Business Ideas: పది మందికి ఉపాధి ఇస్తూ.. లక్షలు సంపాదించే బిజినెస్! చాలా మందికి తెలియదు.. మీరే ఫస్ట్ స్టార్ట్ చేయొచ్చు!
గ్లాస్ కుల్లెట్ బిజినెస్ అనేది తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు ఆర్జించే వినూత్న వ్యాపార ఆలోచన. ఖాళీ గాజు సీసాలను సేకరించి, వాటిని క్రష్ చేసి పౌడర్‌గా మార్చి విక్రయించడం ద్వారా లక్షల్లో ఆదాయం పొందవచ్చు. ఇది పర్యావరణానికి మేలు చేయడమే కాకుండా, పది మందికి ఉపాధి కల్పించవచ్చు.

ఏదైనా వ్యాపారం చేస్తే కొత్తగా చేయాలి. అప్పుడే సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ. అలాంటి బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బిజినెస్ ఏంటంటే.. గ్లాస్ కుల్లెట్ బిజినెస్. గాజు సీసాలను సేకరించి వాటిని క్రష్ చేసి గ్రాస్ పౌడర్ తయారు చేసి అమ్మడమే. ఇలాంటిది ఒక బిజినెస్ ఉందని కూడా చాలా మందికి తెలియదు. మీరే మీ ఏరియాలో ప్రారంభించి లక్షల్లో ఆదాయం పొందవచ్చు. అలాగే ఓ పది మందికి ఉపాధి కల్పించవచ్చు.
ఈ బిజినెస్ ప్రారంభించడానికి ఒక చిన్న క్రషింగ్ మిషన్ కొనుగోలు చేయాలి. స్థానిక వైన్ షాపుల నుంచి బార్ షాపుల నుంచి ఖాళీ అయిన మద్యం సీసాలు తక్కువ ధరకు సేకరించి వాటిని నీటితో శుభ్రం చేసి, మిషన్‌లో వేసి క్రష్ చేసి పౌడర్‌లా బస్తాల్లో నింపి గాజు సీసాలు తయారు చేసి కంపెనీలకు అమ్మవచ్చు. ఆన్‌లైన్‌లో కూడా ఈ గ్లాస్ పౌడర్‌ను అమ్మొచ్చు. గాజు కలర్‌ను బట్టి కూడా ధర ఉంటుంది.
అయితే వ్యాపారం ప్రారంభించడానికి GST వంటి లైసెన్స్‌లు, కొన్ని ప్రభుత్వం అనుమతి పత్రాలు అవసరం అవుతాయి. గాజు తయారీలో ఇసుక, సున్నపురాయి వంటి వర్జిన్ పదార్థాల అవసరాన్ని తగ్గించడానికి కుల్లెట్ ముడి పదార్థంగా ఉపయోగించబడుతుంది. నిర్మాణ సామగ్రి వంటి ఇతర అనువర్తనాల్లో కూడా ఉపయోగించవచ్చు కాబట్టి వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. పెట్టుబడి కూడా పెద్దగా అవసరం లేదు. ముందు ఓ రూ.50 వేలతో క్రషింగ్ మిషన్ కొని, ఒక షెడ్డులు దాన్ని ఏర్పాటు చేసిన, దగ్గరల్లోని వైన్ షాపుల నుంచి ఓ రూ.5 వేల విలువైన ఖాళీ సీసాలు కొని వాటిని పౌడర్‌లా తయారు చేస్తే చాలు. సో మొత్తం కలిసి ఓ రూ.60 వేల పెట్టుబడి సరిపోతుంది. మిషన్ రూ.50 వేలు, సీసాలు రూ.5 వేలు, ఆ సీసాలు ట్రాన్స్‌పోర్ట్‌కు, వాటిని శుభ్రం చేసే కూలీలు, కరెంట్ బిల్ ఖర్చు కలిపి రూ.60 వేలతో ఈ గ్లాస్ కుల్టెట్ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




