AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price: భగ్గుమంటున్న బంగారం ధర.. రూ.1.10 లక్షలు దాటనుందా? వెండి ధర వింటే షాకవుతారు!

Gold Price: భారతదేశంలో బంగారం, వెండి ధరలు ఎక్కువగా అంతర్జాతీయ మార్కెట్లపై ఆధారపడి ఉంటాయి. దీనితో పాటు, రూపాయి-డాలర్ మారకం రేటు కూడా పెద్ద ప్రభావాన్ని చూపుతుంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి బలహీనపడి, ప్రపంచ ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, భారతీయ కొనుగోలుదారులకు..

Gold Price: భగ్గుమంటున్న బంగారం ధర.. రూ.1.10 లక్షలు దాటనుందా? వెండి ధర వింటే షాకవుతారు!
Gold Price: బులియన్‌ మార్కెట్లో బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతున్నాయి. ఒక స్వల్పంగా పెరిగితో మరో రోజు అంతకు రెట్టింపుగా పెరుగుతోంది. జూలై 29న ఉదయం 6 గంటల సమయానికి బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. అంటే తులం బంగారం ధర 99 వేల్లోనే ట్రేడయ్యింది. కానీ మధ్యాహ్నం 12 గంటల సమయానికి పరిశీలిస్తే భారీగా ఎగబాకింది. బంగారం కొనుగోలు చేసే మహిళలకు గట్టి షాకిచ్చింది. ఇప్పుడు 24 క్యారెట్ల పది గ్రాముల ధరపై ఏకంగా 660 రూపాయలు పెరిగి 1 లక్షా 480 రూపాయల వద్ద కొనసాగుతోంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాములపై 600 రూపాయల మేరకు పెరిగి తులం ధర 92,210 వద్ద కొనసాగుతోంది.
Subhash Goud
|

Updated on: Jul 23, 2025 | 10:08 PM

Share

దేశంలో బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. తగ్గేదేలే అంటూ పరుగులు పెడుతోంది. ఢిల్లీ బులియన్ మార్కెట్లో వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. స్టాకిస్టులు కొనుగోళ్లు చేయడంతో బుధవారం వెండి కిలోకు రికార్డు స్థాయిలో పెరిగి కిలో వెండి ధర.1,18,000కు చేరుకుంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,040 పెరిగి రూ.1 లక్షా2,330లకు చేరుకుంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాములకు రూ.950 పెరిగి రూ.93,800కు చేరుకుంది. ప్రపంచ అనిశ్చితి, పారిశ్రామిక డిమాండ్ పెరుగుదల కారణంగా బంగారం, వెండి ధరల్లో ఈ పెరుగుదల జరిగింది.

ఇది కూడా చదవండి: Honda: స్టైలిష్‌ లుక్‌తో హోండా నుంచి రెండు పవర్‌ఫుల్‌ బైక్‌లు.. ఫీచర్స్‌ అదుర్స్‌!

ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం, 99.9 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం 10 గ్రాములకు రూ.1,040 పెరిగి రూ.1,02330కి చేరుకుంది (అన్ని పన్నులతో సహా). గత ట్రేడింగ్ సెషన్‌లో ఇది 10 గ్రాములకు రూ.1,01,020 వద్ద ముగిసింది. అంటే బంగారం ధరలు గణనీయంగా పెరిగాయి. అయితే రానున్న రోజుల్లో తులం బంగారం ధర లక్షా 10 వేలు దాటవచ్చని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Ratan Tata: రతన్‌ టాటా ఇల్లు ఎలా ఉంటుందో తెలుసా? దీని విలువ ఎన్ని కోట్లు?

భారతదేశంలో బంగారం, వెండి ధరలు ఎక్కువగా అంతర్జాతీయ మార్కెట్లపై ఆధారపడి ఉంటాయి. దీనితో పాటు, రూపాయి-డాలర్ మారకం రేటు కూడా పెద్ద ప్రభావాన్ని చూపుతుంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి బలహీనపడి, ప్రపంచ ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, భారతీయ కొనుగోలుదారులకు ధరలు ఖరీదైనవి అవుతాయి. దీనితో పాటు, వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణ ధోరణులు కూడా ధరలను ప్రభావితం చేస్తాయి. సాధారణంగా బంగారం, వెండి ధరలు ఒకే దిశలో కదులుతాయి. ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉన్నప్పుడు, వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నప్పుడు, ఈ విలువైన లోహాలకు డిమాండ్ పెరుగుతుంది. ఇది ధరలను కూడా పెంచుతుంది.

ఇది కూడా చదవండి: New Expressway: ఇప్పుడు 6 గంటల ప్రయాణం కేవలం 2 గంటల్లోనే..

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి