AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చెత్తలో పడేయాలనుకున్న కారు.. చివరికి రూ.47 లక్షల అదృష్టం తెచ్చింది!

అదృష్టం ఎప్పుడు ఎవరిని ఏ రూపంలో వరిస్తుందో చెప్పలేం. కొందరికి కష్టపడితే ఫలితం దక్కుతుంది. మరికొందరికి తమ చుట్టూ ఉన్న చిన్న చిన్న విషయాలే భారీ లాభాలను తెచ్చిపెడతాయి. ఒక్కోసారి అదృష్టం ఊహించని రూపంలో తలుపు తడుతుంది. ఒక మహిళ విషయంలో ఇదే జరిగింది. పనికిరాదని భావించి పక్కన పెట్టేసిన పాత కారు వారి పట్ల అదృష్ట దేవతలా మారింది. రాత్రికి రాత్రే వారిని ధనవంతులుగా మార్చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే...

చెత్తలో పడేయాలనుకున్న కారు.. చివరికి రూ.47 లక్షల అదృష్టం తెచ్చింది!
Lottery Winner Story
Jyothi Gadda
|

Updated on: May 12, 2026 | 10:39 AM

Share

అదృష్టం ఎప్పుడు, ఎలా వరిస్తుందో ఎవరూ ఊహించలేరు. అమెరికాలోని మేరీల్యాండ్‌కు చెందిన ఒక మహిళ తాను ఎన్నడూ ఊహించని అనుభవాన్ని పొందింది. తన ఇంటి నుండి తీసివేయాలని, కంటికి ఇబ్బందిగా ఉందని ఆమె భావించిన పాత కారు, చివరికి ఆమెను ధనవంతురాలిగా చేసింది. కారు లైసెన్స్ ప్లేట్‌పై ఉన్న నంబర్లను ఉపయోగించి, ఆ మహిళ 50,000 డాలర్ల (సుమారు రూ. 47 లక్షలు) భారీ బహుమతిని గెలుచుకుంది. పాత కారు నెంబర్‌ ప్లేట్‌తో వారు రాత్రికి రాత్రే ఎలా ధనవంతులు అయ్యారంటే..

సమాచారం ప్రకారం.. మేరీల్యాండ్‌లో నివసించే సదరు మహిళ తన పాత కారుపై ఉన్న లైసెన్స్ ప్లేట్ నంబర్లను ఎంతో కాలంగా గుర్తుంచుకుంది. సాధారణంగా చాలామంది లక్కీ నంబర్లనో లేదా పుట్టినరోజు తేదీలనో లాటరీలో ఉపయోగిస్తుంటారు. కానీ, ఈమె మాత్రం తన పాత కారు నంబర్లను నమ్మి పిక్ 5 (Pick 5) అనే లాటరీ గేమ్‌లో పెట్టుబడి పెట్టింది.

ఆమె ఎంచుకున్న 5 అంకెల నంబర్లు లాటరీ ఫలితాల్లో సరిగ్గా సరిపోయాయి. దీనితో ఆమె ఏకంగా 50,000 డాలర్లు గెలుచుకుంది. భారతీయ కరెన్సీలో దీని విలువ సుమారు 47 లక్షల రూపాయలకు పైమాటే. లాటరీ కార్యాలయానికి వెళ్లి తన బహుమతిని అందుకున్నప్పుడు ఆమె ఆనందానికి అవధులు లేవు. నా పాత కారు నంబర్లు నాకు ఎప్పటికీ గుర్తే ఉంటాయి. కానీ, అవి నాకు ఇంత పెద్ద బహుమతిని ఇస్తాయని నేను కలగనలేదు అని ఆమె సంతోషం వ్యక్తం చేసింది.

ఇవి కూడా చదవండి

చాలామంది లాటరీలో ఒకసారి ఓడిపోగానే ప్రయత్నాలు విరమిస్తారు. కానీ, ఈ మహిళ మాత్రం స్థిరంగా తన నంబర్లను నమ్ముతూ ప్రయత్నం చేస్తూనే ఉంది. చివరికి ఆ పాత కారు జ్ఞాపకాలు ఆమె ఆర్థిక స్థితిని మార్చేశాయి. గెలుచుకున్న ఈ మొత్తాన్ని తన భవిష్యత్తు అవసరాల కోసం, కుటుంబం కోసం ఖర్చు చేయనున్నట్లు ఆమె తెలిపింది. ఈ వింత సంఘటన ఇప్పుడు నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు ఆమె అదృష్టాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. కొన్నిసార్లు పాత వస్తువులను వదిలించుకున్నా, వాటికి సంబంధించిన జ్ఞాపకాలు లేదా నంబర్లు ఇలాంటి అద్భుతాలను సృష్టిస్తుంటాయని నెటిజన్లు పెద్ద సంఖ్యలో కామెంట్ చేశారు.

ఇదిలా ఉండగా, సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ వార్తను కొందరు పాత న్యూస్ కొట్టి పారేస్తున్నారు. కానీ, ఇంటర్నెట్ లో మాత్రం మహిళ అదృష్టానికి కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us