిలో ధర రూ.3,00,100 లుగా ఉంది.
ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.1,54,140, 22 క్యారెట్ల ధర రూ.1,41,310 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,90,100 ఉంది.
ముంబైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,53,990, 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాముల ధర రూ.1,41,160 ఉంది. వెండి కిలో ధర రూ.2,90,100 లుగా ఉంది.
బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,53,990, 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాముల ధర రూ.1,41,160 ఉంది. వెండి కిలో ధర రూ.2,90,100 లుగా ఉంది.
కోల్‌కత్తాలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,53,990, 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాముల ధర రూ.1,41,160 ఉంది. వెండి కిలో ధర రూ.2,90,100 లుగా ఉంది.
హైదరాబాద్‌లో బంగారం 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,53,990, 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాముల ధర రూ.1,41,160 ఉంది. వెండి కిలో ధర రూ.3,00,100 లుగా ఉంది.
విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.1,53,990, 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాముల ధర రూ.1,41,160 ఉంది. వెండి కిలో ధర రూ.3,00,100 లుగా ఉంది.
బంగారం ఇలా ఉంటే, వెండి ఏకంగా కిలోకు రూ.100 లు పెరిగింది. వెండి గ్రాము ధర రూ. 300.10 లు ఉండగా, కేజీ సిల్వర్ ఏకంగా రూ.3,00,100కు చేరింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




