AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: మరోసారి తగ్గిన బంగారం ధర.. తులం గోల్డ్‌ ఎంతకు చేరిందో తెలుసా.?

మొన్నటి వరకు ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పడుతు వస్తున్నాయి. ముఖ్యంగా కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తర్వాత గోల్ఢ్‌ ధరలు భారీగా తగ్గుతున్నాయి. రూ. 80 వేల మార్క్‌కు చేరుకున్న తులం బంగారం ధర ఒక్కసారిగా రూ. 68 వేల స్థాయికి తగ్గడం విశేషం. తాజాగా బుధవారం కూడా దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో...

Gold Price Today: మరోసారి తగ్గిన బంగారం ధర.. తులం గోల్డ్‌ ఎంతకు చేరిందో తెలుసా.?
Gold Price Today
Narender Vaitla
|

Updated on: Jul 31, 2024 | 6:30 AM

Share

మొన్నటి వరకు ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పడుతు వస్తున్నాయి. ముఖ్యంగా కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తర్వాత గోల్ఢ్‌ ధరలు భారీగా తగ్గుతున్నాయి. రూ. 80 వేల మార్క్‌కు చేరుకున్న తులం బంగారం ధర ఒక్కసారిగా రూ. 68 వేల స్థాయికి తగ్గడం విశేషం. తాజాగా బుధవారం కూడా దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలో తగ్గుదల కనిపించింది. ఇంతకీ లేటెస్ట్ గోల్డ్ ప్రైజ్‌ ఎలా ఉంది.? దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరల పొజిషన్‌ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..

* దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 63,340కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 69,090 వద్ద కొనసాగుతోంది.

* ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబయి విషయానికొస్తే ఇక్కడ 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 63,190కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 68,940 వద్ద కొనసాగుతోంది.

* చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 63,840కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 69,640వద్ద కొనసాగుతోంది.

* బెంగళూరు విషయానికొస్తే ఇక్కడ 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 63,190కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 68,940 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..

* హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 63,190గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 68,940 వద్ద కొనసాగుతోంది.

* విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 63,190కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 68,940గా ఉంది.

* ఇక సాగరనగరం విశాఖలో కూడా 22 క్యారెట్ల తులం గోల్డ్ ధర రూ. 63,190, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 68,940 వద్ద కొనసాగుతోంది.

వెండి ధర విషయానికొస్తే..

వెండి ధర కూడా తగ్గుముఖం పట్టింది. బుధవారం దేశంలోని పలు అన్ని ప్రధాన నగరాల్లో కిలో వెండిపై రూ. 100 వరకు తగ్గింది. దీంతో న్యూఢిల్లీతో పాటు కోల్‌కతా, ముంబయి, పుణె వంటి నగరాల్లో కిలో వెండి ధర రూ. 84,600 వద్ద కొనసాగుతోంది. అలాగే హైదరాబాద్‌, కేరళ, చెన్నై, విజయవాడ, విశాఖల కిలో వెండి ధర రూ. 88,900వద్ద కొనసాగుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
పరివర్తన యోగం..ఆ రాశుల వారి ఇంట్లోకి ధన ప్రవాహం ఖాయం!
పరివర్తన యోగం..ఆ రాశుల వారి ఇంట్లోకి ధన ప్రవాహం ఖాయం!
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్
నిరుద్యోగ అభ్యర్థులకు IBPS భారీ అవకాశం.. నేటి నుంచే దరఖాస్తులు
నిరుద్యోగ అభ్యర్థులకు IBPS భారీ అవకాశం.. నేటి నుంచే దరఖాస్తులు
ఆ స్టార్ హీరో సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న భామ
ఆ స్టార్ హీరో సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న భామ