Room Heater: రూ. 900లతో చుక్కలు చూపే చలికి చెక్.. క్షణాల్లోనే ఇంటిని వెచ్చగా మార్చే రూం హీటర్ ఇదే
Room Heater: ప్రస్తుతం చలితో జనాలు వణికిపోతున్నారు. స్వెట్టర్లు, దుప్పట్లతో చలి నుంచి తప్పించుకునేందుకు నానా పాట్లు పడుతున్నారు. ఇక రాత్రయితే ఇంట్లో చలికి సరిగ్గా నిద్రకూడా పోవడంలేదు. ఇలాంటి సమయంలో చాలామంది రూం హీటర్ల వైపు చూస్తున్నారు. తక్కువ ధరకే ఈ కామర్స్‌లో ఎన్నో రూం హీటర్లు అందుబాటులోకి వచ్చాయి.
Room Heater: చలికాలంలో వచ్చేసింది. ఇంటా, బయటా ఒకే చలి. ఇక రాత్రయితే దుప్పట్లు కప్పినా, చలి ఆగడంలేదు. కాలు కింద పెట్టాలంటే గజగజ వణికిపోతున్నారు జనాలు. ఈ క్రమంలో చాలామంది తమ గదులను హీట్ చేసేందుకు రూం హీటర్స్‌ని ఉపయోగిస్తున్నారు. ఇది గదిని వెచ్చగా, సౌకర్యవంతంగా ఉంచేలా సహాయపడుతుంటాయి. తక్కువ బడ్జెట్‌లో రూమ్ హీటర్ కోసం చూస్తున్నట్లయితే, రూ. 2000లలోపే ఉత్తమ ఎంపికలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ ధరలోపే మంచి నాణ్యమైన హీటర్లను పొందవచ్చు. ఇవి గదిని త్వరగా వేడి చేయడంలో సహాయపడుతాయి. ఈ హీటర్లు చిన్నగా ఉంటాయి. వీటిని ఎక్కడైనా సులభంగా ఉపయోగించవచ్చు.
ఈ క్రమంలో ఈ కామర్స్ సంస్థలు కూడా విపరీతమైన ఆఫర్లతో ముందుకువచ్చాయి. ఇందులో భాగంగా ఫ్లిప్‌కార్ట్ ఎన్నో రకాల రూం హీటర్లను తీసుకొచ్చింది. ఇందులో GESTOR BLAZE Neo Silent With Led Power Indicator & Powerfull Copor Motor Blower Fan Room Heater కూడా ఉ:ది. ఇది రూ. 900లలోపే ఇంటికి తెచ్చుకోవచ్చు.
ఈ రూం హీటర్ ఒరిజినల్ ధర రూ.3,490 లు ఉంది. అయితే, 75 శాతం తగ్గింపుతో ఆఫర్ చేస్తోంది. అంటే, ఈ రూం హీటర్‌ను కేవలం రూ.872లకే ఇంటికి తెచ్చుకోవచ్చన్నమాట.
GESTOR BLAZE రూం హీటర్ ఫీచర్ల విషయానికొస్తే.. ఇందలో 2000W హీట్ సెట్టింగ్స్‌తో అందించారు. ఓవర్‌హీట్ ప్రొటెక్షన్ కూడా ఇందులో ఉంది. అలాగే, ఆటో-రెవొల్వింగ్ హీటర్, ABS బాడీ మెటీరియల్ అందించారు. అలాగే ఐరన్ గ్రిల్ మెటీరియల్‌తోపాటు మరెన్నో ఫీచర్లు ఇందులో ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, గజ గజ వణించే చలి నుంచి బయటపడేందుకు ఈ రూం హీటర్‌ను ఇంటికి తెచ్చుకోండి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..