Flipkart Big Bachat Dhamaal: మరో బంపర్ ఆఫర్‌తో ముందుకొస్తున్న ఫ్లిప్‌కార్ట్.. ఉచితంగా వెండి నాణేలు..!
Flipkart Big Bachat Dhamaal: ఈకామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ వినియోగదారుల కోసం ఎన్నో ఆఫర్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇప్పటికే పండగ సీజన్‌లలో, ప్రత్యేక రోజుల్లో..
Flipkart Big Bachat Dhamaal: ఈకామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ వినియోగదారుల కోసం ఎన్నో ఆఫర్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇప్పటికే పండగ సీజన్‌లలో, ప్రత్యేక రోజుల్లో వివిధ ప్రొడక్ట్స్‌లపై ఆఫర్లను ప్రకటించింది. ఇక తాజాగా మరో అదిరిపోయే ఆఫర్‌తో ముందుకు వస్తోంది. బిగ్ బచన్ ధమాల్ పేరుతో ఈ కొత్త ఆఫర్ సేల్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఆఫర్ నవంబర్ 19 నుంచి 21వ తేదీ వరకు అందుబాటులో ఉంచనుంది. ఈ ఆఫర్లలో భాగంగా కస్టమర్లు డీల్స్‌ను కుదుర్చుకోవచ్చు.
ఈ ఆఫర్లలో భాగంగా ఉచిత డెలివరీ, తక్కువ ధరలు, ఈజీ రిటర్న్ వంటి బెనిఫిట్స్‌ను కస్టమర్లు పొందవచ్చు. అలాగే పేటీఎం కస్టమర్లకు రూ.50 వరకు క్యాష్‌బ్యాక్ అందుకోవచ్చు. అంతేకాకుండా వెండి నాణేలు కూడా పొందే అవకాశం ఉంటుంది. అలాగే ప్రతి గంటకు తొలి 50 మంది వినియోగదారులు ఈ ఆఫర్లలో భాగంగా సిల్వర్ కాయిన్స్ పొందవచ్చని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ఇలాంటి ఆఫర్లలో వినియోగదారులు తక్కువ ధరల్లో వివిధ ప్రోడక్ట్‌లను దక్కించుకోవచ్చు. కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఫ్లిప్‌కార్టు సంస్థ ఎన్నో ఆఫర్లు ప్రకటిస్తోంది. ఈ మధ్య కాలంలో ఆన్‌లైన్ షాపింగ్స్ కూడా భారీగానే పెరిగిపోయాయి.
ఇవి కూడా చదవండి: